బాలినేని.. వైవీ సుబ్బారెడ్డి.. ఢీ అంటే ఢీ

Publish Date:Oct 27, 2022

Advertisement

ఒకరు స్వయానా ఏపీ సీఎం జగన్ చిన్నాన్న.. మరొకరు మామ.. అంతేకాదు.. వీరిద్దరూ బావ బామ్మర్దులు.. జగన్ కుడి ఎడమ భుజాలుగా ఉంటారు. ఇప్పుడు వీరు ఢీ అంటే ఢీ అంటున్నారు.  వీరిలో ఒకరు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. మరొకరు ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఇరువురూ వైసీపీలో కీలక నేతలు. ఇటీవలి కాలం వరకూ కలిసి ఉన్న వీరు.. ఇప్పుడు కస్సు బుస్సు అంటున్నారట. వైవీఎస్- బాలినేని తీరుతో జగనన్నకు తల బొప్పికట్టిందని, ఇరువురి మధ్యా విభేదాలు కార్యకర్తలను ఇరకాటంలో పడేశాయని అంటున్నారు. తాజాగా ఒంగోలులో శ్రీనివాస కల్యాణం జరిపించే విషయంలో వీరి మధ్య విభేదాలు బట్టబయలయ్యాయన్నారు.

రాజకీయంగా తొలుత కలిసి ఉన్న వైవీ సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి మధ్య తర్వాత మనస్పర్థలు పెరిగిపోయాయి. క్రమేపీ పార్టీలో ఎవరి దారి వారిదే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. వీరి అనుచరులు కూడా అందుకు భిన్నంగా లేరంటున్నారు. చివరికి కుటుంబ వేడుకలో, దేవుడి కార్యక్రమం శ్రీనివాస కల్యాణం ఏర్పాటు విషయంలోనూ వీరి మధ్య విభేదాలు తలెత్తాయి. చినికిచినికి గాలివానలా మారి వ్యవహారం జగన్ దాకా వెళ్లడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశం అయింది.

బాలినేని శ్రీనివాస్ రెడ్డి మనవడి పుట్టినరోజు నవంబరు 9. ఆ సందర్భంగా అదే రోజు ఒంగోలులో శ్రీనివాస కల్యాణం జరిపించాలనుకున్నారు. నిబంధనల ప్రకారం 3 నెలల ముందే టీటీడీకి శ్రీనివాస్ రెడ్డి దరఖాస్తు చేశారు. ఈఓ ధర్మారెడ్డి ఆయనకు సన్నిహితుడు కావడంతో అనుమతి తొందరగానే లభించింది. బాలినేని ఆ వెంటనే స్వామి దర్శనానికి వెళ్లి అనుమతి పత్రాలు అందుకున్నారు. 9న ఒంగోలులో ప్రజల శ్రేయస్సు కోసం శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. 50 వేల మంది భక్తులు పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది.

టీటీడీ చైర్మన్ ను సంప్రదించలేదంటూ.. శ్రీనివాస కల్యాణం నిర్వహణకు సహకరించలేమంటూ కొద్ది రోజుల కిందట టీటీడీ అధికారుల నుంచి బాలినేనికి సమాచారం వచ్చిందట. టీటీడీ చైర్మన్ ను సంప్రదించలేదనీ.. కనీసం పాలకమండలికైనా లేఖ పంపలేదనే సాకుతో అనుమతులు నిలిపేశారట. దీంతో బాలినేనికి కోపం వచ్చింది. ఇచ్చిన అనుమతులు ఎలా రద్దుచేస్తారని బాలినేని ప్రశ్నించారట. అయినా చైర్మన్ ని కాదని ఎవరూ సమాధానం చెప్పలేదట. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల కిందట సీఎంను కలిసిన  బాలినేని  సుబ్బారెడ్డిపై ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. తన మనవడి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసుకున్న కార్యక్రమానికి అడ్డంకులు సృష్టిస్తున్నారని, వైవీ జోక్యంతోనే ఇదంతా జరిగిందని ఆరోపించినట్లు సమాచారం. తాను కూడా చాలా అడ్డంకులు సృష్టించగలనని, సీఎం సూచనలతో సర్దుకుపోతున్నానని చెప్పారని తెలిసింది.

బాలినేని ఫిర్యాదుపై పరిశీలించి చర్యలు తీసుకుంటానని సీఎం జగన్ హామీ ఇచ్చినట్లు సమాచారం. తర్వాత వైవీని పిలిపించి జగన్ మాట్లాడారు. ఒంగోలులో శ్రీనివాస కల్యాణం నిర్వహణకు ఆటంకం లేకుండా చూడాలని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇంతలో బాలినేని నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లడంతో వివాదం ముదిరిందని, ఒంగోలులో శ్రీనివాస కల్యాణం ఇక లేనట్లే అని ప్రచారం జరిగింది. అయితే తాజాగా శ్రీనివాస కల్యాణం నిర్వహణకు టీటీడీ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించినట్లు తెలిసింది.

వాస్తవానికి బాలినేని శ్రీనివాసరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి మధ్య విభేదాలు చాలాకాలం నుంచే ఉన్నాయి. జగన్ జోక్యం చేసుకుని ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పార్టీ బాధ్యతలను బాలినేనికి కేటాయించి... ఉత్తరాంధ్ర బాధ్యతలు వైవీకి అప్పగించారు. అయినా ఇద్దరూ కలవకపోగా పంతాలకు పోయి ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకుంటుండడం గమనార్హం.

By
en-us Political News

  
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు  ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.  కవితను పోలీసులు  పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్‌ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌, అజారుద్దీన్‌.. బీఆర్‌ఎస్‌ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లకు సవాల్‌ విసిరారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.