దేశంలో రిజర్వేషన్ల విధానంపై చర్చ!
Publish Date:Apr 15, 2026
Advertisement
దేశంలో రిజర్వేషన్ విధానం, దాని ప్రభావం, భవిష్యత్ దిశపై మళ్లీ చర్చ మొదలైంది. కొన్ని సామాజిక వర్గాలు, కొందరు విశ్లేషకులు రిజర్వేషన్ వ్యవస్థలోని లోపాలను ప్రస్తావిస్తూ.. రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రూపొందించిన విధానంపై ముందుచూపు లోపించిందంటూ విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ అభిప్రాయాలు, విమర్శలు ఆయా వ్యక్తుల, సామాజిక వర్గాల వ్యక్తిగత దృష్టి కోణంతో చేస్తున్నవి మాత్రమే. సంకలనం, సేకరణ: సీతారాం కంఠమనేని
రిజర్వేషన్ వ్యవస్థ: సామాజిక న్యాయమా లేక వ్యవస్థాగత లోపమా?
స్వాతంత్ర్యం తర్వాత చారిత్రక అన్యాయాలను సరిదిద్దడానికి రిజర్వేషన్లు ప్రవేశపెట్టారు. అయితే, విమర్శకుల అభిప్రాయం ప్రకారం..
కులాన్ని మాత్రమే ప్రాతిపదికగా తీసుకోవడం, ఆర్థికంగా వెనుకబడిన ఓసీవర్గాలకు అవకాశాల లోపం. ప్రతిభావంతులైన విద్యార్థులకు అవకాశాల కోత, రిజర్వేషన్లు తాత్కాలికం కావాలనే రాజ్యాంగ ఉద్దేశ్యం అమలు కాకపోవడం వంటి సమస్యలు నేడు స్పష్టంగా కనిపిస్తున్నాయని విమర్శకులు అంటున్నారు.
ఆర్థిక అసమానతలు:
కులం కాదు, ఆర్థిక స్థితి ముఖ్యం వాదన కూడా చేస్తున్నారు.
కొన్ని వర్గాల అభిప్రాయం ప్రకారం..
-ఉన్నత వర్గాల్లో పేదరికం పెరుగుతోంది
- ఆర్థికంగా వెనుకబడినవారికి రిజర్వేషన్ లభించకపోవడం
- కుల ప్రాతిపదిక వ్యవస్థ నేటి ఆర్థిక వాస్తవాలకు సరిపోకపోవడం
వంటి అంశాలు రిజర్వేషన్ వ్యవస్థను పునర్విమర్శించాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయని వారు అంటున్నారు.
ఆర్థిక స్థితిగతులు - సామాజిక అసమానతలు..
రిజర్వేషన్ల అమలులో కేవలం కులాన్ని ప్రాతిపదికగా తీసుకోవడం వల్ల వ్యవస్థలో తీవ్రమైన లోపాలు తలెత్తాయి. సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో ఉన్నామని భావించే ఉన్నత వర్గాల్లోని పేదల పరిస్థితి నేడు అత్యంత దయనీయంగా మారింది. ముఖ్యంగా బ్రాహ్మణుల వంటి వర్గాలు సామాజికంగా గౌరవం పొందినా, ఆర్థికంగా ఎదుగుదల లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. కేవలం కులమే ప్రాతిపదికగా ఉండటం వల్ల ఆర్థికంగా నిజమైన వెనుకబాటుతనం ఉన్నవారికి అన్యాయం జరుగుతోంది. ఒకరి అభివృద్ధి మరొకరి పతనానికి కారణం కాకూడదంటూ.. "మీ జయంతి... మా వర్ధంతి" అనే నినాదం నేడు ఒక వర్గం యువతలో తలెత్తుతుంది.
మెరిట్ vs రిజర్వేషన్.. యువతలో పెరుగుతున్న అసంతృప్తి
విద్యా, ఉద్యోగ రంగాల్లో..
- అధిక మార్కులు సాధించిన విద్యార్థులు అవకాశాలు కోల్పోవడం
- తక్కువ మార్కులతో రిజర్వేషన్ ద్వారా సీట్లు, ఉద్యోగాలు లభించడం
- ప్రతిభకు తగిన గుర్తింపు లేకపోవడం
వంటి అంశాలు యువతలో అసంతృప్తిని పెంచుతున్నాయని విమర్శకులు చెబుతున్నారు.
