గులాబి పార్టీలో అసమ్మతి భగ్గు..వలసలకు సిద్ధం.. సిట్టింగులకే సీట్లు ప్రకటనే కారణమా?

Publish Date:Sep 7, 2022

Advertisement

తెలంగాణలో అధికార తెరాసలో ఏం జరుగుతోంది? కేసీఆర్ తీరు దేనికి సంకేతం. పార్టీలో విభేదాలను పరిష్కరించి నేతలంతా సమన్వయంతో పని చేసేలా దిశా నిర్దేశం చేయాల్సిన కేసీఆర్ తన తీరుతో, ప్రకటనలతో పార్టీలో లుకలుకలు పెచ్చరిల్లేలా, అసమ్మతి జ్వాలలో అజ్యం పోసేలా వ్యవహరిస్తున్నారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు.

గత ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న పార్టీ కావడంతో సహజంగానే యాంటీ ఇంకంబన్సీని తెరాస ఎదుర్కొంటోంది. ప్రజా వ్యతిరేకతకు తోడు.. 2014 ఎన్నికల అనంతరం కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ కారణంగా ఇతర పార్టీల నుంచి వచ్చి తెరాస గూటికి చేరిన ఎమ్మెల్యేల కారణంగా పార్టీలో అసమ్మతి పెరిగింది. ఈ మూడేళ్ల కాలంగా అది నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ  నివురు తొలగి నిప్పు బయటకు వస్తున్న పరిస్థితి. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ దాదాపుగా పార్టీ నేతలలో విభేదాలు ఉన్నాయి, వర్గాలు ఉన్నాయి. వచ్చే ఎన్నికలలో పార్టీ టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్యా పెద్దదిగానే ఉంది. ఈ పరిస్థితుల్లో పార్టీలో విభేదాలను పరిష్కరించి అందరినీ ఏకతాటిపైకి తీసుకురావలసిన పార్టీ అధినేత అందుకు భిన్నంగా సిట్టింగులందరికీ పార్టీ టికెట్లు అంటూ ప్రకటించేసి విభేదాలకు అజ్యం పోసారని పార్టీ శ్రేణులే అంటున్నాయి.

అసలే ఇప్పటికే పార్టీలోని పలు నియోజకవర్గాలలో భగ్గుమంటున్న అసమ్మతి, పార్టీ టికెట్ల కోసం ఇప్పటి నుంచే పోటాపోటీ ఈ నేపథ్యంలో సిట్టింగులకే టికెట్లు అంటూ కేసీఆర్ ప్రకటించి పరిస్థితిని మరింత సంక్లిష్టం చేశారు. మామూలు పరిస్థితుల్లో అయితే ఈ వ్యూహం సత్ఫలితాలను ఇచ్చి ఉండేదేమో కానీ.. ప్రస్తతం రాష్ట్రంలో పరిస్థితుల దృష్ట్యా కేసీఆర్ ప్రకటన పార్టీలో వలసలను పెంచేందుకు మాత్రమే ఉపయోగపడుతుందని పరిశీలకులు అంటున్నారు. 2019 ఎన్నికల సమయంలో అయితే అధినత వైఖరి పట్ల అసమ్మతి ఉన్నా ప్రత్యామ్నాయం లేక అసమ్మతి వాదులు మిన్నకున్నారు.

పార్టీని అంటిపెట్టుకునే ఉన్నారు. ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వారికి పదవులు కట్టబెట్టినా తమ ఆగ్రహాన్ని, అసంతృప్తిని పంటి బిగువుల అదిమిపెట్టి మౌనం వహించారు. అయితే ఇప్పుడు పరిస్ధితి గతానికి పూర్తిగా భిన్నంగా ఉంది. అసమ్మతులకు, అసంతృప్తులకు ఇప్పుడు ఆప్షన్లు ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రాష్ట్రంలో గట్టిగా పుంజుకున్నాయన్న అంచనాల నేపథ్యంలో టీఆర్ఎస్ నుంచి ఆ పార్టీలలోకి వలసలు పెరిగే అవకాశాలూ ఉన్నాయి. ఆయా పార్టీలు తెరాస అసంతృప్తులకు గాలం వేయడానికి సిద్ధంగా ఉన్నాయి. తెరాసలో ఇప్పటికే ఆసంతృప్తి, అసమ్మతి జ్వాలలు ఎగసి పడుతున్నాయి. దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ వర్గపోరు పీక్స్ లో ఉంది. వచ్చే ఎన్నికలలో టికెట్ ఆశావహుల సంఖ్య భారీగా ఉంది. పలు నియోజకవర్గాలలో పార్టీలోని ముఖ్య నేతల మధ్యే మాటల యుద్ధం జరుగుతోంది.

