ఇక అంతా ఢిల్లీ నుంచే!

Publish Date:Jun 9, 2025

Advertisement

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో మారు ఢిల్లీ వెళ్ళారు.ఇంతవరకు ముఖ్యమంత్రి  ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా.. ఎప్పుడు అధిష్టానం పెద్దలను కలిసినా మంత్రివర్గ విస్తరణ గురించి చర్చించినట్లు చెప్పుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పడు ఎట్ట కేలకు  ఆ క్రతువు  సగం పూర్తయింది.  మిగిలిన సగం ఎప్పుడన్నది పక్కన పెడితే..  ఇప్పడు ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళింది  మాత్రం అందుకోసం కాదు.  మంత్రి పదవులు ఇచ్చిన ముగ్గురు కొత్త మంత్రుల శాఖల కేటాయింపు గురించి  అధిష్టానం పెద్దలతో చర్చించేందుకు అందుకు అదనంగా.. మంత్రివర విస్తరణ బృహత్ ప్రణాళికకు సమాంతరంగా సాగు తూ వస్తున్న  హాఫ్ ఫినిష్ డ్ పీసీసీ కార్యవర్గ విస్తరణపై చర్చించనున్నట్లు చెపుతున్నారు. అలాగే.. పనిలో పనిగా స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై ఏర్పాటు చేయ తలపెట్టిన బహిరంగ సభల విషయం ఆదిస్థానంతో చర్చించి, సభలు ఎప్పుడు, ఎక్కడ పెట్టాలో నిర్ణయించేందు కోసమూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినట్లు చెపుతున్నారు.  

ఎందుకోసం అయినా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ శ్రీకారం చేసిన రోజు నుంచి ఈరోజు వరకు 46 సార్లు ఢిల్లీ వెళ్లివచ్చారు. మరో నాలుగు రౌండ్లు కొట్టి వస్తే, హాఫ్ సెంచరీకి చేరు కుంటారు. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి రావడం పెద్ద విషయం విశేషం కాదు. అలాగే..  కొన్ని కీలక విషయాల్లో అధిష్టానంతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం కూడా కొత్త విషయం కాదు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా ఉన్న కోట్ల, వైఎస్సార్ వంటి ఉద్దండ కాంగ్రెస్ నాయకులు కూడా ఢిల్లీ వెళ్లి రావడం, ఢిల్లీ కనుసన్నల్లో పని చేయడం, తరచూ ఢిల్లీ చక్కర్లు కొట్టడం ఉన్నదే. అయితే ఇప్పడు ఆ ఫ్రీక్వెన్సీ పెరిగింది. గతంలో ముఖ్యమంత్రులు రెండు మూడు నెలలకు ఒప్కసారి ఢిల్లీ వెళ్లి వస్తే..  ఇప్పడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెలలోనే రెండు మూడు సార్లు ఢిల్లీ వెళ్లి వస్తున్నారు.

అదలా ఉంటే..  ముందు ముందు ఈ  జోరు ఇంకా పెరుగుతుందని అంటున్నారు. తెలంగాణను రోల్ మోడల్ గా చూపించి, దేశం మొత్తంలో పూర్వ వైభవ స్థితిని పొందే ఆలోచనలో ఉన్న కాంగ్రెస్ అధిష్టానం ముందు ముందు  రాష్ట్ర పార్టీ వ్యవహరాల్లోనే కాకుండా  పాలనా వ్యవహారాల్లోనూ మరింత క్రియాశీల పాత్రను పోషించ వచ్చని అంటున్నారు. ఇప్పటికే  రాహుల్ గాంధీ పలు సందర్భాలలో, పలు వేదికల నుంచి, కులగణన ఎస్సీ వర్గీకరణ విషయాల్లో తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదర్శంగా పేర్కొంటున్నారు.చివరకు.. ఈ మధ్యనే మొదలు పెట్టిన  బీహార్ ఎన్నికల ప్రచారంలోనూ రాహుల్ గాంధీ  కులగణనకు తెలంగాణ  మోడల్ ను ప్రచార అస్త్రంగా ఉపయోగిస్తున్నారు. అందుకే.. మంత్రి వర్గ విస్తరణలో, రాష్ట్రంలో పార్టీకి పట్టుకొమ్మగా ఉన్న  రెడ్డి సామాజిక వర్గాన్ని  పూర్తిగా పక్కన పెట్టి, బీసీ, ఎస్సీ లకు మాత్రమే అవకాశం కల్పించారని అంటున్నారు.ఈ పరిణామాలను గమనిస్తే, ప్రభుత్వం రోజు వారీ వ్యవహారాల్లోనూ  ఢిల్లీ పెత్తనం పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.  

