నోట్ల కట్టలు కాదు కట్టు బట్టలతో పారిపోయా.. ఆఫ్ఘనిస్థాన్ మళ్లీ వస్తానంటున్న ఘనీ

Publish Date:Aug 19, 2021

Advertisement

ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షడు ఆష్రఫ్ ఘనీ.. దేశం విడిచి పారిపోయిన 3 రోజుల తరువాత మొదటిసారిగా మీడియా ముందుకొచ్చారు. ఆయన మాట్లాడిన వీడియోను పలు అరబ్ చానల్స్ ప్రసారం చేశాయి. తాలిబన్లు కాబూల్ ను ఆక్రమించుకుంటూ ఉండగానే ఘనీ అధ్యక్ష భవనం ఖాళీ చేసి ఎవరి కంటా పడకుండా పారిపోయారు. అతను కిర్గిజిస్తాన్, తుర్కిమెనిస్తాన్, కజకిస్తాన్ వంటి దేశాల్లో ఎక్కడికో పారిపోయి ఉంటాడని అనుమానించారు. అయితే తాను అరబ్ ఎమిరేట్స్ లో తల దాచుకున్నానని తనకుతానుగా రివీల్ చేశారు. తాను ఎందుకు ఆఫ్ఘనిస్థాన్ విడిచి వెళ్లాల్సి వచ్చిందో వివరణ ఇచ్చుకున్నారు. దేశం మీద జరిగిన దురాక్రమణను ఖండిస్తూ దేశ ప్రజలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. 

నేను చెప్పులు విప్పి, కనీసం షూ వేసుకునే టైమ్ కూడా లేదని, అలాంటి పరిస్థితుల్లో తాను కాబూల్ ను వీడాల్సి వచ్చిందని చెప్పారు. తాను భారీ ఎత్తున సొమ్ముతో ఉడాయించినట్లు వచ్చిన పుకార్లను ఎవరూ నమ్మవద్దని, గొప్పనైన ఆఫ్ఘనిస్థాన్ సంస్కృతిని మలినం కాకుండా చూసేందుకు, అరాచక శక్తుల మీద తిరుగుబాటు చేసేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉండాలన్నారు. ఆఫ్ఘనిస్థాన్ మళ్లీ వస్తానని నమ్మబలుకుతున్న ఘనీ.. అందుకోసం తాను సంప్రదింపుల్లో మునిగిపోయినట్లు చెప్పడం ఆసక్తి రేపుతోంది. పాతికేళ్లలో రెండోసారి కాబూల్ ను కబ్జా చేసిన తాలిబన్లు ఈసారి రెచ్చిపోయిన ఉత్సాహంతో దూసుకుపోతున్నారు. పరిపాలన ఎవరి చేతుల్లోకి వెళ్తుందో, పాలనను ఎలా ఆర్డర్ లో పెడతారో అర్థం కాని పరిస్థితులు పేరుకుపోయిన క్రమంలో ఘనీ సంప్రదింపుల ముచ్చట... మరేదైనా విదేశీ శక్తుల అండకోసం ప్రయత్నిస్తున్నాడా అన్న అనుమానాలకు తావిస్తోంది. 

తాను అక్కడే ఉంటే గనక కొత్తగా ఎలక్టయ్యే అధ్యక్ష బాధ్యతలు చేపట్టే వ్యక్తిని తాలిబన్లు బహిరంగంగా ఉరి తీసి ఉండేవారని, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి అల్లకల్లోలానికి కారకులయ్యేవారని.. అయితే అలాంటి ప్రమాదం రాకుండా ఉండేందుకు, ఆ ఉపద్రవం నుంచి ప్రజలను కాపాడేందుకే తప్పనిసరి పరిస్థితుల్లో యూఏఈ వెళ్లిపోయినట్లు చెప్పుకొచ్చారు ఘనీ. ఆఫ్ఘన్ ప్రజల మర్యాదను, వారికి దక్కాల్సిన న్యాయాన్ని అందించేందుకు శతవిధాలా కృషి చేస్తున్నట్లు యూఏఈ నుంచి వాయిస్ వినిపించారు. తన పాలనలో ఆఫ్ఘన్ సాధించిన అభివృద్ధిని కాపాడుకోవాలని, అరాచక శక్తుల చేతుల్లోకి దేశ వారసత్వాన్ని వెళ్లకుండా చూడాలని, ఇందుకోసం ప్రజలంతా కలిసి రావాలని కోరారు. ప్రజలకు సేవలందిస్తూ గౌరవ ప్రదంగా చనిపోవడానికి తానెప్పుడూ భయపడేవాణ్ని కానని, కేవలం ప్రపంచంలో ఆఫ్ఘనిస్థాన్ గౌరవ మర్యాదలకు భంగం కలగకూడదన్న ఉద్దేశంతోనే కాబూల్ ను వీడినట్లు చెప్పుకొచ్చారు. ఖజానాలోని సొమ్మంతా తీసుకొని వచ్చినట్లు వచ్చిన పుకార్లను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

