కరోనా గురించి చెప్పడానికి మాటలు లేవు..
Publish Date:May 8, 2021
Advertisement
కరోనా గురించి చెప్పడానికి మాటలు లేవు.. రాయడానికి పదాలు లేవు.. ఏదేమైనా కరోనా భారత్‌లో ముమ్మరంగా విస్తరిస్తుంది. విరుచుకు పడుతుంది. దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. నిన్న కొత్తగా 4,01,078 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న 3,18,609 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,18,92,676కు చేరింది. గడచిన 24 గంటల సమయంలో 4,187 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 2,38,270కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,79,30,960 మంది కోలుకున్నారు. 37,23,446 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 16,73,46,544 మందికి వ్యాక్సిన్లు వేశారు. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 30,04,10,043 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 18,08,344 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. తెలంగాణలో కరోనా.. గడచిన 24 గంటల్లో 65,375 కరోనా పరీక్షలు నిర్వహించగా 5,559 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 984 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పలు జిల్లాల్లో రెండంకెల్లోనే కొత్త కేసులు రావడం తాజా బులెటిన్ లో చూడొచ్చు. అదే సమయంలో 8,061 మంది కరోనా నుంచి కోలుకోగా 41 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 4,87,199కి పెరిగింది. 4,13,225 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 71,308 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 2,666కి చేరింది. తెలంగాణ ప్రభుత్వం ఫీవర్ సర్వే.. కోవిడ్ నియంత్రణకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఫీవర్ సర్వేలో భాగంగా ఇప్పటివరకు 1,82,924 ఇళ్లలో సర్వే నిర్వహించారు. సోమవారం ప్రారంభమైన ఈ సర్వేలో ప్రతి రోజు జీహెచ్ఎంసీ, వైద్య ఆరోగ్య శాఖలకు చెందిన బృందాలు ఇంటింటికీ తిరిగి జ్వరం, కొవిడ్ లక్షణాలున్నవారి సర్వేను పెద్దఎత్తున చేపట్టాయి. ఒక ఏఎన్ఎం, ఆశా వర్కర్, జీహెచ్ఎంసీ వర్కర్‌తో కూడిన బృందాలు ఇంటింటికీ తిరిగి సర్వే చేపట్టారు. ఈ బృందాలు జ్వరంతో ఉన్న వారి వివరాలను సేకరించి వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు. నగరంలో ఇవాళ ఒక్కరోజే 720 బృందాలతో 53,002 ఇళ్లలో సర్వేను నిర్వహించారు.
http://www.teluguone.com/news/content/covid-update-in-india-39-115063.html





