ఓ గొప్ప నాయకుని ఆకాంక్ష.. గుడ్ గవర్నెన్స్ డే 2024..!
Publish Date:Dec 25, 2024
Advertisement
స్వతంత్ర భారతదేశాన్ని ప్రగతిపథం వైపు నడిపించటానికి ఎంతో మంది నాయకులు కృషి చేశారు. ఒక్కో నాయకునిదీ ఒక్కో ప్రత్యేకత. కానీ ఒక కాంగ్రేసేతర ప్రధానిగా పదవీకాలం పూర్తిచేసిన తొలి నాయకునిగా, వ్యక్తిగతంగా రాజకీయ వర్గాల్లో చాలామంది ఇష్టపడే వ్యక్తిగా, మన దేశ భవిష్యత్తు కోసం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్న నాయకునిగా ఇప్పటికీ మంచి పేరున్న గొప్ప నాయకుడు ఒకరున్నారు. ఆయనే అటల్ బిహారి వాజపేయి. డిసెంబర్ 25, 1924న మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జన్మించిన అటల్ బిహారి వాజపేయి ఒక గొప్ప రాజకీయ నాయకుడు, కవి, వక్త కూడా.. ఆయన మూడు సార్లు భారతదేశ ప్రధానమంత్రిగా సేవలందించి, దేశ అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారు. ఆయన పాలనా సమయంలో గోల్డెన్ క్వాడ్రిలాటరల్ వంటి ప్రాజెక్టులతో పాటు, అనేక ఆర్థిక సంస్కరణలు, గ్లోబల్గా మన దేశ పరిస్థితి మెరుగుపరచడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ప్రజాస్వామ్య విలువల పట్ల వాజపేయికున్న నిబద్ధత వల్ల ఆయన నాయకత్వం ప్రత్యేకంగా నిలిచింది. అందుకే ఆయన జయంతినే ప్రతీ సంవత్సరం గుడ్ గవర్నెన్స్ డేగా జరుపుకుంటున్నాం. గుడ్ గవర్నెన్స్ డే ఎప్పుడు మొదలైంది.. ఈ దినోత్సవం జరుపుకోవటం మొదట 2014లో ప్రారంభమైంది. డిసెంబర్ 23, 2014న అటల్ బిహారి వాజపేయిగారికి భారతరత్న పురస్కారాన్ని ప్రకటించారు. ఆ సమయంలోనే కొత్తగా ఎన్నికైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్ 25న గుడ్ గవర్నెన్స్ డేగా ప్రకటించారు. డిసెంబర్ 25, 2024న అటల్ బిహారి వాజపేయి 100వ జయంతి కావటం వల్ల ఈ సారి జరగబోయే గుడ్ గవర్నెన్స్ డే ఎంతో ప్రత్యేకమైనది. ఈ సంధర్భంగా ‘పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం (DARPG)’ మొదలుపెట్టారు. డిసెంబర్ 19 నుండి 24 వరకు ‘గ్రామాల వైపు పరిపాలన’ అనే క్యాంపెయిన్‌ను ప్రకటించింది. ఈ కార్యక్రమం గ్రామీణ స్థాయి దాకా పాలనను చేరవేయడం. అలాగే గ్రామీణ ప్రజల అవసరాలకు, పాలన సేవలను అందుబాటులోకి తేవడం లక్ష్యంగా పెట్టుకుంది. డిజిటల్ ఇండియా ద్వారా సులభంగా ప్రభుత్వ సేవలను పొందడానికి ఉపయోగపడింది. నేడు అందరూ లావాదేవీలు కూడా డిజిటల్ గానే చేయగలుగుతున్నామంటే ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యనే కారణం. స్వచ్ఛ భారత్ అభియాన్ ద్వారా దేశ పౌరుల్లో పరిశుభ్రత పట్ల అవగాహనని పెంపొందించడానికి మొదలుపెట్టిన ఈ కార్యక్రమం ద్వారా దేశంలో ఎంతో మార్పు సాధ్యమైంది. ప్రభుత్వ ప్రణాళికల్లో ప్రజల అభిప్రాయాలు సేకరించడం వల్ల కూడా ప్రజలకి సరైన పాలన అందించటం సాధ్యమౌతుంది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) అమలు చేయటం వల్ల డబ్బు మధ్యలో ఉండే అవినీతిపరుల చేతికి చిక్కకుండా నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలకు సబ్సిడీలు చేరుతున్నాయి. పాలనా లోపం లేకుండా ప్రతీ నాయకుడు చిత్తశుద్ధితో పనిచేసినప్పుడు, మన దేశ స్థితి గతులు ఎంతో మెరుగుపడతాయి. మన దేశ ప్రగతి కోసం పాటుపడిన గొప్ప నాయకులని తలచుకుంటూనే, తమ బాధ్యతని సరిగా నిర్వర్తించని నాయకులని ప్రజలు ప్రశ్నించగలగాలి. అలా ప్రశ్నించే చట్టాలు కూడా రావాలి. నాయకులుగా, అధికారులుగా, పౌరులుగా మనమంతా కలిసి పనిచేసినప్పుడు మన భారత దేశాన్ని ‘అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం’ నుంచి ‘అభివృద్ధి చెందిన దేశంగా’ మార్చవచ్చు. *రూపశ్రీ.
ఈ దినోత్సవం వాజపేయి వారసత్వాన్ని స్మరించడమే కాకుండా.. పారదర్శక, బాధ్యతాయుత, సమగ్ర పాలనను ప్రోత్సహించడానికి పౌరులు, అధికారులు కట్టుబడి ఉండాలని తెలియజేస్తుంది. గుడ్ గవర్నెన్స్ వల్లనే దేశ సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది.
2024 థీమ్..
గుడ్ గవర్నెన్స్ డే వల్ల ఇవన్నీ సాధ్యం అయ్యాయని తెలుసా..?
http://www.teluguone.com/news/content/good-governance-day-35-190273.html