చైనాలో వరద బీభత్సం.!

Publish Date:Jul 16, 2026

Advertisement

భారీ వర్షాలు, వరదలతో డ్రాగన్ దేశం చిగురుటాకులా వణికిపోతోంది.   చైనాలోని పలు ప్రాంతాల్లో ప్రకృతి బీభత్సం సృష్టిస్తోంది. కుండపోత వర్షాలు, భారీ వరదలలో పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. గ్వాంగ్సీ జువాంగ్ అటానమస్ రీజియన్‌లో కురిసిన రి  భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలు  జలప్రళయాన్ని తలపించాయి. ఈ వరద బీభత్సానికి  39 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 9 మంది  గల్లంతయ్యారు.  నానింగ్‌లో ఒక ప్రధాన రిజర్వాయర్ కట్ట ఒక్కసారిగా తెగిపోవడంతో వరద ఉధృతి అనూహ్యంగా పెరిగిపోయింది. రిజర్వాయర్ నీరు ఊళ్ళపైకి దూసుకురావడంతో ప్రాణనష్టం, ఆస్తి నష్టం భారీగా పెరిగింది.  

ఇక ఈశాన్య చైనాలోని జిలిన్ ప్రావిన్సులోనూ వరద బీభత్సం సృష్టించింది.  బావి తుపాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షాలు కురుస్తుండటంతో  అధికారులు  రెడ్ అలర్ట్ జారీ చేశారు.  నదులు ఉప్పొంగడం, కొండచరియలు విరిగిపడటం, చిన్న మరియు మధ్యస్థ రిజర్వాయర్లకు ప్రమాదం పొంచి ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

 వాయవ్య చైనాలోని షాన్సీ, శాన్జీ ప్రావిన్సులలో  భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే శుక్రవారంవరకూ అంటూ జులై 17 వరకూ ఈ ప్రాంతాలలో కుండపోత వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.  ఈ భారీ వర్షాల కారణంగా   ఎల్లో నదితో పాటు దాని ఉపనదులైన వెయ్, ఫెన్, ఖిన్ నదులలో నీటిమట్టాలు ప్రమాదకరంగా పెరిగే అవకాశం ఉందని జలవనరుల మంత్రిత్వ శాఖ అంచనా వేస్తోంది.  

Devastating floods in China, guangxi region heavy rains, typhoon bavi china, jilin province flood alert, china flood death toll 

