ఢిల్లీలో రేపులే కాదు... ఇవి కూడా మస్తుగా జరుగుతున్నాయట!
Publish Date:Sep 11, 2016
Advertisement
ఢిల్లీ... ఈ పేరు చెప్పగానే మనకు దేశ రాజధాని, విశాలమైన రోడ్లు, ఖరీదైన కార్లు, కాస్మోపాలిటన్ లైఫ్ స్టైల్ అన్నీ గుర్తొస్తాయి. వాటి వెంటనే నిర్భయ ఉదంతం కూడా గుర్తొస్తుంది! ఈ మధ్య కాలంలో ఢిల్లీలో శాంతి భద్రతల సమస్య పదే పదే చర్చకొస్తోంది. మరీ ముఖ్యంగా రేపుల విషయంలో ఢిల్లీ పేరు ఎప్పుడూ న్యూస్ లో వుంటోంది. నిర్భయ రేప్ కేస్ అప్పుడైతే ప్రపంచ వ్యాప్తంగా ఢిల్లీ పేరు కావాల్సినంత ఇన్ ఫేమస్ అయిపోయింది. ఢిల్లీలో జరిగే రేపుల గురించి విపరీతమైన పబ్లిసిటీ రావటం సాధారణం అయిపోయింది. ఏ చట్టం చేసినా ఏం ప్రయోజనం లేకుండా పోయింది. ప్రభుత్వాలు మారినా కూడా పరిస్థతి అలాగే వుంటోంది. కాని, ఇక్కడ అసలు షాకింగ్ విషయం ఏంటంటే, ఢిల్లీలో అత్యధికంగా జరిగే నేరం అత్యాచారం కాదు! కిడ్నాప్, అబడక్షన్ కేసులు అధికంగా నమోదు అవుతున్నాయట!
దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే చిన్నది ఢిల్లీ. కాని, అక్కడ ప్రతీ రోజూ జరిగే అపహరణ కేసులు ఎన్నో తెలుసా? సగటున 21! ఇది దేశంలోనే అత్యధికం! దేశానికి రాజధాని అయిన చోట ఇంతలా కిడ్నాప్ లు , అపహరణలు జరగటం ఆందోళనకరమే! ఢిల్లీలో ప్రతి లక్ష మందికి 37 కిడ్నాప్, అబడ్క్షన్ కేసులు నమోదు అవుతున్నాయట! ఈ విషయం బయటపెట్టింది నేషనల్ క్రైమ్స్ రెకార్డ్ బ్యూరో.
2015లో ఢిల్లీ తరువాతి స్థానంలో ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్రలు వున్నాయి.సంఖ్యాపరంగా యూపీ, మహారాష్ట్రాల్లోనే కేసులు ఎక్కువగా వున్నా ఢిల్లీ చిన్న రాష్ట్రం కాబట్టి తక్కువ సంఖ్యతోనే అగ్రస్థానంలో నిలిచింది! సంవత్సరం మొత్తం మీద కలిపి ఢిల్లీలో 7,730 కిడ్నాప్ కేసులు నమోదయ్యాయి. ఇక తరువాతి క్రమంలో బీహార్, మధ్యప్రదేశ్, బెంగాల్, అస్సామ్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాలు వున్నాయి.
ఢిల్లీలో రేపుల్ని కూడా మించిపోయిన కిడ్నాప్ కేసులు చాలా వరకూ డబ్బుల కోసమే జరుగుతుంటాయంటున్నారు పోలీసులు. ఇంకా కొన్ని కేసులు వుంటాయనీ... కాని, అవ్వి పోలీసుల వరకూ రావని అంటున్నారు. ఎందుకంటే, కిడ్నాపర్ల బెదిరింపులకి లొంగి కిడ్నాప్ అయిన వారి తల్లిదండ్రులు, బంధువులు డబ్బులు ముట్టజెబుతుంటారని అంటున్నారు. మొత్తం మీద ఢిల్లీలో నేరాల్ని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా వుంది. ప్రధానితో పాటూ సీఎం కూడా వున్నప్పటికీ విచ్చలవిడిగా క్రైమ్స్ జరగటం ... తీవ్రంగా ఆందోళనపరిచే అంశం!
http://www.teluguone.com/news/content/crime-capital-45-66334.html





