బంగాళాఖాతంలో వాయుగుండం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!

Publish Date:Jul 27, 2026

Advertisement

 

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు విస్తృతంగా కురు స్తున్నాయి. ప్రస్తుతం సముద్రంపై కొనసాగుతున్న ఈ వాయుగుండం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఈ వ్యవస్థ సోమవారం పారాదీప్– సాగర్ ద్వీపాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పట్నం జిల్లాల్లో అక్కడ క్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉండటంతో మత్స్యకారులు మంగళ వారం వరకు సముద్రంలో వేటకు వెళ్లరాదని స్పష్ట మైన సూచనలు జారీ చేశారు. 

ఇప్పటికే సముద్రంలో ఉన్న వారు వెంటనే తీరానికి చేరుకోవాలని సూచించారు. తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బలమైన గాలుల కారణంగా చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలే ప్రమాదం ఉన్నందున అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు. జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండి సహా యక చర్యలకు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇక తెలంగాణలోనూ వర్షాల ప్రభావం కొనసాగుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లా లకు భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 

పెద్దపల్లి, కరీంనగర్, సిద్దిపేట, మెదక్, యాదాద్రి భువనగిరి, మేడ్చల్-మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఇదిలా ఉండగా ఈరోజు  ఉదయం నుంచే హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. ఎల్‌బీ నగర్, ఉప్పల్, హయత్‌ నగర్, కూకట్‌పల్లి, మెహదీ పట్నం, దిల్‌సుఖ్‌నగర్, అమీర్‌పేట్, బంజారా హిల్స్, జూబ్లీహిల్స్ తది తర ప్రాంతాల్లో వర్షం నమోదైంది. 

మరో రెండు గంటల పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకా శం ఉందని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడం తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొ న్నారు. కార్యాలయాలు, విద్యాసంస్థలకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని జీహెచ్‌ఎంసీ, విపత్తు నిర్వహణ శాఖ అధికా రులు సూచించారు. ప్రజలు వాతావరణ శాఖ హెచ్చరికలను ఎప్పటి కప్పుడు గమనిస్తూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Cyclone in the Bay of Bengal, Heavy rains in Telugu states, IMD, Srikakulam, Vizianagaram, Visakhapatnam, Peddapalli, Karimnagar, Siddipet, Medak

By
en-us Political News

  
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు గ్రామంలో ప్రతిపాదిత శ్రీరామ మందిర నిర్మాణానికి ఎదురైన చట్టపరమైన ఆటంకాలు తొలగిపోయాయి.
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారం పార్లమెంట్‌ను తీవ్రంగా కుదిపేసింది.
నిరసన తెలపడం రాజ్యాంగ హక్కు... విద్యార్థులపై లాఠీచార్జ్‌ను తప్పుబట్టిన సుప్రీం..!
తల్లి... ఈ ఒక్క పదంలోనే ప్రేమ, త్యాగం, ఆప్యాయత దాగి ఉంటాయి. కానీ అదే తల్లి తీసుకున్న ఒక నిర్ణయం
స్టేట్‌మెంట్ రికార్డ్ చేసేందుకు పోలీసుల గాలింపు..!
బీజేపీ ఎంపీ ఇంట్లో చెలరేగిన పొలిటికల్ రచ్చ..!
అదనపు కట్నం కోసం వేధించి, చంపేందుకు చూశారు.. సంచలన ఫిర్యాదు..!
హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకునేందుకు నిఘా నిర్వహిస్తున్న పోలీసులపై ఓ యువకుడు కారుతోనే దాడికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం
మానవ మెదడు తరంగాలు Brain Waves ఫిజికల్ ఏఐ రంగంలో సరికొత్త విప్లవాన్ని తీసుకొస్తున్నాయి. ఆలోచనల ద్వారా రోబోలను నియంత్రించే అధునాతన సాంకేతికత మరియు దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వెబ్ స్టోరీలో తెలుసుకోండి.
బ్లూటూత్ సెక్యూరిటీ లోపాల వల్ల ఏకంగా 22 లక్షల కార్లు హ్యాక్ అయ్యే ప్రమాదంలో ఉన్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. KARR యాంటీ థెఫ్ట్ సిస్టమ్ ద్వారా కారు డోర్లు అన్‌లాక్ చేసే ముప్పుపై పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఆనంద్ రాఠీ వెల్త్ Q1 FY27 ఆర్థిక ఫలితాలలో 24% లాభాల వృద్ధితో రూ. 116 కోట్ల నికర లాభాన్ని మరియు రూ. 1.06 లక్షల కోట్ల AUM మైలురాయిని సాధించింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఎంఆర్‌ఎఫ్ MRF కంపెనీలో ప్రమోటర్ కుటుంబం ఎంత వాటా కలిగి ఉందో తెలుసుకోండి. మామ్మన్ ఫ్యామిలీ, రిటైల్ ఇన్వెస్టర్లు మరియు FIIల షేర్‌హోల్డింగ్ వివరాలతో కూడిన సమగ్ర కథనం!
రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షపాతం లోటు కొనసాగుతున్న నేపథ్యంలో ఎల్‌నినో పరిస్థితులను నిరంతరం నిశితంగా పర్యవేక్షిస్తూ రైతుల పంటలను రక్షించేందుకు సమగ్ర కార్యాచరణ
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.