ఆ చేపలు.. ఒక్కొక్కటీ రూ.50 వేలు.. కచిడి చేపల ప్రత్యేకత ఏంటంటే?

Publish Date:Jun 22, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలో మత్స్యకారుల  నిరీక్షణకు ఊహించని రీతిలో అదృష్టం వరించింది. సముద్రంలో చేపల సంతానోత్పత్తి సమయం కావడంతో,  ప్రభుత్వం ప్రతి ఏటా రెండు నెలల పాటు మర పడవలతో వేటను నిషేధిస్తుంది. ఈ ఏడాది కూడా ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు దాదాపు 61 రోజుల పాటు సాగిన ఈ వేట నిషేధ కాలం  ముగిసింది. వేట విరామ సమయంలో ఉపాధి కోల్పోయిన తీరప్రాంత మత్స్యకారులను ఆదుకునేందుకు ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లా డోంకూరు నుండి తిరుపతి జిల్లా తడ వరకు ఉన్న అర్హులైన ప్రతి మత్స్యకారుడి కుటుంబానికి 20 వేల రూపాయల చొప్పున ఆర్థిక భృతిని కూడా అందించింది. చేపల వేట  నిషేధ గడువు ముగియడంతో, మత్స్యకారులు  చేపల వేట ప్రారంభించారు. 

ఈ క్రమంలో  వేటకు వెళ్లిన కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం మత్స్యకారుల వలలకు అరుదైన మత్స్య సంపద చిక్కింది. వారు వేసిన వలలో ఏకంగా లక్షల రుూపాయల  విలువైనఅరుదైన  కచిడి చేపలు మూడు చిక్కాయి. చాలా రోజుల విరామం తర్వాత సముద్రంలోకి వెళ్లిన తొలి వేటలోనే ఇలాంటి అరుదైన చేపలు వలకు చిక్కడంతో  ఆ మత్స్యకారుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ మూడు కచిడి చేపలను అంతర్వేది పల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్‌కు తీసుకురావడంతో, ఆ అరుదైన చేపలను చూడటానికి స్థానికులు, ఇతర మత్స్యకారులు భారీగా తరలివచ్చారు.  

హార్బర్‌లో ఈ మూడు అరుదైన చేపలకు బహిరంగ వేలం నిర్వహించగా, వ్యాపారుల మధ్య విపరీతమైన పోటీ నెలకొంది. చివరకు ఒక స్థానిక వ్యాపారి ఈ మూడు చేపలను ఏకంగా 1 లక్షా 50 వేల రూపాయల భారీ ధరకు దక్కించుకున్నాడు. అంటే   ఒక్కో చేప ధర అక్షరాలా 50 వేల రూపాయలు పలికింది. వేలంలో అమ్ముడైన ఈ మూడు చేపలలో రెండు మగ చేపలు కాగా, ఒకటి ఆడ చేప. ఈ చేపలు  ఒక్కొక్కటి దాదాపు  13 కిలోల బరువు   తూగాయి.  

  కచిడి చేపల పొట్ట భాగంలో లభించే ఒక ప్రత్యేకమైన పొర లేదా ఎయిర్ బ్లాడర్ లాంటి పదార్థానికి అంతర్జాతీయ మార్కెట్లో విపరీతమైన గిరాకీ ఉంటుంది. దీనిని పలు రకాల ప్రాణరక్షక ఔషధాల తయారీలోనూ, శస్త్రచికిత్సకు ఉపయోగించే సర్జికల్ దారాల తయారీలోనూ  వినియోగిస్తారు. అందుకే ఈ చేపలకు ఇంతటి డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం దొరికిన వాటికంటే ఇంకా పెద్ద పరిమాణంలో ఉండే కచిడి చేపలు గనుక వలలకు చిక్కితే, మార్కెట్లో ఒక్కో చేప ధర 2 లక్షల   నుండి 3 లక్షల రూపాయల వరకు కూడా పలుకుతుందని మత్స్యకారులు చెప్తున్నారు. వేట నిషేధం ముగిసిన వెంటనే ఇలాంటి అదృష్టం కలిసిరావడం ఈ ఏడాది పొడవునా సాగే వేటకు మంచి శుభపరిణామమని, రాబోయే రోజుల్లో మరింత మత్స్య సంపద లభిస్తుందని తీరప్రాంత మత్స్యకారులు ఎంతో ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

