జోగి రమేష్ కుటుంబంపై వరకట్న వేధింపుల కేసు.!
Publish Date:Jul 24, 2026
Advertisement
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ వ్యవహారం రచ్చ కెక్కింది. జోగి రమేశ్ కోడలు మేఘన తన భర్త, అత్తమామలు కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భర్త, అత్తమామలు తనను వరకట్నం కోసం శారీరకంగా, మానసికంగా నరకయాతనకు గురిచేస్తున్నారని, తన ప్రాణాలకే ముప్పు తలపెట్టేలా ప్రవర్తించారని మేఘన ఫిర్యాదులో పేర్కొన్నారు. మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారుడు జోగి రాజీవ్‌కు, మేఘనకు గత ఏడాది మేలో రెండు కుటుంబాల సమక్షంలో ఘనంగా వివాహం జరిగింది. అయితే ఆ తరువాత కొద్ది రోజులకే వివాదాలు మొదలయ్యాయి. వివామైన కొన్ని రోజుల నుంచే అదనపు కట్నం కోసం తనను వేధించడం ప్రారంభించారని మేఘన ఫిర్యాదులో పేర్కొన్నారు. భర్త రాజీవ్, మామ జోగి రమేశ్ సహా కుటుంబం సభ్యులు తనను నిరంతరం వేధింపులకు గురిచేస్తూ వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దమనుషుల సమక్షంలో ఈ సమస్యను పరిష్కరించేందుకు పలుమార్లు పంచాయితీలు జరిపినప్పటికీ, పరిస్థితిలో మార్పు రాకపోగా వేధింపులు మరింత తీవ్రమయ్యాయని మేఘన పేర్కొన్నారు. వేధింపులు, బెదిరింపుల నేపథ్యంలో తన ప్రాణానికి తీవ్రమైన హాని ఉందంటూ మేఘన ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. బాధితురాలి క ఫిర్యాదు ఆధారంగా ఇబ్రహీంపట్నం పోలీసులు జోగి రమేష్, జోగి రాజీవ్ సహా 11 మంది కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు. జోగి రమేశ్ కుటుంబంపై ఇప్పటికే పలు రాజకీయ అంశాల్లో ఆరోపణలు రాగా.. తాజాగా ఇప్పుడు సొంత కోడలే నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి 11 మందిపై గృహ హింస, హత్యాయత్నం కేసులు పెట్టారు. . Jogi Ramesh, Jogi Rajiv, Meghna complaint, Ibrahimpatnam police station, dowry harassment case, Telugu One
http://www.teluguone.com/news/content/dowry-cace-against-jogi-ramesh-family-36-227030.html