ఇక వచ్చే ఎన్నికలలో విజయం సాధించి అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న బీజేపీ, కాంగ్రెస్ లు రాష్ట్రంలో బలపడుతున్నాయి. బీజేపీ తరఫున ఏకంగా కేంద్ర మంత్రులు రంగంలోకి దిగి రాష్ట్రంలో వరుస పర్యటనతో, కేసీఆర్ పై విమర్శలతో రాజకీయ హీట్ పెంచేస్తున్న పరిస్థితి. అదే సమయంలో క్షేత్ర స్థాయి నుంచీ పార్టీలో సమస్యలను పరిష్కరించుకుని పుంజుకున్న కాంగ్రెస్. ఈ పరిస్థితుల్లో తెరాస అధినేత పార్టీలో సమస్యలను, నేతల మధ్య విభేదాలను పరిష్కరించుకుని పార్టీని ఏకతాటిపై నడిపించాల్సి ఉండగా అందుకు భిన్నంగా సిట్టింగ్ లకు టికెట్లు, అదే పార్టీ సంప్రదాయం అని ప్రకటించేయడం ఆశావహుల ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. దీంతో వారు అనివార్యంగా పక్క చూపులు చేసే పరిస్థితి ఏర్పడింది. ఇదే అదునుగా కాంగ్రెస్, బీజేపీలు అదికార పార్టీలోని అసంతృప్తులు, అసమ్మతీయులకు గాలం వేస్తున్నాయి. మరో వైపు   తెరాసకు చెందిన నేతల కంపెనీలు, ఆస్తులపై ఐటీ, ఈడీ దాడులు. ఇవి సరిపోవన్నట్లు కొత్తగా బీజేపీ తెరపైకి తెచ్చిన ఢిల్లీ లిక్కర్ స్కాం వంటి వాటితో తెరాస డీలా పడిందన్నది ఖాయం.

ఈ సమయంలో తెరాస అధినేత సిట్టింగులకే సీట్లు అన్న ప్రకటన కచ్చితంగా పార్టీపై ప్రతి కూల ప్రభావం చూపుతుంది. కాగా సిట్టింగులకే టికెట్లు అన్న ప్రకటన ద్వారా కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం చేశారని పరిశీలకులే కాదు, పార్టీ శ్రేణులు కూడా అంటున్నాయి  తెలంగాణలో అధికారం కోసం అన్ని విధాలుగా సమాయత్తం అవుతున్న కాంగ్రెస్-బీజేపీలకు ఆయనే   ఆయుధాలు అందించారని అంటున్నారు.  ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాల్లో టికెట్లు ఆశిస్తున్న నేతలున్న నియోజకవర్గాల సంఖ్య, 40 వరకూ ఉంది.  ఈ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై అసమ్మతితోపాటు.. అక్కడ వారి స్థానంలో సీట్లు ఆశిస్తున్న వారి సంఖ్య కూడా ఎక్కువే. ఆ క్రమంలో.. సిట్టింగులకు వ్యతిరేకంగా ఇప్పటినుంచే ముఠాలు కట్టి, రోడ్డెక్కుతున్న ఘటనలు పార్టీ పరువు తీస్తున్నాయి.

ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్‌లో మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య, మాజీ మంత్రి కడియం శ్రీహరిల విషయమే ఇందుకు ఉదాహరణ. ఇరువురూ కూడా  ప్రెస్‌మీట్లు పెట్టి మరీ ఒకరి అవినీతిని మరొకరు బయటపెట్టుకున్నారు. తాజాగా మాజీ ఎంపీ   నర్సయ్యగౌడ్ మంత్రి జగదీష్‌రెడ్డి తనను, కర్నె ప్రభాకర్‌ను తొక్కేయాలని చూస్తున్నారంటూ సంచలన విమర్శలు చేశారు. ముందు ముందు ఇటువంటి సంఘటనలు మరిన్ని జరుగుతాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మహేశ్వరంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి-మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, తాండూర్‌లో మహేందర్‌రెడ్డి-రోహిత్‌రెడ్డి, వికారాబాద్‌లో మెతుకు ఆనంద్-సంజీవరావు, నకిరేకల్‌లో లింగయ్య-వీరేశం, ఆలేరులో సునీతా మహేందర్‌రెడ్డి-సందీప్‌రెడ్డి వర్గాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది.

ఇక వరంగల్ తూర్పులో నన్నపనేని నరేందర్‌కు వ్యతిరేక వర్గం ఇప్పటికే చురుకుగా వ్యవహరిస్తోంది. పాలేరు, కొత్తగూడెం, సత్తుపల్లి, డోర్నకల్, రామగుండం, మంథని, చొప్పదండి, వేములవాడ, జగిత్యాల, ముథోల్, బోధ్, నారాయణఖేడ్, కొడంగల్, నాగర్ కర్నూల్, దేవరకద్ర ఎమ్మెల్యేలపై సొంత పార్టీలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఇక పటన్‌చెరు, ఉప్పల్, ఎల్బీనగర్, హుస్సాబాద్, ఉప్పల్, జహీరాబాద్, ఖైరతాబాద్ నియోజకవర్గాల్లో సీట్ల కోసం సీనియర్లు సిట్టింగులకు వ్యతిరేకంగా పావులు కదుపుతూ, ఆయా నియోజకవర్గాల్లో సొంత సైన్యం తయారుచేసుకునే పనిలో ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిథిలో తప్ప, మిగిలిన జిల్లాల్లో దాదాపు ఇదే పరిస్థితి. ఇక ఈటల రాజేందర్ గెలిచిన హుజూరాబాద్‌లో అయితే అరడజను మంది నేతలు సీట్లు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో  సిట్టింగులకే మళ్లీ సీట్లు  అంటూ కేసీఆర్ ప్రకటన నేపథ్యంలో ఇప్పటికే సిట్టింగులకు పోటీగా, నియోజకవర్గానికి ముగ్గురు-నలుగురు నేతలు సిద్ధమైన పరిస్థితి ఉందని పార్టీ శ్రేణులే అంటున్నాయి. 

By
en-us Political News

  
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.