Publish Date:Apr 16, 2026
హైదరాబాద్‌లో ఓ రిటైర్డ్ సైనికుడి ధైర్యసాహసం చైన్ స్నాచర్‌ను పోలీసులకు పట్టించింది. ఈరోజు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్వయంగా ధైర్య సాహసాలు ప్రదర్శించిన రిటైర్డ్ ఆర్మీ జవాన్ చీర్ల రాముడిని సన్మానించారు. బషీర్‌బాగ్‌లోని పాత కమిషనరేట్ కార్యాలయంలో గురువారం ఆయనను ఆహ్వానించి శాలువా కప్పి నగదు బహుమతిని అందజేశారు. ఈ ఘటన ఈ నెల 14న అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబర్‌పేట్ ఇరానీ హోటల్ బస్టాప్ వద్ద జరిగింది.
బస్సు దిగుతున్న రాముడి మెడలోని బంగారు గొలుసును అపహరించేందుకు నిందితుడు అకస్మాత్తుగా ప్రయత్నించగా, తన వయసును కూడా లెక్కచేయ కుండా రాముడు ఒక్క క్షణం కూడా వెనుకాడకుండా నిందితుడిని గట్టిగా పట్టుకుని డయల్ 100కు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే అంబర్‌పేట్ పెట్రోల్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితుడు మల్లేపల్లికి చెందిన ఆటో డ్రైవర్ అబ్దుల్ మన్నన్ గా గుర్తించారు.
ఇతనిపై తెలంగాణ వ్యాప్తంగా 31 పాత కేసులు ఉన్నట్టు బయటపడింది. హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో సస్పెక్ట్ షీట్ ఉండగా, మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్ కేసులో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నాడు.అతని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు., అతని అనుచరులు కోటేష్ మరియు మల్లేష్ పరారీలో ఉన్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ “సైనికుడు ఎప్పుడూ సైనికుడే” అన్న మాటను రాముడు తన కార్యాచరణతో నిజం చేశారని పేర్కొన్నారు. భయాన్ని జయించి నేరస్తుడిని ఎదిరించిన ఆయన ధైర్యం సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పారు. ప్రతి పౌరుడు యూనిఫామ్ లేని పోలీస్‌లా వ్యవహరిస్తే నేరాలను నియంత్రించడం సులభమవు తుందని పిలుపునిచ్చారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cp-sajjanar-praises-the-courage-of-a-retired-army-jawan-36-217545.html
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం పెరిగింది. నెలరోజులలోనే రెండు లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం తెలపడం నిజంగా చారిత్రాత్మకమని చెప్పవచ్చు.
సత్యవేడులో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ తన యూనిట్‌ను ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చంద్రబాబు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో చేసిన ఆసక్తికర పోస్టు ఇప్పుడు తెగ వైరల్ అయ్యింది.
మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ముసాయిదా నివేదికను (డీపీఆర్) ఈ సందర్భంగా అధికారులు మంత్రుల ముందు ఉంచారు.
మనుషులు, స్తంభాలు, ఇతర నిటారుగా ఉన్న వస్తువుల నీడలు వాటి పాదాల కిందకే పరిమితమై.. బయటకు కనిపించవు. ఈ పరిస్థితి ఒకటి రెండు నిముషాల పాటు ఉంటుంది.
ఈ కాల్పుల విరమణ ఒప్పందం విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్వయంగా తన సామాజిక మాధ్యవ మేదిక ట్రూత్ ద్వారా ప్రకటించారు. ఈ ఓప్పందం యుద్ధం ముగింపు దిశగా కీలక పురోగతి అని ఆయన పేర్కొన్నారు.
Fin Allen Sixers Fest in Delhi, easy, win, over, dc, ipl2026, 4th, concicutive
ఘటన సమయంలో ఇంటి పై అంతస్తులో ఇద్దరు పిల్లలు ఉండగా, తనూజ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒంటరిగా ఉన్నారు.
ఇంట్లో పని చేసే కల్పన అనే మహిళ బయట వ్యక్తులతో సంప్రదింపులు జరిపి ఈ నేరానికి సహకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
అమెరికాలో నివసించే ఎన్ఆర్ఐ ధర్మేంద్ర అనే వ్యక్తిని ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేసి సుమారు రూ.కోట్లు తీసుకున్నారంటూ.. బాధితుడి తండ్రి ఫిర్యాదు ఆధారంగా సీసీఎస్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దీంతో ఈ కేసు సినీ, సోషల్ మీడియా వర్గాల్లో చర్చనీ యాంశంగా మారింది.
హైకోర్టులో ఒక పిటిషన్ విచారణ సందర్భంగా జూనియర్ న్యాయవాది వాదనలు వినిపిస్తున్నారు. ఆ సమయంలో జడ్జి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయన కొంత అసహనానికి గురయ్యారు. ఆ క్రమంలో న్యాయవాది తన గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించారంటూ జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని హెచ్చరిస్తూ.. అక్కడే ఉన్న పోలీసులను పిలిచి ఆ జూనియర్ అడ్వకేట్ ను 24 గంటల పాటు కస్టడీలోకి తీసుకోవాలని ఆదేశించారు.
ఏపీలో పెట్టుబడుల వాతావరణం పండుగలా సాగుతోందన్న ఆయన రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో తమ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనీ, తద్వారా రాష్ట్ర యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను లభించే అవకాశాలు దండిగా ఉంటాయన్నారు.
తనపై నమోదైన మోసం కేసులో దర్యాప్తును నిలిపివేయాలని, స్టే మంజూరు చేయాలని ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికీ, కఠిన చర్యలు తీసుకోకుండా పోలీసులను ఆదేశించడానికీ తిరస్కరించింది.
అమెరికాకు చెందిన యుఎస్ఎస్ బాక్సర్ అనే యుద్ధనౌక హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తుండగా.. ఇరాన్‌కు చెందిన ఒక డ్రోన్ ప్రమాదకర రీతిలో నౌకకు అత్యంత సమీపంలోకి వచ్చింది. సుమారు వెయ్యి గజాల దూరంలోకి వచ్చిన ఆ డ్రోన్.. నౌకలోని సిబ్బందికి, నౌక భద్రతకు ముప్పుగా మారుతుందని గుర్తించిన అమెరికా దళాలు వెంటనే అప్రమత్తమయ్యాయి.
వేద పండితులు ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి పెన్నా నది తీరం నుండి పుట్టిమట్టి తీసుకొచ్చి అమ్మవారి ప్రతిబింబాన్ని ప్రతిష్టించి జలాలతో అభిషేకాలు చేశారు.