అర్నాబ్ తుపాను ముప్పు.. ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: హోంమంత్రి అనిత

Publish Date:Oct 25, 2026

Advertisement

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడి 'అర్నాబ్' తుపానుగా మారుతుండటంతో ఆంధ్రప్రదేశ్ సర్కార్ అప్రమత్తమైంది. రాష్ట్రంపై ముంచెత్తుతున్న ఈ పెను ముప్పును ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం రాబోయే ఐదు రోజుల పాటు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.  వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం ఈ తుపాను ప్రభావం కోస్తాంధ్ర జిల్లాలపై తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా రానున్న రెండు మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

ప్రజలు ఎవరూ అప్రమత్తత కోల్పోవద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. ఈ తుపాను బుధవారం నాటికి బాపట్ల మరియు విశాఖపట్నం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ సమయంలో తీర ప్రాంతాల వెంబడి గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వరకు వేగంతో ప్రమాదకర స్థాయిలో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మంగళ, బుధవారాల్లో వర్షాల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు యంత్రాంగం ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది. 

అలాగే ప్రమాదకరంగా మారిన హోర్డింగ్‌లను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాకకర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎఫ్ (NDRF), ఎస్డీఆర్ఎఫ్ (SDRF) బలగాలను ఇప్పటికే క్షేత్రస్థాయిలో సిద్ధంగా ఉంచినట్లు మంత్రి తెలిపారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా అధికారులు అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు వేగవంతం చేయాలని ఆమె సూచించారు.  మత్స్యకారులు ఎవరూ కూడా సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని కఠిన నిబంధనలు విధించారు. అదేవిధంగా పర్యాటకులు ఎవరూ కూడా బీచ్‌ల వైపు వెళ్లకుండా గట్టి నిఘా ఏర్పాటు చేశారు. 

సముద్రపు అలల వద్ద సెల్ఫీలు దిగడం వంటి సాహసాలకు పాల్పడవద్దని ప్రజలను గట్టిగా హెచ్చరించారు.   సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వదంతులను నమ్మవద్దని, కేవలం ప్రభుత్వ విపత్తుల నిర్వహణ సంస్థ అందించే అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అత్యవసర సహాయం కోసం అధికారిక టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించాలని సూచించారు. రైతులు కూడా తమ పంటలను కాపాడుకోవడానికి తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.   

 

 

 

[ Cyclone Arnab, AP Weather News, Minister Vangalapudi Anita, Andhra Pradesh Cyclonic Storm, Coastal Andhra Rains, Cyclone Arnab landfall, AP Home Minister, Telug One, Telugu News, NDRF,SDRF ]

By
en-us Political News

  
ఈ అల్పపీడనం  పశ్చిమ, వాయువ్య దిశగా పయనిస్తూ అండమాన్, అండమాన్ నికోబా దీవుల సమీపంలో  తుపానుగా బలపడే సూచనలు ఉన్నాయి. ఆ తరువాత  ఇది మరింత బలపడి ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో  వచ్చే నెల  1, 2 తేదీలలో కోస్తాంధ్రతో పాటు పలు ప్రాంతాలలో  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
అధికారులు, యంత్రాంగం, ప్రభుత్వం సమష్టి కృషితో ప్రాణ, ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించగలిగామన్న సీఎం.. అవిశ్రాంతంగా శ్రమించిన అధికారులు, యంత్రాంగాన్ని అభినందిస్తూనే..   విపత్తు ప్రభావం నుంచి ప్రజలు పూర్తిగా కోలుకునే వరకు  నిరంతరం అప్రమత్తంగా ఉండాలని దిశా నిర్దేశం చేశారు.
మేము మోచేతులు పైకి మడత పెట్టాం.. పులివెందుల సభలో జగన్‌పై విమర్శలు..!
తుపానును సమర్ధంగా ఎదుర్కొనేందుకు సర్వశక్తులూ ఒడ్డామని చెప్పిన ఆయన అర్నాబ్ కారణంగా రాష్ట్రంలో ఐదుగురు మరణించారని తెలిపారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వారిని కాపాడలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
 సహాయ చర్యలలో   39 ఎన్‌డీఆర్‌ఎఫ్  బృందాలతో పాటు 80 రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన  బృందాలు నిమగ్నమై ఉన్నాయి. ఇవి కాకుండా . ఇండియన్ ఎయిర్‌ఫోర్స్  ప్రత్యేకంగా రెండు విమాన సర్వీసులను నడిపి అదనపు బలగాలను క్షేత్రస్థాయిలో  మోహరించింది.
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల రాజకీయ వాతావరణం వేడెక్కుతున్న తరుణంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) కీలక నిర్ణయం తీసుకుంది.
అర్నాబ్ తుపాను కారణంగా భారీ వర్షాలు, ప్రచండ గాలుల కారణంగా అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ ను మరో ఏడురోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. అర్నాబ్ తుపాను తీరం దాటింది.. ఇక వానలు తగ్గుతాయి అనుకుంటున్న దశలో వాతావరణ శాఖ మరో వారం పాటు ఏపీకి భారీ వర్షాల బెదల కొనసాగుతుందని హెచ్చరించింది. 
అర్నాబ్   కాకినాడ జిల్లాలోని   ఉప్పాడలో బీభత్సం సృష్టించింది. సముద్ర రాకాసి అలలు బీచ్ రోడ్డును ధ్వంసం చేశాయి. పెద్ద పెద్ద బండరాళ్లు సైతం కొట్టుకు పోయాయంటే అలల ఉధృతి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.
మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారింది ఆంధ్రప్రదేశ్ రైతుల పరిస్థితి.
ఆర్నాబ్ ప్రభావంతో రాష్ట్రంలో రవాణా వ్యవస్థ పరిస్థితి దయనీయంగా మారింది.  ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో రైళ్లు రద్దయ్యాయి.  ఇక ఇప్పుడు అర్పాబ్ ప్రభావం కారణంగా రైల్వే ట్రాక్ లు దెబ్బతిన్న సంఘటనలు ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి.  అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అరకులో తుపాను ధాటికి రైల్వే   ట్రాక్ ధ్వంసమైంది.
అర్నాబ్ తుపాను ప్రభావం కారణంగా రాష్ట్రంలో జరిగి ఆస్తి నష్టం అంచనాకు సత్వరమే కేంద్ర బృందాన్ని పంపాలని ఆ లేఖలో చంద్రబాబు హోంమంత్రిని కోరారు.  అలాగే అర్నాబ్ కారణంగా జరిగిన నష్టాన్ని పూడ్చే విషయంలో కేంద్రం నుంచి ఆర్థిక సహాయాన్ని చంద్రబాబు కోరారు.
రీ వర్షం కారణంగా బందరు వీధులు చెరువులను తలపించాయి.  లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి.  ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు చేపట్టింది.   రహదారులపై పడిన చెట్లను, కొమ్మలను యంత్రాల సాయంతో తొలగించి దారులను పునరుద్ధరించే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.