సోషల్ మీడియా పోస్టులపై కోర్టు ఆగ్రహం…కేసు నమోదు

Publish Date:May 17, 2026

Advertisement

 

బండి భగీరథ్ కేసు రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగాచర్చనీయాంశంగా మారిన ఈ కేసులో ఇప్పుడు సోషల్ మీడియా పోస్టులు కొత్త వివాదానికి దారితీశాయి. ముందస్తు బెయిల్ విచారణ జరుగుతున్న సమయంలో మహిళా జడ్జిపై సోషల్ మీడియాలో అనుచిత ఆరోపణలు, ప్రచారాలు వెలుగులోకి రావడంతో హైకోర్టు తీవ్రంగా స్పందించింది.ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టులోనే ఈ అంశం ప్రస్తావనకు రావడం సంచలనం సృష్టించింది. విచారణ సమయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాల గురించి జడ్జి మాధవి స్వయంగా ప్రస్తావించారని సమాచారం. కోర్టు ప్రక్రియను ప్రభావితం చేసేలా జరుగుతున్న పోస్టులు న్యాయవ్యవస్థకు పెద్ద సవాల్‌గా మారాయని భావించారు.

సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అయిన ఒక ఆరోపణ కోర్టును మరింత ఆందోళనకు గురిచేసింది.ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే జడ్జి మాధవి భర్తకు బార్ కౌన్సిల్ చైర్మన్ పదవి ఇస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ప్రచారం విస్తృతంగా షేర్ అవుతూ వైరల్ కావడం, కోర్టు ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉందని భావించారు. ఈ నేపథ్యంలోనే పలు సోషల్ మీడియా పోస్టులను ఆధారాలుగా సేకరించి హైకోర్టు రిజిస్ట్రార్ చార్మినార్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఇలాంటి నిరాధార పోస్టులు ప్రజల్లో న్యాయవ్యవస్థపై అనుమానాలు, అపనమ్మకం కలిగించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. 

కోర్టు నిర్ణయాలపై ప్రభావం చూపేలా సోషల్ మీడియాలో ప్రచారాలు జరగడం అత్యంత తీవ్రమైన విషయమని హైకోర్టు రిజిస్ట్రార్ ఫిర్యాదు లో పేర్కొన్నారు..ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సైబర్ ట్రేసింగ్ ద్వారా పోస్టుల మూలాలను గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలిస్తూ పోలీసులు సాక్ష్యాలను సేకరిస్తున్నారు. ఇప్పటికే వివాదాస్పదంగా మారిన బండి భగీరథ్ కేసు ఇప్పుడు సోషల్ మీడియా కోణంతో మరింత సీరియస్ దశలోకి వెళ్లింది.కోర్టు విచారణను ప్రభావితం చేసేలా సోషల్ మీడియాలో ప్రచారాలు చేస్తే ఎంత తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయో ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది. ఇప్పుడు అందరి దృష్టి పోలీసుల దర్యాప్తుపైనే ఉంది… ఈ పోస్టుల వెనుక ఉన్నవారు ఎవరు? త్వరలో బయటపడే అవకాశముంది.

By
en-us Political News

  
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్ఎం పోస్టులు ఇప్పిస్తామంటూ ఉమ్మడి వరంగల్, హనుమకొండ జిల్లాల్లో రూ.లక్షల్లో వసూలు చేస్తున్న దళారీల దందా వెలుగులోకి వచ్చింది. యూనియన్ ముసుగులో జరుగుతున్న ఈ అక్రమాలపై జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజారెడ్డి విచారణ ప్రకటించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్‌లోని సరూర్ నగర్ సాగరిక ఇంటెగ్రేటెడ్ హైస్కూల్‌లో రాఖీలు, తిలకం తొలగింపు వివాదంపై బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి టీచర్‌ను హిజాబ్‌‌పై ప్రశ్నించడం సంచలనంగా మారింది. పోలీసులు కార్పొరేటర్‌పై సుమోటో కేసు నమోదు చేశారు.
హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో కన్న కూతురిపై లైంగిక దాడికి యత్నించిన భర్త శ్రీనివాస్‌ను భార్య రమాదేవి గొడ్డలితో నరికి చంపింది. అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లా సీఐఎస్ఎఫ్ క్యాంపులో హెడ్ కానిస్టేబుల్ ఏకే 47 రైఫిల్‌తో చేసిన విచక్షణారహిత కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి చెందారు. సేవా పవర్ ప్రాజెక్ట్ వద్ద జరిగిన ఈ దారుణ ఘటనపై సీఐఎస్ఎఫ్ డీజీ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.
ఒడిశా తాల్చేర్ ప్రాంతంలో సంచలనం సృష్టించిన దారుణ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్ మాధాపూర్‌లో స్పా సెంటర్ ముసుగులో నడుస్తున్న అక్రమ వ్యభిచార రాకెట్‌ను ఎస్‌ఓటీ పోలీసులు మట్టుబెట్టారు. నలుగురు యువతులను రక్షించి, రూ. 45 వేల నగదు, 8 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
యాదాద్రి భువనగిరి జిల్లా చల్లూరులో భూభారతి వెబ్‌సైట్ ద్వారా ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండానే 7.18 ఎకరాల భూమి వేరొకరి పేరు మీదకు మారిపోయింది. యజమానులకు తెలియకుండా జరిగిన ఈ భారీ భూ భాగోతం పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఏపీ సచివాలయ ఉద్యోగాలు, డీఎస్సీ నియామకాలు మరియు మెడికల్ సీట్లలో నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్ల అక్రమాలపై విచారణ ముమ్మరమైంది. హైకోర్టు ఆదేశాలు, విజిలెన్స్ తనిఖీలు మరియు సాప్ చేపట్టిన స్కిల్ టెస్ట్ వివరాలు ఇక్కడ చూడండి.
150 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న వందేమాతరం గేయానికి జాతీయ గీతంతో సమాన హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ తెచ్చింది. 3 నిమిషాల 10 సెకన్ల ఆలాపన, సుప్రీంకోర్టు విచారణ మరియు చట్టపరమైన నిబంధనల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
హైదరాబాద్ రాయదుర్గంలో ఐటీ కంపెనీ మహిళా ఉద్యోగిపై ఫుడ్ వెండర్ షేక్ నబీ కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి లైంగిక దాడి చేశాడు. ప్రైవేట్ వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేస్తూ రూ. 43 లక్షలు నొక్కేసి మూడేళ్లు వేధించిన నిందితుడిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు.
విజయవాడ ఎన్‌టీపీఎస్ కాలువలో లభించిన మహిళ శరీర భాగాల మిస్టరీ వీడింది. చేతిపై ఉన్న ఈక టాటూ ఆధారంగా మృతురాలిని మంగళగిరికి చెందిన 29 ఏళ్ల కళ్యాణిగా గుర్తించిన పోలీసులు, విచారణలో మటన్ షాప్ షఫీ చేసిన కిరాతక హత్యను ఛేదించారు.
కన్యాకుమారి యూట్యూబర్ ఇంట్లో ఏకంగా 118 సవర్ల (944 గ్రాములు) బంగారం, భారీగా నగదు చోరీకి గురయ్యాయి. సోషల్ మీడియాలో రీల్స్ కోసం చూపించిన సంపదే దొంగలను ఆకర్షించిందా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.