థర్డ్ వేవ్ వచ్చేసింది.. తస్మాత్ జాగ్రత్త 

Publish Date:Aug 23, 2021

Advertisement

కరోనా మహామ్మారి సెకండ్ వేవ్ చివరాఖరి దశకు చేరుకుంది. ఇక రేపో మాపో బై బై చెప్పి వెళ్ళిపోతుంది, ఆగష్టులో వస్తుందనుకున్న థర్డ్ వేవ్ రాలేదు. మనం ఇక కాస్త ఊపిరి  తీసుకోవచ్చు, అని అందరూ ఆశపడుతున్న సమయంలో, కేంద్ర హోమ్ శాఖ బాంబు పేల్చింది. సెకండ్ వేవ్ ఉదృతి సంపూర్ణ క్షీణ దశకు చేరుకుంది, కానీ, మహమ్మారి థర్డ్ వేవ్ వచ్చేసిందని,  అక్టోబర్ నాటికీ, ఉదృత రూపం దాలుస్తుందని పిడుగులాంటి వార్తను మోసుకొచ్చింది. 

కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ  పరిధిలో పనిచేసే  జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్ఐఎండీ) నిపుణుల కమిటీ, థర్డ్ వేవ్ వచ్చేసిందని,  ప్రస్తుతానికి  కొంత మెల్లగా ఉన్నా, అక్టోబర్ నాటికి తీవ్ర రూపం దాల్చే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది. కొవిడ్ పునరుత్పత్తి రేటు, ‘ఆర్ – వాల్యూ’ పెరుగుతోంది. జూలై చివరి వారంలో 0.9 గా ఉన్న ఆర్ – విలువ ఇప్పుడు ఒకటి గీత దాటిందని ఇది థర్డ్ వేవ్ వచ్చిందనేందుకు తిరుగు లేని  సంకేతమని,తేల్చి చెప్పింది. అలాగే, ‘థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనే సంసిద్ధత.. పిల్లలపై ప్రభావం, రికవరీ’ పేరు’ తో ప్రధాని కార్యలయానికి సమర్పించిన అధ్యయన నివేదికలో ఎన్ఐఎండీ ముందుగా అనుకున్నట్టు చిన్న పిల్లల్లే థర్డ్ వేవ్ టార్గెట్’ కానుందని, అదే సమయంలో పెద్దలను వదలదని, ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించినా భారీ నష్టం తప్పదని గట్టి హెచ్చరికలే చేసినట్లు సమాచారం. 

ఒకవేళ పెద్ద సంఖ్యలో పిల్లలు కోవిడ్ బారినపడితే వారికి తక్షణమే చికిత్స అందజేసేలా వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, వెంటిలేటర్లు, అంబులెన్స్‌లు సహా పిల్లలకు అవసరమైన వైద్య సదుపాయాలను సిద్ధం చేసుకోవాలి’ అని తెలిపింది. అనారోగ్య సమస్యలున్న చిన్నారులకు ప్రాధాన్యత, దివ్యాంగులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించింది. థర్డ్ వేవ్ అక్టోబరులో తారాస్థాయికి చేరుకుంటుందని గతంలో వివిధ సంస్థలు వేసిన అంచనాలతో ఈ కమిటీ ఏకీభవించింది.ఈ  నేపధ్యంలోనే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఇందులో భాగంగానే, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈ రోజు హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వం ఆక్సిజన్ సరఫరా కోసం రాష్ట్రంలో మరో 41 ఆసుపత్రుల్లో ప్లాంటుల ఏర్పాటు చేస్తోందని చెప్పారు. భద్రాచలం, జగిత్యాల్, జనగాం అప్రభుత్వ ఆసుపత్రులలో PSA ఆక్సిజన్ ప్లాంటులు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. కోవిడ్ చికిత్స, వ్యాక్సినేషన్ ప్రక్రియ దేశ వ్యాప్తంగా సజావుగా కొనసాగుతోందని, రాష్త్రంలో మరో 13 లక్షల 18 వేల వాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయని అన్నారు. అందరికీ కొవిడ్ వాక్సిన్ వేసేందుకు అన్నీ ఏర్పాట్లూ జరుగుతున్నాయని, ఎవ్వరూ ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు. అయితే, కొవిడ్ జాగ్రత్తలను ప్రతి ఒక్కరూ విధిగా పాటించాలని కోరారు. కిషన్ రెడ్డి, ప్రత్యక్షంగా థర్డ్ వేవ్ ప్రస్తావన చేయక పోయినా, కేంద్ర ప్రభుత్వం అందుకు సిద్దం అవుతోందని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. 