నిజానికి  ఇప్పటికే  ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల  ఇంచార్జి మీనాక్షి నటరాజన్ పరిపాలన వ్యవరాల్లో జోక్యం చేసుకుంటున్నారు. సెంట్రల్ యూనివర్సిటీ భూమి వివాదం విషయంలో ఆమె నేరుగా సెక్రటేరియట్ కు వెళ్లి, మంత్రులతో సమావేశాలు నిర్వహించడం వివాదాస్పమైంది. అలాగే.. యూనివర్సిటీ ఉపాధ్యయ, విద్యార్ధి సంఘాలతో చర్చలు జరపడాన్ని కూడా  విపక్షాలు తప్పు పట్టాయి. మీనాక్షి నటరాజన్ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించాయి. విపక్షాలు విమర్శించడమే కాదు..  స్వపక్షంలోనూ లుకలుకలు వినిపించాయి. మీనాక్షి గీత దాతుతున్నారని అధికార పార్టీ నేతలు గుసగుసలు పోయారు.  

అలాగే..  తాజా మంత్రివర్గ విస్తరణలోనూ కాంగ్రెస్ అధిష్టానం, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, సీనియర్ మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు,ఇతర నేతలను పలుమార్లు ఢిల్లీ పిలిపించి చర్చలు జరిపింది. చివరకు.. రాష్ట్ర నాయకుల అభిప్రాయాలను పక్కన పెట్టి మీనాక్షి స్వయంగా  నిర్వహించిన సమీక్షల అదారంగా కొత్త మంత్రుల ఎంపిక జరిగిందని అంటున్నారు. అలాగే..  ముఖ్య మంత్రి సహా రాష్ట్ర నాయకులు చేసిన  సి ..ఫార్సులను బుట్ట దాఖలు చేసి,   రాహుల్ గాంధీ కోటాలో ఒకరికి, ఖర్గే ఖాతాలో ఇద్దరికీ మంత్రి పదవులు ఇచ్చినట్లు చెపుతున్నారు. తద్వారా ఇక అంతా ఢిల్లీ నుంచే అన్న సంకేతాలు  అధిష్టానం  ఇచ్చిందంటున్నారు. అలాగే.. మంత్రివర్గ విస్తరణలో బెర్త దక్కని,ఆశావహులను బుజ్జగించి, దారిలోకి తెచ్చే విషయంలోనూ మీనాక్షి నటరాజన్ క్రియాశీల పాత్రను పోషించారు. ముఖ్యమంత్రి, సీనియర్ మంత్రుల ప్రమేయం లేకుండా వ్యవహరాన్ని చక్క బెట్టారు. తద్వారా  అధిష్టానం దూతగా అధిష్టానం ఆశీస్సులతో ఆమె రాష్ట్ర పార్టీలోనే కాదు..  ప్రభుత్వంలోనూ, మరో పవర్ సెంటర్, (అధికార కేంద్రం) గా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారని అంటున్నారు. ఈ పరిణామాలను గమనిస్తే  గతంలో విపక్షాలు చేసిన రబ్బర్ స్టాంప్  ఆరోపణకు బలం చేకురుతోందని అంటున్నారు.

By
en-us Political News

  
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది. 
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ..  తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ  తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి. 
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది.  సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును  దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి  కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది.  ఈ నేపథ్యంలో తాను కేవలం  మంత్రి పదవిని  మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.