తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Publish Date:Aug 19, 2025
Advertisement
కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు. మంగళవారం ( ఆగస్టు 19) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో పాతిక కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టెకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 20 గంటలకు పైగా సమయం పడుతోంది. అలాగే 300 రూపాయప ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు స్వామి వారి దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. ఇక సర్వదర్శనం టోకెన్ల భక్తులకు 6 గంటల సమయం పడుతోంది. ఇక సోమవారం (ఆగస్టు 18) శ్రీవారిని మొత్తం స్వామివారిని మొత్తం 80,502 మంది భక్తులు దర్శించుకోగా, వారిలో 31,890 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4కోట్ల 88 లక్షల రూపాయలు వచ్చింది.
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-39-204509.html





