సా...గుతున్న బైపాస్ రోడ్డు నిర్మాణం.. బెజవాడను వీడని ట్రాఫిక్ కష్టాలు

Publish Date:Oct 6, 2025

Advertisement

కృష్ణా, గుంటూరు జిల్లాల సరిహద్దుల్లో  నిర్మిస్తున్న జాతీయ రహదారి,  విజయవాడ వెస్ట్ బైపాస్  కొన సా,,,గుతూనే ఉంది. గత వైసీపీ హయాంలో ఈ బైపాస్ నిర్మాణం 80 శాతం పూర్తయ్యిందని చెప్పుకుని తమ భుజాలను తామే చరిచేసుకున్న కాంట్రాక్టర్లు.. ఇప్పుడు మిగిలిన 20 శాతం పూర్తి చేయడానికి ఆపసోపాలు పడుతున్నారు. వాస్తవానికి 80శాతం పూర్తయ్యిందంటూ గతంలో వారు చెప్పిన మాట పూర్తిగా అవాస్తవమనీ, బిల్లులు వసూలు చేసుకుని పనులను పక్కన పెట్టేశారన్న ఆరోపణలు ఉన్నాయి.  

సరే ఇక ప్రస్తుతానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఇతర ప్రాంతాలలో కనెక్టివిటీ కి ఈ బైపాస్ నిర్మాణం నత్తనడకను గుర్తు చేస్తుండటంతో... అవరోధాలు ఏర్పడుతున్నాయి. అంతే కాకుండా  బెజవాడ ట్రాఫిక్ కష్టాలు తొలగడం లేదు.  ఈ బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తికాకపోవడంతో.. బెజవాడ నగరం నడిబొడ్డు నుంచే భారీ వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. దీంతో బెజవాడ నగరం   నిత్యం ట్రాఫిక్ జామ్ లతో వాహనదారులకు నరకం కనిపిస్తోంది.

కృష్ణాజిల్లా చిన్న అవుట్ పల్లి నుండి, గుంటూరు జిల్లా చిన్నకాకాని వరకు.. దాదాపు  47.8 కిలోమీటర్ల  మేర విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు నిర్మాణం  2021 లో ప్రారంభమైంది.  ఇది పూర్తయితే..  కోల్ కతా,  ఒరిస్సా విశాఖ ల నుండి  వచ్చే భారీ వాహనాలు, హైదరాబాద్ చెన్నై వంటి నగరాలకు బెజవాడలోకి రావలసిన పని ఉండది.  చెన్నై, కోల్ కతాలకు వెళ్లే, వచ్చే భారీ వాహనాలు  ఇటు గన్నవరం సమీపంలోని చిన్న ఔట్ పల్లి, అటు మంగళగిరి నియోజకవర్గంలోని చిన్న కాకాని నుండి విజయవాడ వెస్ట్ బైపాస్ చేరుకుంటాయి. దీంతో  బెజవాడకు ట్రాఫిక్ భారం తొలగిపోతుంది.

ఇక హైదరాబాద్ వెళ్లే వాహనాలు గొల్లపూడి జంక్షన్ వద్ద   డైవర్ట్ అవుతాయి.  వెస్ట్ బైపాస్ జాతీయ రహదారిపై అమరావతి గుండా ప్రయాణం చేసి , మూడు కిలోమీటర్ల పైగా నిర్మించిన కృష్ణ వారధిని దాటుకుంటూ వాహనాలు  చెన్నై హైదరాబాద్ కోల్ కతా వంటి నగరాలకు చేరుకునేందుకు జాతీయ రహదారిపైకి నేరుగా చేరుకుంటాయి.  అంతే కాదు ఈ బైపాస్ రోడ్డు అందుబాటులోకి వస్తే.. గుంటూరు, హైదరాబాద్ మధ్య ప్రయాణంలో దాదాపు గంట సమయం ఆదా అవుతుంది.  ఈ బైపాస్ పూర్తై.. బెజవాడ ట్రాఫిక్ కష్టాలు తీరే రోజెప్పుడొస్తుందా? అని జనం ఎదురు చూస్తున్నారు.  