అయితే ఘనీ స్టేట్ మెంట్ మీద నెటిజన్ల నుంచి వ్యతిరేక కామెంట్లే ఎక్కువొస్తున్నాయి. ముఖ్యంగా భారతీయ ముస్లిం సమాజం తాలిబన్లను స్వాగతిస్తుండగా... ఘనీ చెబుతున్నవన్నీ కల్లబొల్లి కబుర్లంటూ ట్రోల్ చేస్తున్నారు. ఘనీ 169 మిలియన్ డాలర్ల సొమ్ముతో ఉడాయించాడని, సూట్ కేసుల నుండా కరెన్సీ కట్టలు సర్దుకొని తాలిబన్లకు చిక్కకుండా తప్పించుకొని ప్రాణాలు కాపాడుకున్నాడంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వచ్చాయి. అయితే ఆయన ఫస్ట్ వాయిస్ అనేది అత్యంత బలహీనంగా ఉందని, మళ్లీ కాబూల్ కు వెళ్తే ఘనీని కాల్చి చంపడమో, ఉరి తీయడమో ఖాయమని, అమెరికా తొత్తు అయిన ఈ ముసలి వ్యక్తికి చావే సరైన శిక్ష అంటూ అత్యధిక మంది ముస్లింలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరి ఘనీ నిజంగా ఆఫ్ఘనిస్థాన్ రావడం సాధ్యమేనా.. తాను  అంతర్జాతీయ సమాజంతో సంప్రదింపులు జరుపుతున్నట్టు చెబుతున్నదాంట్లో ఎంతవరకు వాస్తవముంది... అసలు అమెరికా, నాటో దళాలే వెనుదిరిగిపోతే ఒంటరి ఘనీ ఏం చేస్తాడన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. దీనిమీద క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

By
en-us Political News

  
తెలంగాణ ప్రయోజనాలే తమకు పరమావధన్న ఆయన పార్లమెంటులో ఈ ప్రతిపాదనపై చర్చ,  ఓటింగ్ జరిగినప్పుడు తమ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు అనుకూలంగా ఓటు వేస్తారని వెల్లడించారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు ఆమోదం పొందితే దేశ రాజకీయాలలో కాంగ్రెస్ ప్రతిష్ఠ బాగా మసకబారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి. ఇది 2029 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు అవకాశాలపై నిస్సందేహంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
తొలి విడత పంచాయతీ ఎన్నికలలో  వైసీపీ మద్దతుదారులు కనీసం పాతిక శాతం  స్థానాలను కూడా గెలుచుకోలేకపోయారు. అదే సమయంలో తెలుగదేశం కూటమి మద్దతు ఉన్నఅభ్యర్థులు తిరుగులేని విజయాలతో ప్రభంజనం సృష్టించారు. 
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బిల్లు ఉద్దేశాలను, ప్రక్రియను  తప్పుబడుతుండగా, ఇండియా కూటమిలోని పలు ప్రాంతీయ పార్టీలో,  సీట్ల వాటా రక్షణ, సవరణల ఆధారంగా తమ వైఖరిని మార్చుకుంటున్న సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
డీలిమిటేషన్ తో పాటు, మహిళా రిజర్వేషన్ల అమలును తీసుకురావడమే ఈ సమావేశాల నిర్వహన ప్రధాన లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ చెబుతున్నప్పటికీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ హడావుడి సమావేశాల వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం బీజేపీకి రాజకీయ లబ్ధి చూకూర్చడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు ఏ   రాష్ట్రంలోనూ  సీట్ల వాటా తగ్గదు, ప్రస్తుత నిష్పత్తిని కాపాడుతూనే అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా స్థానాలు పెరుగుతాయి.  అంతేకాకుండా, 2051 సీట్ల విషయంలో మార్పులు లేకుండా స్తంభనను అమలు చేయడం ద్వారా భవిష్యత్ జనాభా గణాంకాల ఆధారంగా రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తి మారకుండా నియంత్రించామని కేంద్రం చెబుతోంది. 
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.