బేరసారాలు ఏసీ గదుల్లో జరుగుతాయి.. ఢిల్లీ ఎండల్లో రోడ్డుపై కాదు.!

Publish Date:Jul 24, 2026

Advertisement

సామాజిక ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ తన 26 రోజుల నిరశన దీక్ష  విరమించిన అనంతరం విమర్శకులపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ఆసుపత్రి నుంచి విడుదల చేసిన ఓ వీడియో సందేశంలో..  ప్రాణాలను ఫణంగా పెట్టి మరీ 26 రోజులు నిరాహార దీక్ష చేసిన తరువాత కూడా   తన నిజాయితీని నిరూపించుకోవాల్సిన పరిస్థితి రావడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. 

తన దీక్ష విరమణపై కొందరు చేస్తున్న విమర్శలు, లేవనెత్తుతున్న ప్రశ్లకు సమాధానంగా..  26 రోజుల పాటు నిరశన చేసిన  తాను ఎవరి నుంచో క్యారెక్టర్ సర్టిఫికేట్ పొందాల్సిన అవసరం లేదన్నారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ సమక్షంలో ద్రవాహారం తీసుకుని దీక్ష ముగించడంపై వెల్లువెత్తుతున్న విమర్శలను ఖండించిన ఆయన..   ప్రభుత్వం ఇచ్చిన  హామీలను పరిగణనలోకి తీసుకుని   దీక్ష విరమించానని, ఇందులో ఎలాంటి  బ్యాక్ డోర్ ఒప్పందాలూ లేవని కుండబద్దలు కొట్టారు. 

ఇలా ఉండగా కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిథులు.. వాంగనిరశన దీక్ష కారణంగా తాను కోలుకోలేనంతగా అనారోగ్యానికి గురయ్యాననీ,  11 కిలోల బరువు తగ్గారని, అవయవాలు, మెదడుపై తీవ్ర ప్రభావం పడే పరిస్థితి వచ్చిందన్నారు. ఒప్పందాలు చేసుకోవాలనుకునే వారు ఏసీ గదుల్లో కూర్చుని చర్చలు జరుపుతారు తప్ప తనలా , ఢిల్లీ   ఎండల్లో రోడ్డుపై కూర్చుని  నిరాహార దీక్ష చేసి ప్రాణాలపైకి తెచ్చుకోరని వాంగ్ చుక్ ఒకింత ఆగ్రహంగా పేర్కొన్నారు. 

కేంద్ర మంత్రుల సమక్షంలో దీక్ష ముగించడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న వారికి సమాధానమిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన  చేపట్టిన ఉద్యమంలో ప్రభుత్వ ప్రతినిధుల సమక్షంలోనే బాధ్యతాయుతమైన హామీలు పొందడం సహజ ప్రక్రియ అన్నారు.   వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడం వల్లనే ఆయనను దీక్ష విరమించాలని తాము కోరామని, ఆయన సాధించిన హామీలు ఉద్యమానికి తొలి విజయం అని కాక్రోచ్ జనతా పార్టీ పేర్కొంది.  

Sonam Wangchuk lashes out at critics, Jantarmantar, Prtests, Hunger Strike, Close

By
en-us Political News

  
2024 సాధారణ ఎన్నికల అనంతరం ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం గణనీయంగా మారిపోయింది.
ప్రజారోగ్యం కోసమే సంజీవని పథకాన్ని అందిస్తున్నామని...ఆగస్టు నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు
దేశ రాజధాని ఢిల్లీలో గత కొన్ని రోజులుగా ఉత్కంఠ రేపిన పెద్ద ఎత్తున సాగిన నిరసన ఘట్టం ఎట్టకేలకు ఒక సంచలనాత్మక ముగింపునకు వచ్చింది.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయడం దేశ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది.
పశ్చిమాసియాలో అమెరికా-ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య చెలరేగిన తీవ్ర ఉద్రిక్తతలు ఇప్పుడు మొత్తం గల్ఫ్ ప్రాంతానికి విస్తరిస్తున్నాయి.
ఉద్యోగాలే లేకుంటే ఏఐ విజయం ఎందుకు.. మైక్రోసాఫ్ట్ బాస్ సంచలన వ్యాఖ్యలు..
దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన నీట్ పరీక్షా వివాదం విద్యార్థుల ఆందోళనల నడుమ కేంద్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పత్రం ప్రధాన మంత్రికి పంపించిన అనంతరం దేశ యువతను ఉద్దేశించి భావోద్వేగ లేఖ విడుదల చేశారు
  నిరాహార దీక్షలో ఉన్న తనను   సందర్శకులు  కలవకుండా ఆంక్షలు విధించారని వాంగ్ చుక్ ఆరోపంచారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంలో అత్యంత సంచలనాత్మక పరిణామం చోటుచేసుకుంది
వానకాలం ఖరీఫ్ సీజన్ సగం గడుస్తున్నప్పటికీ వర్షభావ పరిస్థితుల కారణంగా సాగు రంగం సంక్షోభంలో పడింది. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ సారికి క్రాప్ హాలీడే యే శరణ్యమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాభావం కారణంగా ఈ సీజన్ సాగుకు తిలోదకాలు వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.