విచారణ కోసం పీఎస్ కు బయలుదేరిన దువ్వాడ మిస్సింగ్.. దివ్వెల మాధురి టెన్షన్.. కొత్త డ్రామాయేనా?

Publish Date:Jul 1, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఏ మాత్రం పరిచయం అక్కర్లేని పేర్లు దువ్వాడ శ్రీనివాస్, దువ్వెల మాధురి. వీరిద్దరూ చిత్ర విచిత్ర విన్యాసాలతో నిత్యం వార్తల్లో ఉంటుంటారు. ఇప్పుడు తాజాగా దువ్వాడ మిస్సింగ్ అంటూ దివ్వెల మాధుడు చేస్తున్న హడావుడి మరో కొత్త డ్రామాయా అన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది.   శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో గత కొంతకాలంగా వ్యక్తిగత, రాజకీయ వివాదాలతో వార్తల్లో నిలిచిన దువ్వాడ శ్రీనివాస్, దివ్వేల మాధురి ఎపిసోడ్ లో.. దువ్వాడ అదృశ్యం వార్త కలకలం రేపుతోంది.  

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నోటికి హద్దూ పద్దూ లేదన్నట్లుగా, జనసేనాని పవన్ కల్యాణ్, తెలుగుదేశం నేతలపై అనుచిత వ్యాఖ్యలతో దువ్వాడ రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. ఈ అనుచిత వ్యాఖ్యలపై దువ్వాడ శ్రీనివాస్ పై  కొత్తూరు పోలీస్ స్టేషన్‌లో   నమోదైన ఒక కేసుకు సంబంధించి వివరణ ఇచ్చేందుకు బయలుదేరిన దువ్వాడ శ్రీనివాస్.. పోలీసు స్టేషన్ కు చేరకుండానే మిస్సయ్యారు.   అయితే ఆయన భారీ ర్యాలీగా బయలుదేరి మార్గమధ్యంలో  ఎలా మిస్సౌతారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  దువ్వాడ అనుచరులు, వైసీపీ  కార్యకర్తలు భారీ సంఖ్యలో కొత్తూరు పోలీసు స్టేషన్ కు చేరుకున్నా.. దువ్వాడ మాత్రం అక్కడకు రాలేదు. 

 దీంతో  దివ్వెల మాధురి   దువ్వాడ శ్రీనివాస్‌ను పోలీసులే రహస్యంగా అదుపులోకి తీసుకుని ఉంటారంటూ ఆరోపణలు గుప్పించారు. ఎవడో ఊరూ పేరూ లేని వాడు కేసు పెడితే.. ఒక ఎమ్మెల్సీని పోలీసు స్టేషన్ కు పిలుస్తారా? అంటే మండిపడ్డారు. దువ్వాడకు ఏదైనా జరిగితే.. ఎవరినీ వదిలిపెట్టనంటూ పోలీసులపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు.  కొత్తూరు పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.  

 దివ్వెల మాధురి చేస్తున్న ఆరోపణలను కొత్తూరు పోలీసులు  తోసిపుచ్చారు. తాము దువ్వాడ శ్రీనివాస్‌ను అరెస్ట్ చేయలేదని, అసలు ఆయన పోలీస్ స్టేషన్‌ కే రాలేదని స్పష్టం చేశారు.  దువ్వాడే అరెస్టు భయంతో అజ్ణాతంలోకి వెళ్లి ఉంటారని పోలీసులు అంటున్నారు.  ఇక పీఎస్ ఎదుట ఆందోళనకు దిగిన దివ్వెల మాధురిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.  ఇక ఈ డ్రామాలో ట్విస్ట్ ఏమిటంటే.. పోలీసు స్టేషన్ కు బయలుదేరిన దువ్వాడ రూటు మార్చి.. ఒడిస్సావైపు వెళ్లడం. ఈ విషయాన్ని పోలీసులు ఆయన ఫోన్ సిగ్నల్స్ ద్వారా సాంకేతికంగా ధృవీకరించారు.  

