ఆర్ఆర్ పై డీసీ విజయం.. ఢిల్లీ కేపిటల్స్ ప్లేఆఫ్ ఆశలు సజీవం

Publish Date:May 17, 2026

Advertisement

ఢిల్లీ క్యాపిటల్స్ కీలక సమయంలో అద్భుతంగా పుంజుకుంది. ఆదివారం (మే 17) రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో విజయం సాధించి ఐపీఎల్ లో పతన ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంటుకుంది.   అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్ లో  రాజస్థాన్ రాయల్స్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కేఎల్ రాహుల్ 56 పరుగులు, , అభిషేక్ పోరెల్ 51 పరుగులతో జట్టు విజయానికి అవసరమైన ఆరంభాన్ని ఇచ్చారు. ఇక చివరిలో  అశుతోష్ శర్మ 18 నాటౌట్ మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టును  విజయతీరాలకు చేర్చాడు. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్‌ను మిచెల్  కట్టడి చేశాడు.

194 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి ఓపెనర్లు కేఎల్ రాహుల్, అభిషేక్ పోరెల్ అద్భుత ఆరంభాన్నిచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. పోరెల్ 31 బంతుల్లో 51 పరుగులు చేసి దూకుడుగా ఆడగా, రాహుల్ 42 బంతుల్లో 56 పరుగులతో  రాణించాడు.  వీరిద్దరూ ఔటయ్యాక ఢిల్లీ కాస్త తడబడింది. సాహిల్ పరాఖ్, రాహుల్, ట్రిస్టన్ స్టబ్స్ స్వల్ప వ్యవధిలో వెనుదిరగడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. ఈ దశలో ఇంపాక్ట్ ప్లేయర్‌  అశుతోష్ శర్మ కేవలం 5 బంతుల్లోనే 18 పరుగులు చేసి మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. చివరి ఓవర్‌లో 7 పరుగులు అవసరం కాగా, అశుతోష్ ఫోర్, సిక్స్‌తో మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే జట్టుకు విజయాన్ని అందించాడు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోరు చేసేలా కనిపించింది. యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ  21 బంతుల్లో 46 మెరుపు ఆరంభం ఇవ్వగా, ఆ తర్వాత రియాన్ పరాగ్ (51), ధ్రువ్ జురెల్ (53) అర్ధశతకాలతో రాణించారు. ఒక దశలో 160/2 స్కోరుతో రాజస్థాన్ 220 పరుగుల మార్క్ దాటేలా కనిపించింది. అయితే, డెత్ ఓవర్లలో ఢిల్లీ బౌలర్ మిచెల్ స్టార్క్ అద్భుతంగా పుంజుకున్నాడు. తన చివరి రెండు ఓవర్లలో కేవలం 12 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. దీంతో రాజస్థాన్ చివరి ఆరు ఓవర్లలో 33 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి 193/8 స్కోరుకు పరిమితమైంది.  

By
en-us Political News

  
హైదరాబాద్‌లోని మియాపూర్ హఫీజ్‌పేట్‌లో ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ చేతిలో 27 ఏళ్ల లేడీ డాక్టర్ సృజన హత్యకు గురైన దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మరియు పోలీసుల దర్యాప్తు నివేదిక.
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్ఎం పోస్టులు ఇప్పిస్తామంటూ ఉమ్మడి వరంగల్, హనుమకొండ జిల్లాల్లో రూ.లక్షల్లో వసూలు చేస్తున్న దళారీల దందా వెలుగులోకి వచ్చింది. యూనియన్ ముసుగులో జరుగుతున్న ఈ అక్రమాలపై జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజారెడ్డి విచారణ ప్రకటించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్‌లోని సరూర్ నగర్ సాగరిక ఇంటెగ్రేటెడ్ హైస్కూల్‌లో రాఖీలు, తిలకం తొలగింపు వివాదంపై బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి టీచర్‌ను హిజాబ్‌‌పై ప్రశ్నించడం సంచలనంగా మారింది. పోలీసులు కార్పొరేటర్‌పై సుమోటో కేసు నమోదు చేశారు.
హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో కన్న కూతురిపై లైంగిక దాడికి యత్నించిన భర్త శ్రీనివాస్‌ను భార్య రమాదేవి గొడ్డలితో నరికి చంపింది. అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లా సీఐఎస్ఎఫ్ క్యాంపులో హెడ్ కానిస్టేబుల్ ఏకే 47 రైఫిల్‌తో చేసిన విచక్షణారహిత కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి చెందారు. సేవా పవర్ ప్రాజెక్ట్ వద్ద జరిగిన ఈ దారుణ ఘటనపై సీఐఎస్ఎఫ్ డీజీ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.
ఒడిశా తాల్చేర్ ప్రాంతంలో సంచలనం సృష్టించిన దారుణ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్ మాధాపూర్‌లో స్పా సెంటర్ ముసుగులో నడుస్తున్న అక్రమ వ్యభిచార రాకెట్‌ను ఎస్‌ఓటీ పోలీసులు మట్టుబెట్టారు. నలుగురు యువతులను రక్షించి, రూ. 45 వేల నగదు, 8 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
యాదాద్రి భువనగిరి జిల్లా చల్లూరులో భూభారతి వెబ్‌సైట్ ద్వారా ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండానే 7.18 ఎకరాల భూమి వేరొకరి పేరు మీదకు మారిపోయింది. యజమానులకు తెలియకుండా జరిగిన ఈ భారీ భూ భాగోతం పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఏపీ సచివాలయ ఉద్యోగాలు, డీఎస్సీ నియామకాలు మరియు మెడికల్ సీట్లలో నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్ల అక్రమాలపై విచారణ ముమ్మరమైంది. హైకోర్టు ఆదేశాలు, విజిలెన్స్ తనిఖీలు మరియు సాప్ చేపట్టిన స్కిల్ టెస్ట్ వివరాలు ఇక్కడ చూడండి.
150 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న వందేమాతరం గేయానికి జాతీయ గీతంతో సమాన హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ తెచ్చింది. 3 నిమిషాల 10 సెకన్ల ఆలాపన, సుప్రీంకోర్టు విచారణ మరియు చట్టపరమైన నిబంధనల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
హైదరాబాద్ రాయదుర్గంలో ఐటీ కంపెనీ మహిళా ఉద్యోగిపై ఫుడ్ వెండర్ షేక్ నబీ కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి లైంగిక దాడి చేశాడు. ప్రైవేట్ వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేస్తూ రూ. 43 లక్షలు నొక్కేసి మూడేళ్లు వేధించిన నిందితుడిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు.
విజయవాడ ఎన్‌టీపీఎస్ కాలువలో లభించిన మహిళ శరీర భాగాల మిస్టరీ వీడింది. చేతిపై ఉన్న ఈక టాటూ ఆధారంగా మృతురాలిని మంగళగిరికి చెందిన 29 ఏళ్ల కళ్యాణిగా గుర్తించిన పోలీసులు, విచారణలో మటన్ షాప్ షఫీ చేసిన కిరాతక హత్యను ఛేదించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.