డొనాల్డ్ ట్రంప్ హత్యకు ఇరాన్ సరికొత్త స్కెచ్? వణికిపోతున్న అమెరికా!

Publish Date:Jul 10, 2026

Advertisement

అంతర్జాతీయ అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందా? అవుననే అంటున్నాయి తాజా ఇంటెలిజెన్స్ నివేదికలు. ట్రంప్‌ను అంతమొందించేందుకు ఇరాన్ ఒక సరికొత్త, అత్యంత రహస్యమైన వ్యూహాన్ని సిద్ధం చేసిందని ఇజ్రాయెల్ నివేదించింది. ఈ మేరకు ఇజ్రాయెల్ నిఘా వర్గాలు సేకరించిన అత్యంత కీలకమైన తాజా సమాచారాన్ని వాషింగ్టన్‌లోని అమెరికా ఉన్నతాధికారులకు చేరవేసినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’, ‘సీఎన్ఎన్’ సంచలన కథనాలను ప్రచురించాయి. ఈ హెచ్చరికలు అగ్రరాజ్యంలో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేపాయి.

నిజానికి గత కొన్నేళ్లుగా డొనాల్డ్ ట్రంప్ ప్రాణాలకు ఇరాన్ నుండి నిరంతరం ముప్పు పొంచి ఉందనే విషయం బహిరంగ రహస్యమే. ముఖ్యంగా ట్రంప్ తన మొదటి పదవీకాలంలో, 2020 జనవరిలో ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కుద్స్ ఫోర్స్ కమాండర్ జనరల్ ఖాసీం సులేమానీని అమెరికా డ్రోన్ దాడి ద్వారా హతమార్చాలని ఆదేశించారు. అప్పటి నుండి సులేమానీ మరణానికి ఎలాగైనా ప్రతీకారం తీర్చుకుంటామని, ట్రంప్‌ను వదిలిపెట్టబోమని ఇరాన్ పదేపదే ప్రతిజ్ఞలు చేస్తూనే ఉంది. ఇటీవల ఇరాన్ మాజీ సుప్రీం లీడర్   అంత్యక్రియల సందర్భంగా "మేము ట్రంప్‌ను చంపుతాము" అనే భారీ బ్యానర్లు ప్రదర్శించబడగా, ట్రంప్ మరణాన్ని ఆకాంక్షిస్తూ ప్రజలు నినాదాలు చేయడం అక్కడి పరిస్థితి ఎంత ఉద్రిక్తంగా ఉందో స్పష్టంగా తెలియజేస్తోంది.

అయితే ఇప్పటివరకు ఉన్న సాధారణ ముప్పుల కంటే, ఇజ్రాయెల్ ఇప్పుడు పంపిన నివేదిక చాలా భిన్నమైనదని, ఇది ఒక నిర్దిష్టమైన ప్రణాళికను సూచిస్తోందని అమెరికా రక్షణ వర్గాలు భావిస్తున్నాయి. ఈ హెచ్చరిక అందిన కొద్ది గంటల్లోనే టర్కీలోని అంకారాలో జరిగిన నాటో (NATO) సదస్సు ముగించుకుని ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో స్వదేశానికి బయలుదేరిన ట్రంప్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో విలేకరులతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. "వాళ్లు అమెరికా నాయకుడిని, అంటే నన్ను పూర్తిగా నిర్మూలించాలని చూస్తున్నారు. నేను వాళ్ల ప్రతీ హిట్ లిస్టులోనూ ఉన్నాను. ఈ ఉదయం కూడా నేను చూశాను, వారి ప్రతి ఒక్క జాబితాలో నా పేరు మొదటి స్థానంలో ఉంది. ఇప్పటివరకు నేను కాస్త అదృష్టవంతుడిని కాబట్టే బతికున్నాను, కానీ ఈ అదృష్టం ఎల్లకాలం కొనసాగకపోవచ్చు" అంటూ తన ప్రాణాలకు ఉన్న ముప్పును ట్రంప్ స్వయంగా అంగీకరించారు.