By
en-us Political News

  
ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్‌ రెడ్డికి జాయింట్‌ కో-ఆర్డినేటర్‌ బాధ్యత..!
అర్బన్ నక్సల్, రూరల్ నక్సల్ అనే పదాల సరసన ఇప్పుడు దిమాగీ నక్సల్అ నే కొత్త బ్రాండ్‌ను చేర్చారన్నారు భరద్వాజ. అంతేందుకు ఆపరేషన్ కగార్ పేరుతో నక్సలైట్లను భౌతికంగా నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా ప్రకటించి మార్చి 31 2026 డెడ్ లైన్ విధించిన సంగతిని గుర్తు చేశారు.
ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్ ఐదు డీఎస్సీలు నిర్వహించాల్సిన ఆయన ప్రభుత్వం ఒక్క డీఎస్సీ ఎందుకు నిర్వహించలేకపోయిందో చెప్పాలన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకూ ఇప్పుడు వైసీపీ లోకేష్ రాజీనామా చేయాలన్న డిమాండ్ కూ పొంతన లేదన్నారు.
ఈ కొత్త పాలకమండలిలో వివిధ రాష్ట్రాల నుంచి కీలక నాయకులకు చోటు కల్పించారు.  కాగా బిజెపి జాతీయ ఉపాధ్యక్ష పదవుల్లో మొత్తం 13 మంది నాయకులకు అవకాశం దక్కింది. వీరిలో  పురందేశ్వరి ఒకరు. 
వనపర్తి కాంగ్రెస్‌లో టికెట్ వివాదం..నేను కూడా జీవన్ రెడ్డిలా తిరగబడతా..!
ప్రజాసమస్యలపై చర్చ జరగాల్సిన మండలిలో ఇరు పార్టీలకు చెందిన నేతలూ.. వ్యక్తిగత దూషణలతో సభలో మాటల యుద్ధానికి దిగారు.  ముఖ్యంగా  మండలిలో విపక్ష నాయకుడు, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, మంత్రి అచ్చెన్నాయుడుల మధ్య మాటల మంటలు రేగాయి. పరస్పరం విమర్శలు, ఆరోపణలు గుప్పించుకున్నారు.
సెంబ్లీ ఎన్నికలలో తన జన సురాజ్ పార్టీ ఘోర పరాజయం పాలైనప్పటికీ... ఇటీవల బంకీపూర్ నియోజకవర్గ ఉప ఎన్నికలో ప్రశాంత్ కిశోర్ బీజేపీ కంచు కోటను బద్దలు కొట్టి మరీ విజయం సాధించారు.
భారత ప్రధాన న్యాయమూర్తి ఒక కేసు విచారణ సందర్భంగా చేసిన కాక్రోచ్ అన్నపదం ఎంతటి సంచలనానికి దారి తీసిందో.. ప్రధాని తన పంద్రగస్టు ప్రసంగంలో ఉపయోచించిన దిమాగీ నక్సల్ పదం కూడా అంతకు మించి సంచలనం సృష్టించింది. 
 ఏపీ గ్రీన్ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్‌గా నాగబాబును నియమిస్తూ..  ఆయనకు కేబినెట్ హోదాను కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ  సోమవారం ఉత్తర్వులు ారీ చేసింది.  
గత కొంతకాలంగా పార్టీలో తనను ఏ విధంగా పక్కన పెట్టారో  వివరించారు. ముఖ్యంగా సింగరేణి కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో, తన కుమారుడి విద్యాభ్యాసానికి సంబంధించిన గ్రాడ్యుయేషన్ వేడుకల కోసం అమెరికా వెళ్లిన  సమయంలోనే కనీసం ముందస్తు సమాచారం,  షోకాజ్ నోటీసు కూడా ఇవ్వకుండా  తనను ఆ పదవి నుంచి తొలగించారని గుర్తు చేశారు.
వందే మాతరం గేయానికి ఆమె చేసిన అపచారాన్ని 140 కోట్ల మంది భారతీయులు ఆమెను ఎన్నటికీ క్షమించరన్నారు.  వందేమాతరం గేయానికి చేసిన అపచారానికి ఆ  గేయ రచయిత బంకించంద్ర ఛటోపాధ్యాయతో పాటు  40 కోట్ల దేశ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని అమిత్ షా డిమాండ్ చేశారు.  
ఆంధ్రప్రదేశ్ లో జగన్ పార్టీకి అదేనండీ వైసీపీకి జనం కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా అర్హత లేదని 2024 ఎన్నికలలో విస్పష్ట తీర్పు ఇచ్చేశారు. అయినా నిస్సిగ్గుగా జగన్ కోర్టును విపక్ష హోదా కోసం ఆశ్రయించారు.
ఎవరైనా సరే పార్టీ గీత దాటి మాట్లాడితే సహించేది లేదు..మహేష్ కుమార్ గౌడ్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.