డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ తప్పులు చేయకండి..!
Publish Date:Dec 28, 2024
Advertisement
డ్రైవింగ్ నేర్చుకున్న వారికి చాలా సింపుల్ విషయం. కానీ డ్రైవింగ్ రాని వారికి అది పెద్ద టాస్క్. ఈ కాలంలో డ్రైవింగ్ ను చాలా ఈజీగా ప్రతి ఒక్కరూ నేర్చేసుకుంటున్నారు. కార్, బైక్, స్కూటీ ఇతర వాహనాలు ఏవైనా వాటిని ఎలా మెయింటైన్ చేయాలి? అందులో బటన్స్ కానీ, బ్రేకులు కానీ ఎలాంటి సమయంలో ఎలా ఉపయోగించాలి? ఇవి తెలియడం, వాహానాల రద్దీలో చాకచక్యంగా వాటిని వినియోగిస్తూ వెహికల్ ను ముందుకు నడపడం తెలియాలి. వీటిలో ఏమాత్రం తేడా వచ్చినా యాక్సిడెంట్లు జరగడం, ప్రాణాల మీదకు రావడం ఖచ్చితంగా జరుగుతుంది. అందుకే డ్రైవింగ్ చేసేటప్పుడు కొన్ని తప్పులు అస్సలు చేయకూడదు.. ఫోన్.. ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం ప్రమాదం. ఈ విషయంలో ప్రభుత్వం నిషేధం విధించినా సరే.. చాలామంది ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తుంటారు. ఈ అలవాటు కేవలం డ్రైవింగ్ చేసే వారినే కాకుండా ఇతరుల జీవితాలను కూడా ప్రమాదంలో పడేస్తుంది. వేగంగా ప్రయాణించడం సురక్షితం కాదు.. ఈ హెచ్చరిక బోర్డ్ చాలా చోట్ల రాసి ఉంటుంది. కానీ చాలామంది రాష్ డ్రైవింగ్ చేస్తుంటారు. ఇలా వేగంగా నడపడం వల్ల చాలా మంది ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. ముఖ్యంగా డ్రైవింగ్ చేయడం అనేది తనకే కాదు.. ఎదుటి ప్రాణాలను ప్రమాదంలో నెట్టకుండా ఉండే చర్య అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. సీటు బెల్టు.. ప్రయాణించేటప్పుడు సీట్ బెల్టు పెట్టుకోవడం, బైక్ లో ప్రయాణిస్తున్నట్టైతే హెల్మెట్ వాడకం తప్పనిసరి. ఇవి చేయనివారు ఎక్కువగా ప్రమాదాల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తాగి డ్రైవ్ చేయవద్దు.. మద్యం సేవించి వాహనాలు నడపరాదు అనే హెచ్చరిక అందరికీ తెలిసిందే. ముఖ్యంగా దీన్ని ప్రభుత్వాలే నిషేధించాయి కూడా. అయినా సరే చాలామంది అలాగే డ్రైవ్ చేస్తుంటారు. దీని వల్ల కొన్ని పరిస్థితుతులలో ప్రాణాల మీదకు వచ్చే అవకాశం ఉంటుంది. అలసట.. అలసటగా ఉన్నప్పుడు డ్రైవింగ్ చేయడం కూడా మంచిది కాదు. అలసిపోయినప్పుడు చాలామంది నిద్ర ఫీల్ అవుతారు. డ్రైవ్ చేస్తుండగా నిద్రలోకి జారుకునే వారు కూడా ఉంటారు. ఇది చాలాపెద్ద ప్రమాదాలకు కారణం అవుతుంది. ట్రాఫిక్.. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న సమయంలో ట్రాఫిక్ సిగ్నల్స్ ను అనుసరించి డ్రైవ్ చేయాలి. ఈ నియమాలు ఉల్లంఘిస్తే చట్టపరంగా డ్రైవింగ్ చేసే వారు సమస్యలు ఎదుర్కోవడమే కాకుండా ఇతరులు కూడా ప్రమాదంలో పడే అవకాశం, ఇతర వాహన చోదకులు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెడ్ లైట్.. హెడ్ లైట్లు ప్రతి వాహనాలకు ఉంటాయి. అయితే వీటిని సమర్థవంతంగా వినియోగించుకునేవారు చాలా తక్కువ. హెడ్ లైట్ లు కేవలం వాహనానికి దారి చూపడానికే కాదు.. ముందు వెళుతున్న వాహనాలకు, వెనుక వస్తున్న వాహనాలకు సరైన దిశానిర్దేశం చెయ్యడంలో కూడా సహాయపడతాయి.
వేగం..
*రూపశ్రీ.
http://www.teluguone.com/news/content/driving-mistakes-to-avoid-35-190460.html