కరీంనగరా.. కరినగరా?

Publish Date:Dec 15, 2022

Advertisement

తెలంగాణ బీజేపీ కరీంనగర్ కు కొత్తగా నామకరణం చేసిందా? కరీంనగర్ ను కరినగర్ గా ఏకపక్షంగా మార్చేసిందా? అంటే ఆ పార్టీ బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర 5వ విడత ముగింపు సభ సందర్భంగా మీడియాకు ఇచ్చిన ప్రకటనలలో కరీంనగర్ పేరును కరినగర్ గా పేర్కొంది. దీంతో అందరూ కరీంనగర్ పేరు కరినగర్ గా ఎప్పుడు మారింది అన్న సందిగ్ధంలో పడ్డారు. మరి కొందరేమో ముద్రారాక్షసమంటూ చర్చ లేవదీశారు.

చివరకు తేలిందేమిటంటే.. పూర్వ కాలంలో కరీంనగర్ ను కరినగరంగా పిలిచేవారట. ఎందుకంటే కరి అంటే ఏనుగు.. ఎనుగులు ఎక్కువగా తిరిగే ప్రదేశం కనుక అప్పట్లో కరీంనగర్ ను కరినగరంగా పిలిచేవారట.. కాలక్రమేణా నాటి కరినగరంపేరు కరీంనగర్ గా స్థిరపడిందట. ఇప్పుడు పాత చరిత్ర పుటలను తిరగేసి బీజేపీ ఏకంగా ఏకపక్షంగా  కరీంనగర్ ను కరినగర్ గా మార్చేసింది. అయినా బీజేపీకి ఇలా నగరాలు, ప్రదేశాల పేర్లను మార్చేయడం  కొత్తేమీ కాదు.

 బీజేపీ కేంద్రంలో అధికారం చేపట్టినప్పటి నుంచీ దేశంలోని పలు నగరాలకు పున: నామకరణం చేస్తూ వస్తోంది. యూపీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలోని పలు నగరాల పేర్లే మార్చేశారు. కర్నాటకలోనూ బీజేపీ ప్రభుత్వం అదే చేసింది. తెలంగాణలో కూడా తమ పార్టీ అధికారంలోకి వచ్చాకా పలు నగరాల, ప్రాంతాల పేర్లు మారుస్తామని చెబుతోంది. అయితే రాష్ట్రంలో ఇంకా అధికారంలోకి  రాకుండానే బీజేపీ కరీంనగర్ కు కరినగరంగా నామకరణం చేసేసింది.

ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ సందర్భంగా ఇచ్చిన అడ్వర్టైజ్ మెంట్లలోనూ, పోస్టర్లు, ఫ్లెక్సీలలోనూ కరీంనగర్ అని కాకుండా కరినగర్ అని పేర్కొంది. బీజేపీ పేర్ల మార్పు ప్రహసనంపై ఇప్పటికే దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని పేర్ల మార్పు ప్రక్రియను బీజేపీ చేపట్టిందన్న విమర్శలు ఉన్నాయి.

ఇక కరీంనగర్ విషయానికి వస్తే కరీం అంటే మైనారిటీ వర్గానికి సంబంధించిన పేరు అంటూ అసలు కరీంనగర్ వాస్తవ నామం కరినగర్ అంటూ వాదిస్తోంది. ఇటీవల తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ భైంసా పర్యటన సందర్బంగా బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే భైంసా పేరును మార్చేస్తామని ప్రకటించారు. ఎప్పటి నుంచో హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తామంటూ వస్తున్నారు. హిందుత్వ అజెండాలో భాగంగానే బీజేపీ ఈ విధంగా వ్యవహరిస్తోందన్న విమర్శలకు ఆ పార్టీ అసలు ఖాతరు చేయడం లేదు.  

By
en-us Political News

  
విజయవాడలో ప్రతిష్ఠాత్మక రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఆన్‌లైన్ పరిచయం.. చాటింగ్‌తో స్నేహం.. వీడియో కాల్స్‌తో నమ్మకం.. ఆ తర్వాత ఇంటికి ఆహ్వానం. అంతా సజావుగా సాగుతున్నట్లే కనిపిస్తుంది. కానీ ఆ పరిచయాల వెనుక ఉన్నది స్నేహం కాదు
హైదరాబాద్ వేదికగా ఇటీవల జరిగిన భారత్ సమ్మిట్‌ 2026లో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
సినిమాను తలపించిన నగల దొంగతనం..పట్టించిన పచ్చబొట్టు.!
హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా బిర్యానీ ప్రియులకు భారీ షాక్ తగిలింది.
ప్రియుడి హత్యకు 19 ఏళ్ల యువతి సుపారీ.. షాకింగ్ ట్విస్ట్.!
దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడానికి స్వస్థలానికి వచ్చిన ఓ యువతికి మృత్యువు అనూహ్య రీతిలో ఎదురైంది.
హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే కార్తీక మాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
తీపి పదార్థమనుకుని నోట్లో పెట్టుకున్నాడు.. చివరకు విగతజీవిగా మారాడు!
డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న గిగ్ వర్కర్ల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.