By
en-us Political News

  
భాగ్యనగరంలో నిత్యం మెట్రో రైళ్లలో ప్రయాణించే లక్షలాది మంది ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ అత్యంత తీపి కబురు అందించింది.
ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ (ఐజీఐ) విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీ ఎత్తున ఎర్రచందనం స్మగ్లింగ్ యత్నాన్ని భగ్నం చేశారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో విద్యనభ్యసిస్తున్నదాదాపు 43.30 లక్షల మంది విద్యార్థులకు పూర్తి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. వయసు రీత్యా 6 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల లోపు ఉన్న పాఠశాల విద్యార్థులందరూ ఈ ఉచిత వైద్య సేవల పరిధిలోకి వస్తారు.
తాజాగా యూఎస్ కరెన్సీపై తన బొమ్మ ముద్రణతో మరో సారి టాక్ ఆప్ ది వరల్డ్ గా మారారు. అమెరికా స్వాతంత్ర్యం 250 వసంతాలు పూర్తి చేసుకుంటున్న చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని.. ప్రెసిడెంట్ ట్రంప్ ముఖచిత్రంతో కూడిన సరికొత్త నాణేన్ని అక్కడి ప్రభుత్వం తీసుకువస్తోంది.
గోల్కొండ జగదాంబికా మహంకాళి ఎల్లమ్మ అమ్మవారికి ప్రభుత్వ పక్షాన మంత్రులు అధికారికంగా తొలి బంగారు బోనం, పట్టువస్త్రాలు సమర్పించడంతో ఈ ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నిరసనల్లో భాగంగా వాంగ్‌చుక్ నిరవధిక నిరశన చేపట్టారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందంటూ దాఖలైన ఒక అత్యవసర పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు విచారణకు స్వీకరించింది.
గల్ఫ్ జలాల్లో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని ఇటీవలి కాలంలో దాడులు విపరీతంగా పెరిగిన సంగతి విదితమే. ముఖ్యంగా మొంబాసా బి, అల్ బహ్యా, జీఎఫ్ఎస్ గెలాక్సీ, ఎంటీ వెద్యాన్, అల్ రెకయ్యాత్ వంటి వాణిజ్య నౌకలపై జరిగిన వరుస దాడులు అంతర్జాతీయ నౌకాయాన రంగాన్ని కుదిపేస్తున్నాయి.
ఆంక్షల ప్రకారం, సాధారణ పౌరులకు గానీ, దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు గానీ కోట ప్రాంగణంలోకి ప్రవేశం ఉండదు. కేవలం ఈ వేడుకల ఏర్పాట్లలో పాల్గొనే ఉన్నతాధికారులు, సిబ్బంది,  అధికారిక అనుమతి పత్రాలు ఉన్న  వ్యక్తులను మాత్రమే కఠిన తనిఖీల అనంతరం లోపలికి అనుమతిస్తున్నారు.
పాకిస్తాన్ సైనిక బలగాలు తమ ప్రాంతాన్ని చట్టవిరుద్ధంగా, అక్రమంగా ఆక్రమించుకున్నాయని అమ్జాద్ అయూబ్ మీర్జా ప్రకటించారు. ఈ ప్రాంతం ఎంతమాత్రం స్వతంత్రమైనది కాదని, పాకిస్తాన్ ప్రభుత్వం ఇక్కడి ప్రజలను బానిసలుగా చూస్తోందని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
విద్యా రంగానికి సంబంధించి మొత్తం ఐదు పాఠశాలలను ఏర్పాటు చేయనున్నారు. వీటిలో మూడు సాధారణ డే స్కూళ్లు కాగా, మిగిలిన రెండు పూర్తి స్థాయి వసతులతో కూడిన రెసిడెన్షియల్ పాఠశాలలు.
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్తాన్.. దానినుంచి బయటపడేందుకు డిస్పరేట్ గా ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే.. అగ్రరాజ్యం విధించే కఠినమైన వ్యూహాత్మక నిబంధనలకు తలవొగ్గుతూ తన సొంత రక్షణ వ్యవస్థను పరాధీనం చేసుకుంటోందన్నది ఆ కథనాల సారాంశం.
మిడిల్ ఈస్ట్ యుద్ధ ఉద్రిక్తతలు మరియు వంద డాలర్లు దాటిన క్రూడాయిల్ ధరల మధ్య భారత స్టాక్ మార్కెట్లు అద్భుత రికవరీ సాధించాయి. సెన్సెక్స్ 200 పాయింట్లు పెరగగా, నిఫ్టీ 24100 మార్కును దాటింది. మార్కెట్ తదుపరి గమనంపై విశ్లేషకుల అంచనాలు మీకోసం.
స్విట్జర్లాండ్‌లోని ETH జ్యూరిచ్ శాస్త్రవేత్తలు గిటార్ సూత్రాంతర్భాగంగా పనిచేసే సరికొత్త వేలి గోరు పరిమాణపు క్వాంటం చిప్‌ను ఆవిష్కరించారు. ఈ చిప్ విద్యుదయస్కాంత తరంగాల కంటే 1,00,000 రెట్లు చిన్న శబ్ద ప్రకంపనలను ఉపయోగించి డేటాను భద్రపరుస్తుంది, ఇది క్వాంటం ర్యామ్ (QRAM) పరిశోధనలో ఒక పెద్ద మైలురాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.