కారు జోరుకు సైకిల్ బ్రేకులేసేనా?

Publish Date:Sep 1, 2023

Advertisement

ముచ్చటగా మూడోసారి అధికారం అందుకోవడం కోసం.. కారు పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్.. వ్యూహాత్మకంగా పావులు కదుపుతోన్నారు. ఆ క్రమంలో గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ అభ్యర్థుల జాబితాను ఇప్పటికే ప్రకటించేశారు. దీంతో ఈ జాబితాలో పేర్లు గల్లంతైన సిట్టింగ్ ఎమ్మెల్యేలే కాదు.. ఎమ్మెల్యే సీటు ఆశించి భంగపడ్డ అభ్యర్థుల్లో సైతం అసమ్మతి జ్వాల పెల్లుబికుతోందిని.. వారిని సైతం చల్లబరిచేందుకు కేసీఆర్ ఫ్యామిలీ ఇప్పటికే రంగంలోకి దిగి.. తమ వంతు ప్రయత్నాలు చేపట్టిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరోవైపు గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ ఫ్యామిలీలో  పసుపు పార్టీ భయం అంతర్గతంగా పొంచి ఉందని రాజకీయ విశ్లేషకులు సైతం విశ్లేషిస్తున్నారు. 

ఎందుకంటే.. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేస్తామని  టీడీపీ జాతీయ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రకటించడమే కాదు.. రాష్ట్రంలోని మొత్తం 119 స్థానాల్లో అభ్యర్థులను దింపుతామని ఆయన పేర్కొన్నారు. దీంతో తెలంగాణలో ఎన్నీ సెంటర్... సింగిల్ హ్యాండ్‌ అన్నట్లుగా పోటీకి దిగుబోతున్నట్లుగా పసుపు పార్టీ శ్రేణులకు చంద్రబాబు ప్రకటన ఓ క్లారిటీ ఇచ్చినట్లు అయిందని.. అలాంటి వేళ  రానున్న ఎన్నికల్లో సైకిల్ పార్టీ వల్ల.. కారు పార్టీ విజయావకాశాలకు బ్రేకులు పడే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

అయితే రానున్న ఎన్నికల్లో తెలంగాణలో అధికార పీఠాన్ని కైవనం చేసుకోవాలని.. బీజేపీ అగ్రనేతలు ప్రణాళిక బద్దంగా దూసుకెళ్తున్నారు. మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ సైతం దూకుడుగా ముందుకు వెళ్తోంది. అదీకాక కర్ణాటక అసెంబ్లీ ఫలితాలు హస్తం పార్టీకి అనుకూలంగా రావడంతో.. తెలంగాణలోని ఆ పార్టీ శ్రేణుల్లో నయా జోష్ నింపినట్లు అయింది. దీంతో ఎలాగైనా గెలువాలనే ఓ పట్టుదలతో.. ఆ దిశగా హస్తం పార్టీ శ్రేణులు ముందుకు  కదులుతోన్నాయి. 

ఇంకోవైపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ దశాబ్దాల పాలన సాగించినా.. అభివృద్ధి, సంక్షేమం మాత్రం అరకొరగానే జరిగిందని... కానీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణ ప్రాంతంలో మరీ ముఖ్యంగా హైదరాబాద్ విశ్వనగరంగా పునాదులు వేసుకొందని.. అప్పటి వరకు హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలు మాత్రమే ఉంటే.. వాటికి అదనంగా సైబరాబాద్ మహానగరం పురుడు పోసుకుందని.. ఈ విషయాన్ని తెలంగాణలోని ప్రస్తుత అధికార గులాబీ  పార్టీలోని అగ్రనేతలు సైతం వివిధ వేదికల మీద ఒప్పుకొన్నారని రాజకీయ విశ్లేషకులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.   
  
అలాగే ఇటీవల తెలంగాణలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు చేపట్టారని.. ఈ సందర్భంగా గతంలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అభివృద్ధి.. అలాగే ఈ దశాబ్ది కాలంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి , అదేవిధంగా ఆయా ప్రభుత్వాలు తీసుకు వచ్చిన సంక్షేమ పథకాలు, ఇక హైదరాబాద్ నగరాభివృద్ధి నాడు ఎలా ఉంది.. నేడు ఎలా ఉంది.. తదితర అంశాలను ప్రజలకు వివరించడంలో.. సైకిల్ పార్టీ శ్రేణులు.. యమ స్పీడ్‌గా దూసుకుపోతున్నాయని రాజకీయ విశ్లేషకులు వివరిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు తెలంగాణలో బీజేపీ కానీ, వామపక్షాలు కానీ అధికారాన్ని చేపట్టింది లేదని.. కానీ కేంద్రంలో బీజేపీ పాలన ఎలా సాగుతోందో మోదీ పరిపాలనతో అందరికీ అర్థమైందని.. అలాంటి వేళ.. రానున్న ఎన్నికల్లో వివిధ పార్టీలకు చెందిన ఓట్లు.. భారీగా చీలి.. అవి తెలుగుదేశం పార్టీకి పడే అవకాశాలు మెండుగా ఉన్నాయని... దీంతో గులాబీ బాస్‌ కూర్చికి ఎసరు పట్టే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

అదీకాక.. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్‌గా రూపాంతరం చెందిందని... దీంతో తెలంగాణ వాదం కాస్తా అవిరైపోయిందని.. సరిగ్గా ఆదే సమయంలో ఖమ్మం వేదికగా గతేడాది చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన శంఖారావ సభ సూపర్ డూపర్ సక్సెస్ అయిందని.. దీంతో ఆ నాటి నుంచి తెలంగాణలో సైకిల్ పార్టీ తన పూర్వ వైభవాన్ని చాటు కొనేందుకు చేపట్టిన ప్రతీ చర్య.. సఫలీకృతమవుతు వస్తుందని రాజకీయ విశ్లేషకులు ఈ సందర్బంగా గుర్తు చేస్తున్నారు.

By
en-us Political News

  
నాలుగేళ్ల పాటు ప్రేమించుకున్నారు.. ఎన్నో కలలు కన్నారు.. కుటుంబాల వ్యతిరేకతను ఎదుర్కొని మరీ ఒక్కటయ్యారు.
ప్రియుడిని బయటకు తీసుకురావాలనుకుంది.. చివరికి తానే కటకటాల వెనక్కి.!
జర్మనీలో చోటుచేసుకున్న ఒక అనూహ్య ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం సందర్శించారు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది.
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (ఉప్పల్) వేదికగా జరుగుతున్న నాల్గో టీ20 పోరులో భారత జట్టు టాస్ నెగ్గి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
తిరుమల శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యి కల్తీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక చర్యలు చేపట్టింది.
దసరా, దీపావళి పండగ సీజన్‌ సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం దేశంలోని లక్షలాది మంది రైల్వే సిబ్బందికి అదిరిపోయే శుభవార్త అందించింది.
మహారాష్ట్రలోని పూణే నగరంలో తీవ్ర కలకలం రేపిన ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
హైదరాబాద్ నగరంలో రోడ్డు భద్రతను విస్మరిస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఒక ఆటో డ్రైవర్ ఉదంతం ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోంది.
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.