భద్రతా కారణాల దృష్ట్యా అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికారులు కూడా అత్యంత అప్రమత్తమయ్యారు. నాటో సదస్సు ముగిసిన తర్వాత ఖతార్ బహుమతిగా ఇచ్చిన సరికొత్త అత్యాధునిక జెట్ విమానాన్ని పక్కనబెట్టి, పాత ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలోనే ట్రంప్ ప్రయాణించేలా సీక్రెట్ సర్వీస్ వ్యూహాత్మక మార్పులు చేసింది. ఇజ్రాయెల్ పంపిన ఈ ఇంటెలిజెన్స్ నివేదికల వెనుక ఒక అంతర్జాతీయ రాజకీయ వ్యూహం కూడా దాగి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా మరింత కఠినమైన సైనిక చర్యలు తీసుకునేలా ట్రంప్‌ను ప్రభావితం చేయడానికే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఈ సమాచారాన్ని తెరపైకి తెచ్చి ఉండవచ్చని కొందరు అమెరికా అధికారులు భావిస్తున్నారు. ఎందుకంటే నెతన్యాహు ఇరాన్‌పై పూర్తిస్థాయి యుద్ధాన్ని కోరుకుంటుండగా, ట్రంప్ మాత్రం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందనే ఆందోళనతో ఈ వివాదం నుండి త్వరగా బయటపడాలని చూస్తున్నారు. ఏదేమైనప్పటికీ, ఇరు దేశాల మధ్య దౌత్య చర్చలు జరుగుతున్నప్పటికీ, తెరవెనుక సాగుతున్న ఈ హత్యాయత్న కుట్రలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి.

israeli intelligence warns us trump threat,iran secret plan to kill donald trump,trump iran hit list security alert.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అమరావతి రాజధాని అంశం మళ్లీ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఎవరూ ఊహించని ఒక అనూహ్యమైన ఘోర ఘటన చోటుచేసుకుంది.
డీఎస్పీ భీమ్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి ఆయన నివాసంతో పాటు బంధువులు, స్నేహితుల ఇళ్లలో పలుచోట్ల సోదాలు నిర్వహించారు.
మహిళా హక్కుల పరిరక్షణ, సమాజంలో లింగ సమానత్వాన్ని పెంపొందించే దిశగా అస్సాం
ఖమ్మం జిల్లా చింతకానిలో నిర్వహించిన రైతు ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు చేయాలని కోరుతూ టీడీపీ నేతలు విజయవాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు
తెలంగాణలో ఓటరు జాబితాలో ఉన్న డబుల్, డూప్లికేట్ ఓట్లను తొలగించి ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది.
గగనతలంలో ప్రయాణిస్తున్న ఒక వాణిజ్య విమానంలో ఊహించని సాంకేతిక లోపం తలెత్తి తీవ్ర కలకలం రేపింది.
తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా చేపడుతున్న కూల్చివేతల వ్యవహారం మరోసారి రాజకీయ వేడిని రాజేసింది.
1000 కి.మీ. ప్రయాణించి.. గూగుల్ మ్యాప్స్‌తో వెతికి.. అప్పు తీర్చిన కేరళ స్నేహితుడు..!
పోక్సో కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో శుక్రవారం మధ్యాహ్నం చర్లపల్లి కేంద్ర కారాగారం నుంచి ఆయన విడుదలయ్యారు.
తెలంగాణలోని జనగామ జిల్లా కేంద్రంలో ఊహించని రీతిలో ఒక వింత ఘోరం జరిగింది.
ఓ యువకుడిని హీరోగా సినీ పరిశ్రమకు పరిచయం చేస్తానని నమ్మించి, అతని కుటుంబం నుంచి 3.5 కోట్లకు పైగా డబ్బులు తీసుకుని మోసం చేశారనే ఆరోపణలతో దర్శకుడు గుడ్లూరి అశోక్ బాబుపై కేసు నమోదైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.