మళ్లీ ఇండియాపై ట్రంప్ టారిఫ్ బాంబ్.!

Publish Date:Jul 21, 2026

Advertisement

ప్రపంచవ్యాప్తంగా తక్కువ ధరలో అత్యంత ప్రాణరక్షకమైన ఔషధాలను అందిస్తున్న  భారత ఫార్మా రంగానికి అగ్రరాజ్యాధినేత డోనాల్డ్ ట్రంప్  షాక్ ఇచ్చారు. విదేశాల నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే జనరిక్ ఔషధాలపై   200 శాతం టారిఫ్‌లు విధించనున్నట్లు  ప్రకటించారు. అమెరికాలోనే స్వదేశీ ఔషధ తయారీని  ప్రోత్సహించి, స్థానిక ప్లాంట్ల ఏర్పాటును పెంచడమే లక్ష్యంగా ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ చెబుతున్నారు. ఈ ప్రకటనతో అమెరికా మార్కెట్‌పై   ఆధారపడిన ఇండియన్ ఫార్మా కంపెనీలు,  ఎగుమతిదారులపై ప్రభావం పడుతుందనడంలో సందేహం లేదు. 

 డోనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్  ట్రూత్ సోషల్ వేదికగా చేసిన ఈ ప్రకటన మేరకు  వచ్చే నెల   1 నుండి   రెండేళ్ల పాటు అమెరికాలోకి దిగుమతి అయ్యే అన్ని రకాల జనరిక్ ఔషధాలపై సుంకం సున్నా శాతంగానే కొనసాగుతుంది. అయితే ఈ రెండేళ్ల వ్యవధి ముగిసిన వెంటనే, మొదటి ఏడాదిలోనే దిగుమతి సుంకాలను 100 శాతానికి పెంచుతారు. ఆ తర్వాత వచ్చే ఏడాదికి ఈ సుంకాన్ని  200 శాతానికి పెంచుతామని ట్రంప్ హెచ్చరించారు. ఈ నిర్దేశిత కాల వ్యవధిలో  అమెరికాలో తయారీ ప్లాంట్లు,  ఏర్పాటు చేయని విదేశీ ఔషధ కంపెనీలకు ఇది శిక్షగా మారుతుందని  ట్రంప్  హెచ్చరించారు.  

ప్రపంచ ఔషధ విపణిలో భారత్  కీలక పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా అమెరికా మార్కెట్‌లో విక్రయించే మొత్తం జనరిక్ మందులలో   40 శాతం   భారత్‌లోనే తయారవుతున్నాయి. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (జీఆర్టీఏ)  గణాంకాల ప్రకారం, 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇండియా ప్రపంచవ్యాప్తంగా మొత్తం 25.8 బిలియన్ డాలర్ల విలువైన ఫార్మా ఉత్పత్తులను ఎగుమతి చేయగా..  అందులో ఏకంగా 9.7 బిలియన్ డాలర్లు అంటే దాదాపు 38 శాతం  అమెరికాకే ఎగుమతి అయ్యాయి.  హైపర్‌టెన్షన్ ,  డయాబెటిస్ , క్యాన్సర్,  డిప్రెషన్ వంటి   వ్యాధులకు అమెరికన్లు వాడే అత్యవసర జనరిక్ మందులలో భారతీయ కంపెనీల వాటాయే ఎక్కువ. ఇక ఫైనాన్షియల్ పోస్ట్ నివేదిక మేరకు  2024లో అమెరికాలో ఉపయోగించిన మొత్తం గర్భనిరోధక మాత్రలలో దాదాపు 65 శాతం గ్లెన్‌మార్క్, లుపిన్ అనే రెండు   భారతీయ ఫార్మా కంపెనీల నుంచి ఉత్పత్తి అయినవే.

అయితే.. 2026 ఫిబ్రవరి నెలలో భారత్, అమెరికా మధ్య కుదిరిన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంలో జనరిక్ ఔషధాలు, వాటి ముడిసరుకుల సరఫరాపై పరస్పర చర్చల ద్వారానే నిర్ణయాలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రకటించిన ఈ   నిర్ణయం అమలైతే భారత ఫార్మా పరిశ్రమపైనే కాకుండా..  అమెరికాలోని సామాన్యులపై   కూడా తీవ్ర భారం పడుతుంది.  

