టీమ్ ఇండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్ర అశ్విన్ ఉరుములేని పిడుగులా ఐపీఎల్ కు తన రిటైర్మెంట్ ప్రకటించి అందరికీ ఆశ్చర్య పరిచిన విషయం తెలిసిందే. గత ఏడాది అనూహ్యంగా క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ కు వీడ్కోలు పలికిన అశ్విన్.. తన నిర్ణయం వెనుక ఉన్న కారణాలను తొలిసారిగా బహిర్గతం చేశారు. ముఖ్యంగా ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ వరుస ఓటములతో సతమతమవుతున్న తరుణంలో అశ్విన్ చేసిన వ్యాఖ్యలు క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
గత సీజన్ తన కెరీర్‌లోనే అత్యంత నిరాశాజనకమైన సమయమన్న అశ్విన్ ఫిట్‌నెస్ పరంగా తాను ఆడే స్థితిలో ఉన్నప్పటికీ, మానసిక ఒత్తిడి తట్టుకోలేకపోయాననీ, అందుకే తప్పుకున్నానీ చెప్పాడు. ఐపీఎల్ 2025లో జరిగిన పరిణామాలు తనను తీవ్రంగా కలచివేశాయన్నఅశ్విన్.. కేవలం వ్యక్తిగత కారణాలతోనే కాకుండా జట్టు ప్రయోజనాలను కూడా దృష్టిలో ఉంచుకుని తాను తప్పుకోవాలన్న కఠిన నిర్ణయం తీసుకున్నానన్నాడు.
ఫ్రాంచైజీ మేనేజ్‌మెంట్‌కు తన వల్ల ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఆ నిర్ణయం తీసుకు న్నానన్నాడు. తాను జట్టులో ఉంటే రిటెన్షన్ విషయంలో మేనేజ్‌మెంట్ సందిగ్ధంలో పడుతుందని, అదే తాను తప్పుకుంటే సుమారు రూ. 10 కోట్ల భారీ మొత్తాన్ని ఫ్రాంచైజీ ఆదా చేసుకునే అవకాశం ఉంటుందని అశ్విన్ చెప్పాడు. తాను తప్పుకోవడం వల్ల జట్టుకు ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుందని తాను భావించానన్నాడు.
ప్రస్తుత సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓటమి పాలుకావడంపై స్పందించిన అశ్విన్.. జట్టులోని యువ ఆటగాళ్లను వినియోగించుకుంటున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆటగాళ్లకు వారి సహజ సిద్ధమైన ప్రతిభకు తగ్గట్టుగా బాధ్యతలు అప్పగించాలన్నాడు. జెమీ ఓవర్టన్ వంటి బౌలర్లకు అలవాటు లేని యార్కర్లు వేయమని ఒత్తిడి చేయడం ఉపయోగం సంగతి అటుంచి ప్రత్యర్థికి అప్పనంగా పరుగులు ఇచ్చే పరిస్థితి ఎదురౌతుందని అభిప్రాయపడ్డాడు
యువ ఆటగాళ్లకు సరైన శిక్షణ, ప్రాక్టీస్ వాతావరణం కల్పించకుండా కేవలం ఫలితాలను ఆశించడం వల్ల ప్రయోజనం ఉండదని అశ్విన్ కుండబద్దలు కొట్టేశాడు. అశ్విన్ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సీఎస్కే అభిమానులైతే.. అశ్విన్ మాటలు నూటికి నూరుపాళ్లూ వాస్తవమంటున్నారు. ఇప్పటికైనా సీఎస్కే టీమ్ మేనేజ్ మెంట్ తన వ్యూహాలకు పదును పెట్టి జట్టును విజయాల బాట పట్టించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/csks-consecutive-failures-in-ipl2026-36-216838.html
తమిళనాడుకు చెందిన నవనీతమ్మ తిరుపతిలోనే నివసిస్తున్నారు. శనివారం జులై 4)ఆమె కాలినడకన తిరుమల శ్రీవారి కొండను అధిరోహిస్తున్న సమయంలో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయింది. ఆమె అచంచల భక్తి విశ్వాసాలకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి.ఆర్. నాయుడు ఫిదా అయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లోని పారిశ్రామిక హబ్ శ్రీసిటీ లో 338 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈవీ ఛార్జర్ పవర్ మాడ్యుల్స్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నందుకు షోలమ్ గ్రూప్ యాజమాన్యానికి ధ్యాంక్స్ చెప్పిన లోకేష్.. ఈ ప్లాంట్‌కు సంబంధించిన నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి, సాధ్యమైనంత త్వరగా ఉత్పత్తిని ప్రారంభించాలని కోరారు.
రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం చేశారు. 16 వేల350 కోట్లరూపాయల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ ఉక్కు కర్మాగారంతో పాటు దానికి అనుబంధంగా రాబోయే గ్రీన్ ఎనర్జీ సోలార్ పవర్ ప్రాజెక్టు పనులను కూడా ఆయన ప్రారంభించారు.
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ నాట్ బ్రంట్ అసాధారణ పోరాట పటిమను కనబరిచి.. కేవలం 53 బంతుల్లో 58 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో ఇంగ్లాండ్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. ఫ్రేయా కెంప్ కూడా 28 బంతుల్లోనే 44 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది.
బైక్ నడుపుతున్న వ్యక్తి ఆ మహిళను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అర్దం చేసుకున్న తారిఖ్.. దుండగుడిని గట్టిగా ప్రతిఘటించాడు. దీంతో ఆ దుండగుడు తుపాకీతో తాఱీఖ్ పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తారిఖ్ అక్కడికక్కడే మరణించాడు.
ఆందోళనకారులపై పోలీసులు, రేంజర్లు.. టియర్ గ్యాస్ షెల్లింగ్, కాల్పులకు తెగబడ్డారు. అన్బ్ ప్రాంతంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో మహ్మద్ యాకూబ్ అనే సామాన్య పౌరుడు మరణించాడు. మరో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడి.. ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు.
క్షణ విషయంలో నాటో సభ్య దేశాలు అమెరికాపై అతిగా ఆధారపడే విధానానికి స్వస్తి పలకడం కోసమే ట్రంప్ ఈమాండ్ తెరపైకి తీసుకువచ్చారని శ్వేత సౌధ సీనియర్ అధికారులు చెబుతున్నారు. ==
ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఒక మండుతున్న అగ్నిపర్వతంగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 28 అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబానికి చెందిన మరో నలుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
యుద్ధనౌకకు సంబంధించిన ప్రధాన నావికాదళ ఫిరంగులు, ఆటోమేటిక్ గన్నులు, రాడార్ ట్రాకింగ్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్‌ల పనితీరును కూడా కిమ్ స్వయంగా పరిశీలించి ఫలితాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వినియోగిస్తున్న ఆహార పదార్థాల్లో పెరుగు తున్న కల్తీ కారణంగా క్యాన్సర్‌తో పాటు అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమ స్యలు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
వీకెండ్ వేళ మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు.
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు నడిరోడ్డుపై మొరాయిస్తే ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.