తెలుగు గంగ కార్యాలయం పై వివాదం ?
Publish Date:Aug 4, 2012
Advertisement
తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు తన కలల ప్రాజెక్టుగా ప్రారంభించిన తెలుగు గంగ నిర్వాహక కార్యాలయం గురించి వివాదం జరుగుతోంది. తిరుపతికి తెలుగుగంగ కార్యాలయాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారన్న సమాచారంపై సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుగంగ ప్రాజెక్టు ప్రారంభం నుంచి శ్రీకాళహస్తిలో ఉన్న కార్యాలయం అందరికీ అలవాటైంది. అటువంటి కార్యాలయాన్ని ఒక్కసారిగా తిరుపతి మారుస్తున్నారన్న సమాచారం స్థానికంగా పెద్దకలకలాన్ని రేపింది. సాక్షాత్తూ సిఎం దృష్టికి ఈ విషయం చేరింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సిఎం కార్యాలయం మారుద్దామనుకుంటున్న విషయమై సిఎంతో పాటు ఎస్సీవీనాయుడు తీవ్రఆగ్రహం వ్యక్తం చేశారు. అథికారుల స్వార్థానికి పరాకాష్టగా ఈ కార్యాలయం మారుస్తున్నారని సిఎం కోప్పడ్డారు. అసలు కార్యాలయం మార్చాల్సిన అవసరం ఏమి వచ్చిందని అధికారులను నిలదీశారు. అంతటితో ఆగకుండా అధికారులు ఇబ్బంది పడాల్సి వస్తుందని ఎస్సీవీనాయుడు చేసిన హెచ్చరికల నేపథ్యంలో సిఎం పరిపాలనా సహాయకుడు రావత్‌ను వాస్తవపరిస్థితిపై నివేదిక ఇమ్మని ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు కలిగించే పరిస్థితులను సహించబోమని హెచ్చరించారు. గంగ కార్యాలయాన్ని ఎక్కడికీ మార్చబోమని, రైతులు అందరూ శ్రీకాళహస్తిలోని గంగ కార్యాలయంతో ఉన్న అనుబంధాన్ని కొనసాగించవచ్చని సిఎం తరుపున ఎస్సీవీనాయుడు తెలిపారు.
http://www.teluguone.com/news/content/dispute-on-telugu-ganga-office-24-16254.html





