దావూద్ కి ఇక కౌంట్ డౌన్ మొదలైనట్టేనా?
Publish Date:Sep 2, 2016
Advertisement
ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో మోస్ట్ వాంటెడ్ అయిన దావూద్ ఇబ్రహీం పాక్ లో వున్నాడని అందరికీ తెలిసిందే. పాకిస్తాన్ ఎన్ని కహానీలు చెప్పినా డి కంపెనీ బాస్ ఆ దేశంలోనే తిష్ట వేశాడని మన రా అధికారుల వద్ద పక్కా సమాచారం వుంది. అంతే కాదు, కరాచీలోని ఏ వీధిలో ఏ ఇంట్లో ఏ పేరుతో వున్నాడో కూడా ప్రదాని మోదీ సలహాదారు అజిత్ ధోవల్ కు క్లియర్ గా తెలుసు... మోదీ ప్రధాని అయినప్పటి నుంచీ దావూడ్ పై మన నిఘా వర్గాల కన్ను తీవ్రంగా పడింది. అసలు ఈ పాటికే దావూద్ ఎన్ కౌంటర్ ఎప్పుడో జరిగిపోవాల్సింది. కాని, పాకిస్తాన్ లాంటి శత్రుదేశంలో తల దాచుకోటంతో కొంత ఆలస్యం అవుతోంది. అంతే కాదు, దావూద్ ని ప్రాణాలతో పట్టుకుంటే ఇండియాకి చాలా లాభం. అందు కోసం కూడా తగిన సమయం కోసం వేచి చూస్తున్నాయి ఇండియా నిఘా వర్గాలు. తాజాగా ఇండియన్ గవర్నమెంట్ దావూద్ ప్లాన్స్ ని ఇండియా టుడే బయటపెట్టింది. ఆ పత్రిక ఇచ్చిన సమాచారం కరెక్టే అయితే మాత్రం మాఫియా డాన్ కదలికలపై నిఘా వుంచేందుకు దాదాపు 50మంది అధికారులతో స్పెషల్ టీమ్ ను ఏర్పాటు చేసిందట ప్రభుత్వం. ఇన్ కమ్ ట్యాక్స్, ఈడీ, రా విభాగాల నుంచి ఈ అఫీషియల్స్ ను ఎంపిక చేశారట. వీళ్లంతా ఎప్పటికప్పుడు దావూద్ కదలికల్ని, అతడి అనుచరుల కదలికల్ని, అతని కుటుంబ సభ్యుల వ్యవహారాల్ని గమనిస్తుంటారట! దావూద్ కరాచీలో వున్నట్టు, అతడి ఆరోగ్యం తీవ్రంగా పాడైనట్టు, షేక్ ఇస్మాయిల్ మర్చెంట్ అనే దొంగ పేరుతో అతడు కాలం గడుపుతున్నట్టు మన ఇంటలిజెన్స్ వర్గాలు ఇప్పటికే బయటపెట్టాయి. అనేక వందల మంది చావులకి కారణమైన ముంబై దారుణానికి మూలం దావూద్. అలాంటి మాఫియా రాక్షసుడు త్వరలోనే పట్టుబడాలని ఆశిద్దాం. లేదంటే అమెరికా లాడెన్ హతమార్చినట్టు మన వాళ్లు దావూద్ ని పాక్ భూభాగంలోనే ఖతమ్ చేయాలని కోరుకుందాం...
మోదీ ప్రధాని అయ్యాక మొత్తం ప్రపంచంలో తల పట్టుకుని కూర్చున్న ఏకైక దేశం ఏదైనా వుందంటే అది పాకిస్తానే అనాలి! అందుక్కారణాలు బోలెడు... మొన్నటికి మొన్న స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో బలూచిస్తాన్ గురించి మోదీ మాట్లాడినప్పటి నుంచీ అక్కడ నానా రచ్చ జరుగుతోందని రిపోర్ట్స్ వస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వున్న ప్రవాస బలూచిస్తాన్ ప్రజలు మోదీ ఫోటోలతో వీధులకు ఎక్కుతున్నారు. ఇండియా జెండాలతో నిరసనలు తెలుపుతూ పాక్ గుండెల్లో దడ పుట్టిస్తున్నారు. ఇదంతా ఒకవైపు అయితే మరో కోణంలో కూడా మోదీ సర్కార్ పాక్ ని టెన్షన్ పెడుతోంది! అదే కరాచీలో దాక్కున్న దావూద్ కోణం!
http://www.teluguone.com/news/content/dawood-ibrahim-45-65988.html