నిజానికి  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొవిడ్ ఫస్ట్  ఫస్ట్ వేవ్ సమయంలో తీసుకున్న శ్రద్ధ సెకండ్ వేవ్ సమయంలో తీసుకోలేదు. అందుకే, సెకండ్ వేవ్ కొవిడ్ కేసులే కాదు మరణాలు కూడా చాలా పెద్ద ఎత్తున సంభవించాయి. అయితే, ప్రభుత్వాతో పాటుగా, ప్రజలు కూడా  నిర్లక్ష్యంగా నిబంధనలను గాలికి వదిలేశారు. అందుకే, ఫస్ట్ వేవ్ కన్నా.., సెకండ్ వేవ్’లో మన దేశం  ఎక్కువ మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది. అలాగే, సెకండ్ వేవ్ ఉదృతికి డెల్టా వేరియంట్ కూడా ఒక ప్రధాన కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు. ఇక ఇప్పుడు వచ్చిన థర్డ్ వేవ్’ ఏ వేరియంట్’ అవుతుందో, ఎలాంటి ప్రభావం చూపుతుందో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. థర్డ్ వేవ్ రాక తప్పదని తేలడంతో.. పిల్లల్ని కాపాడేందుకు భారీ ఎత్తున వైద్య సౌకర్యాలు అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తోందని కమిటీ సైతం నివేదికలో పేర్కొనట్లు సమాచారం. మరో వంక  కొవిడ్ పునరుత్పత్తి రేటు, ‘ఆర్ – వాల్యూ’ పెరుగుతోంది. జూలై చివరి వారంలో 0.9 గా ఉన్న ఆర్ – విలువ ఇప్పుడు ఒకటి గీత దాటిందని ఇది థర్డ్ వేవ్ వచ్చిందనేందుకు స్పష్టమైనసంకేతమని, దీనిని ఉపేక్షించ రాదని ఎన్ఐఎండీ  నిపుణులు హెచ్చరిస్తున్నారు.

By
en-us Political News

  
తెలంగాణ ప్రయోజనాలే తమకు పరమావధన్న ఆయన పార్లమెంటులో ఈ ప్రతిపాదనపై చర్చ,  ఓటింగ్ జరిగినప్పుడు తమ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు అనుకూలంగా ఓటు వేస్తారని వెల్లడించారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు ఆమోదం పొందితే దేశ రాజకీయాలలో కాంగ్రెస్ ప్రతిష్ఠ బాగా మసకబారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి. ఇది 2029 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు అవకాశాలపై నిస్సందేహంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
తొలి విడత పంచాయతీ ఎన్నికలలో  వైసీపీ మద్దతుదారులు కనీసం పాతిక శాతం  స్థానాలను కూడా గెలుచుకోలేకపోయారు. అదే సమయంలో తెలుగదేశం కూటమి మద్దతు ఉన్నఅభ్యర్థులు తిరుగులేని విజయాలతో ప్రభంజనం సృష్టించారు. 
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బిల్లు ఉద్దేశాలను, ప్రక్రియను  తప్పుబడుతుండగా, ఇండియా కూటమిలోని పలు ప్రాంతీయ పార్టీలో,  సీట్ల వాటా రక్షణ, సవరణల ఆధారంగా తమ వైఖరిని మార్చుకుంటున్న సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
డీలిమిటేషన్ తో పాటు, మహిళా రిజర్వేషన్ల అమలును తీసుకురావడమే ఈ సమావేశాల నిర్వహన ప్రధాన లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ చెబుతున్నప్పటికీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ హడావుడి సమావేశాల వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం బీజేపీకి రాజకీయ లబ్ధి చూకూర్చడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు ఏ   రాష్ట్రంలోనూ  సీట్ల వాటా తగ్గదు, ప్రస్తుత నిష్పత్తిని కాపాడుతూనే అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా స్థానాలు పెరుగుతాయి.  అంతేకాకుండా, 2051 సీట్ల విషయంలో మార్పులు లేకుండా స్తంభనను అమలు చేయడం ద్వారా భవిష్యత్ జనాభా గణాంకాల ఆధారంగా రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తి మారకుండా నియంత్రించామని కేంద్రం చెబుతోంది. 
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.