ఐపీఎల్ 2026... సీఎస్కే నయాలుక్!
Publish Date:Mar 28, 2026
Advertisement
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ నయాలుక్ తో తళతళలాడుతోంది. జెర్సీ మార్పో, మరొకటో కాదు.. కిందటి సీజన్ లోని ఫెయిల్యూర్స్ నుంచి బయటపడి కొత్త ఉత్సాహంతో విజయంపై కన్నేసిన ఆ జట్టు తన బ్యాటింగ్ ఆర్డర్ లో సమూల మార్పులు చేయడానికి రెడీ అయిపోయింది. ముఖ్యంగా ఓపెనింగ్ పెయిర్ విషయంలో ఉన్న సందిగ్ధతకు, సస్పెన్స్ కు తెరదించేసింది. ఈ సారి సీఎస్కే ఓపెనర్ గా స్టార్ వికెట్ కీపర్, టి20 వరల్డ్ కప్ విజయంలో అత్యంత కీలక పాత్ర పోషించిన బ్యాటర్ సంజూ శాంసన్ దిగనున్నాడు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తో కలిసి సంజూశాంసన్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. ఈ విషయాన్ని స్కిప్పర్ రుతురాజ్ గైక్వాడ్ అధికారికంగా ప్రకటించారు. గత సీజన్‌లో సీఎస్కే ఒపెనర్ల విషయంలో సమస్యలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఆ టోర్నీ మొత్తంలో సీఎస్కేకు మంచి ఆరంభం దక్కలేదు. దీంతో ఈ సారి ఆ సమస్య ఎదురు కాకుండా సంజూశాంసన్ ను ఓపెనర్ గా దింపాలని నిర్ణయించింది. సంజూ శాంసన్ రాజస్థాన్ రాయల్స్ నుంచి ట్రేడింగ్ ద్వారా సీఎస్కేలోకి వచ్చిన సంగతి తెలిసిందే. సంజూ శాంసన్ కూడా అప్పట్లో సానుకూలంగా స్పందించాడనీ, కెప్టెన్సీ కాదు.. తనకు కెప్టెన్సీ ముఖ్యం కాదని, కేవలం ఒక ఆటగాడిగా రుతురాజ్ నాయకత్వంలో ఆడేందుకు సిద్ధమని చెప్పినట్లు సమాచారం. అయితే అప్పట్లో అది సాధ్యపడలేదు. ఇప్పుడు సంజయ్ శాంసన్ సీఎక్కేలో సభ్యుడు కావడంతో ఓపెనింగ్ సమస్యలు పరిష్కారం కావడంతో పాటు మిడిలార్డర్ కూడా పటిష్టంగా కనిపిస్తోందని క్రీడా పండితులు చెబుతున్నారు. మార్చి 30న గుహవటి వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తన తొలి మ్యాచ్ ఆడనుంది.
వాస్తవానికి రెండు మూడేళ్ల కిందటే సంజూ శాంసన్ సీఎస్‌కే జట్టులోకి వస్తే బాగుంటుందని తాను భావించినట్లు రుతురాజ్ గైక్వాడ్ అన్నారు. అప్పట్లో వీరిద్దరూ ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న సమయంలో చెన్నై జట్టులోని వాతావరణం, అక్కడి సంస్కృతి గురించి సంజూ ఆరా తీసిన సంగతి చెబుతూ.. ఆ సందర్భంగా తాను సంజూను చెన్నై జట్టలోకి రావాలని కోరినట్లు చెప్పారు.
http://www.teluguone.com/news/content/csk-new-look-in-ipl2026-36-216319.html





