దువ్వాడ ఇంటి ముందు రచ్చ రంబోలా!
Publish Date:Aug 10, 2024
Advertisement
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అక్రమ సంబంధం వ్యవహారం రచ్చ రంబోలాగా మారుతోంది. శుక్రవారం రాత్రి దువ్వాడ శ్రీనివాస్, ఆయనతో సహజీవనం లాంటి ‘అడల్ట్రీ’ జీవనం చేస్తున్న దివ్వెల మాధురి ఇంటి ముందుకు దువ్వాడ శ్రీనివాస్ కుమార్తెలు వెళ్ళారు. ఇంటి బయట వాళ్ళు ఎంతసేపు వేచి చూసినా లోపల నుంచి స్పందన లేదు. ఆ తర్వాత దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి, దువ్వాడ కుమార్తెలు మీడియా ముందు తమ బాధను వెళ్ళబోసుకున్నారు. దివ్వెల మాధురి మాయలో దువ్వాడ శ్రీనివాస్ పడిపోయారని, తమని పట్టించుకోవడం మానేశారని వారు ఆరోపించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం టెక్కలిలో దివ్వెల మాధురి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తనకు, దువ్వాడ శ్రీనివాస్‌కి సంబంధం వుందని, ఇద్దరం కలసే వుంటున్నామని, భవిష్యత్తులో ఇద్దరం పెళ్ళి చేసుకున్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇంతకాలం ఏ వైసీపీ నాయకుల మీద ఇల్లీగల్ వ్యవహారాల ఆరోపణలు వచ్చినా, ‘నేను పత్తిత్తుని’ అని చెప్పడం మాత్రమే చూసి తరించిన జనం.. ‘అవును.. నాకు, దువ్వాడ శ్రీనివాస్‌కి సంబంధం వుంది’ అని ధైర్యంగా చెప్పిన దివ్వెల మాధురి ధైర్యాన్ని చూసి నోరు తెరిచారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు రచ్చ రంబోలా జరిగింది. దువ్వాడ శ్రీనివాస్ వాణి, ఆయన ఇద్దరు కుమార్తెలు దువ్వాడ శ్రీనివాస్, మాధురి వుంటున్న ఇంటికి వెళ్ళారు. పోలీసుల సాక్షిగా ఇంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నించారు. అయితే దువ్వాడ శ్రీనివాస్ వాళ్ళని లోపలకి రానివ్వకుండా బయటకి నెట్టేశారు. వీళ్ళని ఆవేశంగా దుర్బాషలాడారు. ఒకవైపు వీళ్ళని, మరోవైపు దువ్వాడ శ్రీనివాస్‌ని ఆపలేక పోలీసులు తంటాలు పడాల్సి వచ్చింది. ఈ విషయంలో జగన్ అర్జెంటుగా జోక్యం చేసుకుని దువ్వాడని దారిలో పెట్టాలని, లేకపోతే దువ్వాడని ఎమ్మెల్సీ పదవిలోంచి పీకేయాలని దువ్వాడ భార్య, కుమార్తెలు డిమాండ్ చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/duvvada-srinivas-issue-25-182672.html





