32 ఏళ్ల పోలీస్ జీవితంలో అనేక అనుభవాలు, జ్ఞాపకాలు.. డీజీపీ శివధర్‌రెడ్డి
Publish Date:Apr 30, 2026
Advertisement
32 ఏళ్ల పోలీస్ జీవితంలో అనేక అనుభవాలు, జ్ఞాపకాలు మిగిలాయని డీజీపీ శివధర్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. శివధర్ రెడ్డి డీజీపీగా గురువారం (ఏప్రిల్ 30) పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. తనను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పాత పోలీసింగ్ విధానాలతో పోలిస్తే ఇప్పటి పరిస్థితుల్లో పెద్ద మార్పులు వచ్చాయన్న ఆయన.. పోలీస్-ప్రజల మధ్య దూరం తగ్గించేందుకు కృషి చేయాలన్న ఉద్దేశంతో ఫ్రెండ్లీ పోలీస్ విధానం తీసుకువచ్చామన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పోలీసులపై వచ్చిన అభిప్రాయాల మార్పు కోసం చర్యలు తీసుకున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీగా అవకాశం ఇచ్చినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ఆయన, కొత్త డీజీపీ సీవీ ఆనంద్‌కు అభినందనలు తెలిపారు. కాగా పదవీ విరమణ చేసిన శివధర్‌రెడ్డికి నూతన డీజీపీ సీవీ ఆనంద్ అభినందనలు తెలిపారు. శివధర్ రెడ్డి 32 ఏళ్ల పాటు ప్రజలకు విశిష్ట సేవలు అందించారన్న సీవీ ఆనంద్, నక్సలిజం ప్రభావిత ప్రాంతాల్లో కీలకంగా పని చేశారని పేర్కొన్నారు. పోలీస్ కుటుంబాల కోసం సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. ఆపరేషన్ కగార్ విజయవంతంగా అమలు చేశారనీ చెప్పారు.
http://www.teluguone.com/news/content/dgp-shivdharreddy-retire-36-218611.html





