కరోనా మహమ్మారికి అరకోటి మంది బలి 

Publish Date:Oct 2, 2021

Advertisement

ఎక్కడ పుట్టిందో, ఎందుకు పుట్టిందో ఏమోకానీ, కరోనా మహమ్మారి, ప్రపంచం మొత్తాని గజగజ వణికిస్తోంది. చావన్నది లేని ఈ వైరస్ ఇంచు మించుగా గడచిన రెండేళ్లలో, లక్షల ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. నిజానికి ఈ మహమ్మారి ఎన్ని ప్రాణాలను మింగేసిందో ... ఖచ్చితంగా చెప్పే పరిస్థితి లేదు. అయితే, తాజాగా రాయిటర్స్‌ వార్తా సంస్థ వేర్వేరు మార్గాల్లో సేకరించి, విశ్లేషించిన గణాంకాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ మరణాల సంఖ్య 50లక్షలు దాటింది. అంటే అరకోటిమందిని మిగేసింది. కరోనా తొలికేసు 2019 నవంబర్ 17 దక్షిణ చైనాలోని, హుబేలి ప్రావిన్స్’లో వెలుగు చూసింది. ఆ తర్వాత నెలరోజులకు, అదే ప్రావిన్స్ లోని వూహన్’లో  డిసెంబర్ 20న  శాస్త్ర వేత్తలు కరోనా వైరస్’ను గుర్తించారు. ఆ తర్వాత 2020 మార్చిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ, కరోనాను మహమ్మారిగా గుర్తించింది. 

కాగా, ఈ ఏడాదిన్నరకు పైగా ఇచుమించుగా 115కు పైగా దేశాలకు వ్యాపించిన కరోనా ఇప్పటివరకు అరకోటి మందిని పొట్టనబెట్టుకుంది. తాజాగా వెలువడిన రాయిటర్స్‌ వార్తా సంస్థ విశ్లేషించిన గణాంకాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ మరణాల సంఖ్య 50లక్షలు దాటింది. కరోనా వెలుగు చూసిన తొలి ఏడాదిలో 25లక్షల మందిని వైరస్‌ బలితీసుకోగా.. మరో 25లక్షల మరణాలు కేవలం 236 రోజుల్లోనే సంభవించాయి. చాలా దేశాల్లో వ్యాప్తి చెందిన డెల్టా వేరియంటే ఇందుకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా నమోదైన కరోనా మరణాల్లో అగ్ర రాజ్యం అమెరికా సహ ఐదు దేశాల్లోనే సగానికి పైగా మరణాలు నమోదయ్యాయి. అమెరికాలో అత్యధిక మరణాలు చోటుచేసుకోగా.. ఆ తర్వాత రష్యా, బ్రెజిల్‌, మెక్సికో, భారత్‌ దేశాల్లోనూ లక్షల మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో అయితే ఈ సంఖ్య ఏకంగా 7లక్షలు దాటింది. అగ్రరాజ్యంలో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినప్పటికీ మరణాలు మాత్రం ఇంకా అత్యధిక స్థాయిలోనే ఉంటున్నాయి. ఇప్పటివరకు 7లక్షల మందికి పైగా మరణించారు. అక్కడ సగటున రోజుకు 1900 మంది కరోనాతో చనిపోతున్నారు.

కరోనా మరణాల్లో బ్రెజిల్‌ రెండో స్థానంలో ఉంది. ఆ దేశంలో ఇప్పటివరకు 5.97లక్షల మంది కొవిడ్‌కు బలయ్యారు. ఇక భారత్‌లోనూ 4.48లక్షల మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు. గతవారం ప్రపంచవ్యాప్తంగా సగటున రోజుకు 8000 కరోనా మరణాలు సంభవించినట్లు రాయిటర్స్‌ కథనం వెల్లడించింది. అంటే ఇప్పటికీ ప్రతి నిమిషానికి ఐదుగురు కొవిడ్‌తో మృత్యువాతపడుతున్నారు.అయితే, మన దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ పెరుగుతూ ఉన్నా, వాక్సినేషన్ కార్యక్రమం వేగంగగా సాగుతోంది. మరణాల సంఖ్య తగ్గుతోంది.కానీ,ముప్పు పూర్తిగా తప్పలేదు. మూడో ఉదృతి విషయంలోనూ సందిగ్ధత కొనసాగుతోంది. సో.. కొవిడ్ నిబంధనలు పాటించక తప్పదని నిపుణులు సూచిస్తున్నారు.

By
en-us Political News

  
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
పోలీసుల హెచ్చరికలు, ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆయన భారీ కాన్వాయ్‌తో అక్కడికి రావడంపై స్థానిక ప్రజలు, తెలుగుదేశం వర్గీయులు  ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎంపీ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా  అంకాలమ్మ గూడూరులో ఘర్షణ వాతావరణం నెలకొంది. 
ఇదే వేదికపై నుంచి   544.11 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన రేవంత్ రెడ్డి,  ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని కూడా   ప్రారంభించారు.
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.