Donald Trump pharma tariffs, Indian generic medicines America, US import duties on generics, Indian pharma industry, GTRI pharma export report   

By
en-us Political News

  
రాజధాని పరిధిలో కీ రవాణా వ్యవస్థకు సీడ్ యాక్సెస్ రోడ్డు వెన్నెముక వంటిదని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గతంలో కోర్టు విధించిన మధ్యంతర ఉత్తర్వుల వల్ల ఈ కీలక రహదారి నిర్మాణం నిలిచిపోయిందని, దీనివల్ల రాజధాని మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టు జాప్యమౌతోందని పేర్కొన్నారు. విస్తృత ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వెంటనే మధ్యంతర స్టే ఎత్తివేయాలని కోరారు.
ప్రపంచానికి పెద్దన్నగా తనను తాను అభివర్ణించుకునే అమెరికా ఇరాన్ సంబంధిత సైనిక చర్యల కోసం అక్షరాలా 37.5 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. ఇది ఇండియన్ కరెన్సీలో  3.6 లక్షల కోట్లు.
నిరసనలో పదివేల మంది వరకు నిరసనకారులు పాల్గొనే అవకాశం ఉందని ఢిల్లీ పోలీసులు అంచనా వేశారా. అయితే ఆ అంచనాలను తల్లకిందులు చేస్తూ.. భారీ సంఖ్యలో యువత, విద్యార్థులు, మహిళలు రోడ్లపైకి రావడంతో రాజధాని వీధులు జనసంద్రంగా మారిపోయాయి.
అలాగే బహ్రెయిన్‌లోని దిగ్గజ సంస్థ అయిన అమెజాన్ ప్రధాన డేటా సెంటర్‌ను కూడా ధ్వంసం చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. తమ దేశ పౌర వసతులపై అమెరికా దళాలు జరిపిన దాడులకు తగిన రీతిలో జవాబు చెప్పడానికే ఈ సాంకేతిక కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొంది. అయితే ఈ ఆరోపణలు, క్షిపణి దాడి ఘటనను అమెజాన్ కానీ, బహ్రెయిన్ ప్రభుత్వం కానీ ధ్రువీకరించలేదు.
బాబాయ్ త్వరగా కోలుకోవాలంటూ జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో చేసిన పోస్టు క్షణాల్లో వైరల్ అయ్యింది. బాబాయ్ పట్ల ఎన్టీఆర్ చూపించిన ఈ ప్రేమాభిమానాల పట్ల నందమూరి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాది దావోస్ లోని ప్రపంచ ఆర్ధిక సదస్సులో కుదుర్చుకున్న మరో ఒప్పందం ఇవాళ సాకారమైంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో గత కొన్ని నెలలుగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్న ముంబై నటి కాదంబరి జత్వాని వ్యవహారం
తన ఆరోగ్యం, ఆసుపత్రి అనుభవాల గురించి తాజాగా నెట్టింట షేర్ చేసిన పోస్టు ఆయన అభిమానులను, సినీ వర్గాలనూ కలవరానికి గురి చేసింది. ఆసుపత్రి వాతావరణం, శస్త్రచికిత్స, అనంతరం ఐసీయూలో వైద్యుల నిరంతర పర్యవేక్షణ వంటి కష్టతరమైన దశలను ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో జరుగుతున్న శ్రీ జగదాంబికా అమ్మవారి బోనాల మహోత్సవాల సందర్భంగా హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు విస్తృత స్థాయిలో ట్రాఫిక్ బందోబస్తు చేపట్టారు.
ప్రధాని ఇంటి ఎదుట బైఠాయించిన రాహుల్, ఖర్గే..!
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో జాతీయ రాజకీయం అత్యంత ఆసక్తికరమైన మలుపు తిరిగింది.
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఛలో సంసద్ పార్లమెంట్ మార్చ్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
ఉత్తరాంధ్ర ప్రాంత ప్రగతికి ఊపిరి పోసేందుకు తమ జీవనాధారమైన భూములను ప్రభుత్వం సేకరించడానికి సహకరించిన రైతులకు కృతజ్ఞతగా, గౌరవంగా భోగాపురం విమానాశ్రయం నుంచి ఉచితంగా ఒకసారి విమానంలో ప్రయాణించే అవకాశం కల్పించారు. ఈ మేరకు ఆయన అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలిచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.