ధర్మవరం పట్టుతో దురదలు, ఎలర్జీ?
Publish Date:Feb 18, 2012
Advertisement
తెలుగువన్ డాట్ కామ్ ప్రత్యేక కధనం
అనంతపురం: అనంతపురం జిల్లా ధర్మవరం పట్టు అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించింది. ఈ జిల్లాలో సుమారు లక్షా 20వేల చేనేత మగ్గాలు ఉండగా సగానికి పైగా ధర్మవరం దాని చుట్టూ ప్రక్కల ప్రాంతాల్లో ఉన్నాయి. అయితే ఈ రంగం వేలాదిమందికి ఉపాధిని ఇస్తున్నప్పటికీ పర్యావరణానికి ముప్పుగా మారింది. పట్టుచీరల తయారీలో కీలకమైన రంగుల అద్దకం ప్రజల ఆరోగ్యానికి శాపంగా మారింది. నిత్యం చేనేత కార్మికులు ఉపయోగిస్తున్న లక్షలాది లీటర్ల రంగునీళ్ళతో భూగర్భజలం కలుషితమవటమే కాక అబద్దానికి ఉపయోగించే రసాయనాలు, యాసిడ్లతో పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుంది. ప్రస్తుతం పట్టణంలో ఎక్కడ బోరువేసినా మంచినీళ్ళు లభించే పరిస్థితే లేదు. భూమిలోకి ఇంకుతున్న రంగునీళ్ళు, రసాయనాలతో భూగర్భజలం కలుషితమై రంగు, రుచి మారిపోయాయి. ఇక్కడి భూగర్భ జలాల్లో కాఠిన్యత 600 పిపిఎంల కంటే ఎక్కువగా ఉందని ఇటీవల పరీక్షల్లో తేలింది. కొంతమంది రంగుల అడ్డకానికి నిషేధించిన పౌడర్లు, యాసిడ్లు ఇతర ప్రమాదకర రసాయనాలు ఉపయోగిస్తున్నారు. వీటివల్ల ఆయా దుస్తులు ధరించి వారికి ఎలర్జితోపాటు దురదలు కూడా వస్తున్నాయి. వీరు నిషేధిత పెంటా క్లోరోఫినాల్, అరెల్ అమైన్స్, బెర్జిలిన్, ఇథాక్సి, అనిలిన్, నాప్తల్ ఫైన్ వంటి రసాయనాలను ఉపయోగిస్తున్నారు. వీటిని పలు దేశాల్లో ఎప్పుడో నిషేధించారు.
http://www.teluguone.com/news/content/dharmavaram-24-12010.html





