మచిలీ లో వైకాప మచిలీల కథ!
Publish Date:Jun 11, 2022
Advertisement
ఒకే ఇంట్లో వారు ఆనందంగా, ప్రశాంతంగా జీవిస్తారనే అనుకుంటాడు కుటుంబ పెద్ద. కానీ వూహించని పరిణామాలు, పరిస్థితులు ప్రశాంతతను దెబ్బతీస్తుంది. కలిసి జీవించడమూ కష్టమే. ఇపుడు వైకాపాలో పరిస్థితి ఇదే. ఇన్నాళ్లూ అంతా పకడ్బందీగా, కలిసిమెలసి వుంటున్నారని అనుకున్నదంతా ఒట్టిదేనని తెలుసున్నది. అసలే పరిస్థితులు బాగాలేదనుకుంటుంటే, మచిలీపట్నంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని, మచిలీ పట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరీ మద్య విభేదాలు రోడ్డెక్కాయి. వైసీపీలో కీలకనేతగా ఎదిగిన పేర్నినానికి మచిలీపట్నం నియోజవర్గంలో ఎదురులేకుండా పోయింది. తన మాట చెల్లుబాటు కావా లని, ఆధిపత్య పోకడతో వ్యవహరిస్తూ వచ్చారు. కానీ అది మరీ మితిమీరిపోయింది. ఆయన ఆగడాలకు అడ్డేలేకుండా పోతోందని బాలశౌరి వ్యాఖ్యానించారు. అదీ తన సొంత నియోజకవర్గంలో ఎంపీకి తిరిగే హక్కు లేకుండా పోయిందన్న ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎంపీగా తాను నియోజకవర్గంలో పర్యటించి పరిస్థితులు తెలుసు కోవడం, ప్రజల సమస్యలు వినడానికి వీలులేకుండా అడ్డుకోవడం ఎంతవరకూ సబబు అని బాలశౌరి ఆ్రగహించారు. నిజానికి ఆయనే పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు బాలశౌరి. పార్టీ, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఇంటింటికి ప్రచారం చేయాల్సింది. కానీ టీడీపీ నేత, మాజీ ఎంపీ కొనకళ్ల నారా యణరావుతో అధికార పార్టీ ఎమ్మెల్యేగా పేర్ని నానికి పనేంటి అని బాలశౌరి ప్రశ్నించారు. ఎవరు పార్టీకి, ప్రభుత్వానికి అండదండగా వ్యవహరిస్తున్నారు, ఎవరు అసలు రంగు బయట పెట్టుకుంటు న్నారన్నది వారికి వారే విభేదాలతో తెలియసేస్తున్నారు. పార్టీకి, అధినేతకు విధేయంగా వుంటూ పార్టీ విజయాలకు వెన్నుదన్నుగా వుంటామన్న పేర్ని నాని అసలు రంగు బయట పెట్టడానికి తాను మచిలీ పట్నంలోనే తిష్టవేస్తాను, ఇక్కడి నుంచి కదలనని శౌరి అనడంలో ఆంతర్యమూ అదే కావచ్చు.
http://www.teluguone.com/news/content/differences-open-between-perni-and-balasourie-25-137464.html





