తెలంగాణలో 10న విద్యా సంస్థల బంద్.!
Publish Date:Jul 7, 2026
Advertisement
తెలంగాణలో ఈ నెల 10 విద్యాసంస్థల బంద్ కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. రాష్ట్రంలో నెలకొన్న విద్యా రంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు ఈ బంద్ కు పిలుపు ఇఛ్చాయి. ఈ మేరకు బంద్‌ను జయప్రదం చేయాలని కోరుతూ వరంగల్ జిల్లా నెక్కొండలె ఏఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ, ఎస్ఎఫ్ఐల ఆధ్వర్యంలో మంగళవారం (జులై 7) పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ.. విద్యా రంగం పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిని గర్హించారు. దీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శలు గుప్పించారు. కాగా ఈ సందర్భంగా పలు డిమాండ్లను విద్యార్థి సంఘాల నాయకులు ప్రభుత్వం ముందు ఉంచారు. ఇవీ ఆ డిమాండ్లు... - బకాయి పడ్డ ఫీజు రీఇంబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. - ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లలో తాగునీరు, మరుగుదొడ్లు, నాణ్యమైన భోజనం. మౌలికవసతులు కల్పించాలి. - విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులను తక్షణమే భర్తీ చేయాలి. - ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఇష్టారాజ్యంగా పెంచుతున్న ఫీజులను నియంత్రించాలి. July10th, Long Standing. Pending, Problems, Poster
http://www.teluguone.com/news/content/bandh-of-educational-institutions-in-telangana-36-225294.html





