నిప్పులు చిమ్మే విమర్శలు పైపైనే.. లోన మాత్రం బీఆర్ఎస్ దిక్సూచి బీజేపీనే?!

Publish Date:Jul 11, 2023

Advertisement

తెలంగాణలో బీఆర్ఎస్  ఇప్పుడు తీవ్రమైన రాజకీయ ఆరోపణ ఎదుర్కొంటున్నది. బీఆర్ఎస్ బీజేపీ పైకి శత్రువులుగా కనిపించినా లోపల ఆ రెండు పార్టీలు మిత్రులేనని.. ఆ రెండు పార్టీలూ కాంగ్రెస్ ఓటమి కోసమే పనిచేస్తున్నాయన్నది  విశ్లేషకుల మాట. రాజకీయాలంటేనే పార్టీలు సహజంగా ప్రత్యర్థుల ఓటమి కోసమే పనిచేస్తాయి. బీఆర్ఎస్ పార్టీ కూడా అదే చేస్తున్నది అనుకోవచ్చు. కానీ.. ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఓటమితో పాటు బీజేపీకి మేలు చేసే పనులు మాత్రమే చేస్తుందన్నది తెలంగాణ రాజకీయాలలో నడుస్తున్న చర్చ. ఒకప్పుడు కేంద్రంలో బీజేపీని ఢీ కొట్టే వారే లేరని.. ఆ బాధ్యతను తన భుజాలకు ఎత్తుకున్నానని కేసీఆర్ చెప్తే ఏమో కావచ్చులే అనుకున్న జనం ఇప్పుడు కాంగ్రెస్ ఆరోపణ చూసిన తర్వాత బీఆర్ఎస్ బీజేపీ కోసమే పనిచేస్తున్నదని అనుమానిస్తున్నారు.

తన పార్టీని టీఆర్ఎస్ ను  బీఆర్ఎస్ గా మార్చిన సమయంలో సీఎం కేసీఆర్ చెప్పిన నినాదం జల్ జంగిల్ జమీన్. దేశవ్యాప్తంగా ఈ నినాదం మీదనే తన కార్యాచరణ ఉంటుందని చెప్పారు. అదే సమయంలో మోడీ పాలన కంటే మన్మోహన్ సింగే నయమని.. ఎన్డీయే కంటే యూపీఏనే నయమన్నారు. అంతేకాదు బీఆర్‌ఎస్ ప్రభుత్వం దేశానికి ఏమేం చేయాలనుకుంటోందో అన్నీ పూసగుచ్చినట్లు చెప్పారు. మరి నిజంగానే కేసీఆర్ బీజేపీ విముక్తి కోరుకుంటే ఇప్పుడు ఈ స్థాయిలో ఆరోపణలు ఎందుకు వినిపిస్తున్నాయి? బీఆర్ఎస్ అంటే బీజేపీ బీ టీం అనేంతగా పరిస్థితిలో ఎందుకు మార్పు వచ్చింది? బీజేపీని ఢీ కొట్టేందుకే ఆవిర్భవించిన బీఆర్ఎస్ ఇప్పుడు ఇంతటి విమర్శ ఎదుర్కొంటున్నా బీఆర్ఎస్ నేతలు సాదా సీదా కౌంటర్లకే పరిమితమవడం ఏ సంకేతాలు ఇస్తున్నాయి? అసలు నిజంగానే తెర వెనక ఏదైనా జరుగుతున్నదా అన్న చర్చలు జోరందుకున్నాయి.

బీఆర్ఎస్, కేసీఆర్ పై ఈ స్థాయిలో ఆరోపణలకు కారణం ఇప్పుడు కాంగ్రెస్ పుంజుకోవడం.. అదే సమయంలో బీఆర్ఎస్ బీజేపీపై దూకుడు తగ్గించడం.. కాంగ్రెస్ కు అనువుగా ఉన్న చోట బీఆర్ఎస్ పాగా వేయాలని చూడడం. గత నాలుగేళ్లలో బీజేపీపై కేసీఆర్ కారాలు మిరియాలు నూరినా, అప్పుడప్పుడు పార్లమెంటులో బీఆర్ఎస్ ఎంపీలు లొల్లి చేసినా అంతిమంగా బీజేపీ తెచ్చిన వాటికి అనుకూలంగానే ఓటేసేవారు. విమర్శలు, ప్రతి విమర్శలు ఎన్ని ఉన్నా కేంద్రం వద్దకు వెళ్లేసరికి రెండు పార్టీల మధ్య సఖ్యత కూడా బాగానే ఉంటూ వస్తుంది. ఒక దశలో టీఆర్ఎస్ ఎన్‌డీఏ ప్రభుత్వంలో చేరిపోతుందని, అప్పట్లో ఎంపీగా ఉన్న కేసీఆర్ కుమార్తె కవిత మంత్రి అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ప్రచారం జరిగింది. కానీ.. అనూహ్యంగా కేసీఆర్ బీజేపీపై విమర్శల వాన కురిపించడం మొదలు పెట్టారు.

ఇక్కడ రాష్ట్రంలో సైతం బీఆర్ఎస్-బీజేపీ శత్రువులే అన్నట్లు నిత్యం ఆరోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలు, సవాళ్లతో అటెన్షన్ క్రియేట్ చేశారు. ఆ తర్వాత ఢిల్లీ లిక్కర్ స్కామ్ తెర మీదకి రావడం.. రేపో మాపో కవితను అరెస్ట్ అనేంతగా హీటెక్కించి హఠాత్తుగా ఆ ఎపిసోడ్ ను ముగించారు. ఆ దర్యాప్తు ఏమయ్యిందో తెలియదు.. కేసు ఉందో లేదో ఎవరూ చెప్పడం లేదు. ఇప్పుడు బీజేపీ, బీఆర్ఎస్‌ల మధ్య తిట్ల దాడి తగ్గింది. ఇంతలోనే ఒక్కసారిగా కాంగ్రెస్ రావడమే కాకుండా బీఆర్ఎస్ బీజేపీకి బీ టీమ్ అనేది బలంగా ప్రజలలోకి తీసుకెళ్తున్నారు. కూతురు కవిత కోసమే కేసీఆర్ బీజేపీపై దూకుడు తగ్గించారా? లేక అసలు ఈ రెండు పార్టీల వ్యూహమే ఇలా బెడిసి కొట్టిందా? అనూహ్యంగా కాంగ్రెస్ పుంజుకొని ఎన్నికల ముందే సినిమా క్లైమాక్స్ కి వచ్చేసిందా? అనేలా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న మీడియా సంస్థలు చర్చలు సాగిస్తున్నాయి.

అయితే, ఒక పార్టీ ఉమ్మడి శత్రువులు మిత్రులుగా మారడం రాజకీయాలలో పెద్ద విడ్డూరమేమీ కాదు. బీఆర్ఎస్ నినాదమే కాంగ్రెస్ ముక్త్ తెలంగాణ కాగా.. బీజేపీ కోరుకుంటున్నది కాంగ్రెస్ ముక్త్ భారత్. రెండిటి లక్ష్యం ఒక్కటే అయినపుడు దగ్గరవడం సహజమే. కానీ.. ఇది రెండు పార్టీలు కలిసి ఆడించిన ఆటానా.. లేక బీజేపీ ప్లాన్ చేసి కలిసేలా చేసుకుందా అన్నది ఆసక్తికరం. ఇక అసలు ఈ ఊహాగానాలు నిజమా.. లేక బీజేపీపై కేసీఆర్ పోరాటమే నిజమా? చూడాలి.

By
en-us Political News

  
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.