By
en-us Political News

  
నాగ్‌పూర్‌లో రెండేళ్ల లైంగిక వేధింపులను తట్టుకోలేక 45 ఏళ్ల తండ్రిని క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపిన 17 ఏళ్ల మైనర్ బాలిక. అర్ధరాత్రి పోలీసులకు ఫోన్ చేసి లొంగిపోయిన చిన్నారి. ఈ దిగ్భ్రాంతికర సంఘటన పూర్తి వివరాలు చదవండి.
పంజాబ్‌లో ఆప్ నేత అమరిందర్ సింగ్ మండోఫల్‌ను పీసీఎస్ ఆఫీసర్‌నంటూ నమ్మించి పెళ్లాడి, నగలతో పరారైన కిలాడీ మహిళ మన్విందర్ కౌర్ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు చదవండి.
ఒడిశాలోని బ్రహ్మపూర్‌లో మద్యం మత్తులో తీవ్ర దారుణం జరిగింది. డబ్బుల వివాదంతో స్నేహితుడి గొంతు కోసి హత్య చేసిన వ్యక్తి అర్ధరాత్రి పోలీసుల తనిఖీల్లో రక్తపు మరకలతో చిక్కాడు. ఈ ఘోర క్రైమ్ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి!
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో భర్త మరొక మహిళతో ఉండగా చూసిన భార్య కారును అడ్డుకోగా, ఆమెను 100 మీటర్లు బానెట్‌పై ఈడ్చుకెళ్లిన షాకింగ్ ఘటన వైరల్‌గా మారింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
కరేబియన్ సముద్రంలో డ్రగ్స్ అక్రమ రవాణా బోటుపై అమెరికా సైన్యం జరిపిన దాడిలో నలుగురు మరణించారు. సెప్టెంబర్ 2025 నుండి ఇప్పటివరకు జరిగిన 70 దాడుల్లో 235 మంది మృతి చెందిన పూర్వాపరాలు మరియు పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
హైదరాబాద్‌లోని మియాపూర్ హఫీజ్‌పేట్‌లో ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ చేతిలో 27 ఏళ్ల లేడీ డాక్టర్ సృజన హత్యకు గురైన దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మరియు పోలీసుల దర్యాప్తు నివేదిక.
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్ఎం పోస్టులు ఇప్పిస్తామంటూ ఉమ్మడి వరంగల్, హనుమకొండ జిల్లాల్లో రూ.లక్షల్లో వసూలు చేస్తున్న దళారీల దందా వెలుగులోకి వచ్చింది. యూనియన్ ముసుగులో జరుగుతున్న ఈ అక్రమాలపై జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజారెడ్డి విచారణ ప్రకటించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్‌లోని సరూర్ నగర్ సాగరిక ఇంటెగ్రేటెడ్ హైస్కూల్‌లో రాఖీలు, తిలకం తొలగింపు వివాదంపై బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి టీచర్‌ను హిజాబ్‌‌పై ప్రశ్నించడం సంచలనంగా మారింది. పోలీసులు కార్పొరేటర్‌పై సుమోటో కేసు నమోదు చేశారు.
హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో కన్న కూతురిపై లైంగిక దాడికి యత్నించిన భర్త శ్రీనివాస్‌ను భార్య రమాదేవి గొడ్డలితో నరికి చంపింది. అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లా సీఐఎస్ఎఫ్ క్యాంపులో హెడ్ కానిస్టేబుల్ ఏకే 47 రైఫిల్‌తో చేసిన విచక్షణారహిత కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి చెందారు. సేవా పవర్ ప్రాజెక్ట్ వద్ద జరిగిన ఈ దారుణ ఘటనపై సీఐఎస్ఎఫ్ డీజీ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.
ఒడిశా తాల్చేర్ ప్రాంతంలో సంచలనం సృష్టించిన దారుణ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్ మాధాపూర్‌లో స్పా సెంటర్ ముసుగులో నడుస్తున్న అక్రమ వ్యభిచార రాకెట్‌ను ఎస్‌ఓటీ పోలీసులు మట్టుబెట్టారు. నలుగురు యువతులను రక్షించి, రూ. 45 వేల నగదు, 8 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
యాదాద్రి భువనగిరి జిల్లా చల్లూరులో భూభారతి వెబ్‌సైట్ ద్వారా ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండానే 7.18 ఎకరాల భూమి వేరొకరి పేరు మీదకు మారిపోయింది. యజమానులకు తెలియకుండా జరిగిన ఈ భారీ భూ భాగోతం పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.