By
en-us Political News

  
రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా దిల్లీ వేదికగా కీలక అడుగులు పడ్డాయి.
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి, విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు
రెండేళ్ల చిన్నారి హత్య కేసు ఛేదన.. తల్లి, ప్రియుడి కుట్ర బట్టబయలు...
ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో అత్యంత ఘోరమైన అగ్నిప్రమాదంలో 14 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.
మా ఆయనే దొరికాడా..ఆయను ఏమైనా అయితే చూస్తూ ఉరుకోము...
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో సోమవారం సాయంత్రం ఒక ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో సోమవారం సాయంత్రం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించి
సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని పారుపూడి రాధా గాయత్రి అనుమానాస్పద మృతి కేసు సరికొత్త మలుపు తిరిగింది.
కీర్ స్టార్మర్ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది కాలంలోనే దేశంలో తీవ్ర అసంతృప్తి, వ్యతిరేకత వ్యక్తమైంది. ఆయన రాజీనామాకు దారితీసిన ముఖ్య కారణాలు ఏంటంటే.. గత మే నెలలో జరిగిన బ్రిటన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార లేబర్ పార్టీ ఘోర ఓటమిని చవిచూసింది. ఈ ఓటమి స్టార్మర్ నాయకత్వ సామర్థ్యంపై పెద్ద ఎత్తున ప్రశ్నలు లేవనెత్తింది.
భారతీయ రైల్వేస్ థర్మల్ ప్లాంట్ల నుండి 340 మిలియన్ టన్నుల ఫ్లై యాష్ (బొగ్గు బూడిద) రవాణా కోసం సరికొత్త మెగా లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌ను సిద్ధం చేస్తోంది. 40 శాతం డిస్కౌంట్‌తో సిమెంట్, ఇటుకల ధరలను తగ్గించి, వ్యర్థాలను జాతీయ సంపదగా మార్చే ఈ అద్భుతమైన గ్రీన్ ఇనిషియేటివ్ విశేషాలు ఇక్కడ చదవండి.
కర్ణాటకలో ప్రభుత్వ బస్సు ప్రయాణం మరింత ప్రియం కానుంది. డీజిల్ ధరలు, ఉద్యోగుల జీతాల పెంపుతో పాటు రూ. 6,000 కోట్ల అప్పుల్లో ఉన్న రవాణా సంస్థలు 12% వరకు ఛార్జీలను పెంచాలని ప్రతిపాదించాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో భక్తుల భద్రత, రద్దీ నియంత్రణ కోసం కేరళ పోలీసులు, దేవస్వం బోర్డు అధునాతన ఏఐ (AI) డ్రోన్లు, స్మార్ట్ కెమెరాలను ప్రవేశపెడుతున్నారు. గత ఏడాది 51 లక్షల మంది భక్తులు దర్శించుకున్న నేపథ్యంలో, తొక్కిసలాటలు నివారించడానికి మరియు 26 పార్కింగ్ స్థలాలను డిజిటలైజ్ చేయడానికి ఈ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు.
ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన ఈ శాంతి చర్చల వేదిక ఒక్కసారిగా రచ్చరచ్చగా మారిపోయింది. అనూహ్య దౌత్య వివాదాలకు, తీవ్ర ఉద్రిక్తతలకు నెలవుగా మారింది. చర్చలు ప్రారంభం కావడానికి ముందే అమెరికా, ఇరాన్ మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.