ప్రస్తుత పోటీ ప్రపంచంలో 'మెరిట్' (ప్రతిభ) అనేది మూలన పడటం విచారకరం. విద్యా, ఉద్యోగ రంగాల్లో అత్యధిక మార్కులు సాధించిన ప్రతిభావంతులు అవకాశాలు కోల్పోతుంటే, తక్కువ మార్కులు వచ్చిన వారు రిజర్వేషన్ల అండతో సీట్లు, ఉద్యోగాలు, పదోన్నతులు పొందుతున్నారు. ఈ వ్యవస్థాగత అసమతుల్యం వల్ల విద్యావంతులైన యువతలో తీవ్ర అసంతృప్తి, నిరాశ పెరుగుతున్నాయి. ఇది సమాజంలో ఐక్యతను దెబ్బతీసి, కొత్త రకమైన విభజనలకు, ద్వేష భావాలకు దారితీస్తోంది.
రాజకీయ వర్గాలపై ఆరోపణలు.. వోట్ బ్యాంక్ రాజకీయాలు
కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం..
- రిజర్వేషన్లు తాత్కాలికం కావాలనే రాజ్యాంగ ఉద్దేశ్యం అమలు కాలేదు.
- రాజకీయ పార్టీలు రిజర్వేషన్లను ఓటు బ్యాంక్ గా ఉపయోగిస్తున్నాయి.
- సమస్యకు శాశ్వత పరిష్కారం ఇవ్వడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. అంటున్నారు.
రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు ఒక నిర్ణీత కాలం వరకు మాత్రమే ఉండాలని అంబేద్కర్ భావించినప్పటికీ, నేటి రాజకీయ నాయకులు దీనిని ఒక ఓటు బ్యాంకు వ్యూహంగా మార్చేశారు. అధికారమే పరమావధిగా రిజర్వేషన్లను నిరంతరం పొడిగిస్తూ పోవడం వల్ల వ్యవస్థలో లోపాలు పెరిగాయి తప్ప, సమస్యకు శాశ్వత పరిష్కారం లభించలేదు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు(ఈడబ్ల్యుఎస్) రిజర్వేషన్లు ఒక చిన్న ప్రయత్నం అయినప్పటికీ, అవి ఈ క్లిష్టమైన సమస్యను పూర్తిగా పరిష్కరించలేకపోతున్నాయి. దీనికి ఖాంగ్రెస్ పార్టీ ముఖ్య కారణం. అయితే అధికారంలోకి వచ్చి దశాబ్ద కాలం దాటినా దీనిపై ఒక నిర్దిష్టమైన నిర్ణయం తీసుకోకపోవడం బీజేపీ తప్పిదం.
ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్.. పరిష్కారమా లేక పాక్షిక ప్రయత్నమా?
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఇచ్చిన ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్ ను కొంతమంది సరైన దిశలో పడిన అడుగు గా చూస్తున్నప్పటికీ, ఇది మొత్తం వ్యవస్థలోని అసమానతలను పరిష్కరించలేదని విమర్శకులు అంటున్నారు.
“అంబేద్కర్ ముందుచూపుపై ప్రశ్నలు.. విమర్శకుల అభిప్రాయం మాత్రమే
కొన్ని వర్గాల ప్రకారం
- రాజ్యాంగ రూపకల్పన సమయంలో భవిష్యత్ ఆర్థిక మార్పులను అంచనా వేయలేకపోయారు
- కులం, ఆర్థిక స్థితి మధ్య సమతుల్యం సాధించలేకపోయారు
- నేటి పరిస్థితుల్లో రిజర్వేషన్ వ్యవస్థ పునర్విమర్శ అవసరం
ఈ అభిప్రాయాలు పూర్తిగా విమర్శకులవి మాత్రమే. వివిధ సామాజిక వర్గాలు, నిపుణులు, చరిత్రకారులు ఈ విషయంపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/debate-on-the-reservation-system-in--country-36-217442.html
The role or involvement of al Qaeda in the attack
Nearly two years after President Barack Obama ordered 33,000
సైనా నెహ్వాల్ మేనేజింగ్ కంపెనీ రీతీ స్పోర్ట్స్‌తో రూ. 40 కోట్ల విలువ చేసే డీల్‌ను కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో సైనా నెహ్వాల్ సంవత్సరానికి 14 కోట్ల రూపాయలు పొందుతుంది. ఇంతకు ముందు సైనా నెహ్వాల్ ఏడాదికి 1.5 కోట్ల రూపాయలు పొందేది. ఈ డీల్ కుదరటంతో తను ఎంతో థ్రిల్ అయ్యానని, ఇంత త్వరగా పెద్ద అవకాశం లభిస్తుందని అనుకోలేదని సైనా చెప్పింది.





