Publish Date:Apr 18, 2022
ఇటీవల ఎవరిపై ఇంత రచ్చ జరగలేదు. ఇటీవల ఏ కేసులోనూ ఇంత సంచలనం నెలకొనలేదు. ఆయన మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. రోజుల వ్యవధిలోనే ఏకంగా కోర్టులోనే దొంగతనం జరిగింది. మంత్రి కేసు తాలూకూ సాక్షాధారాలు మాత్రమే ఎత్తుకెళ్లారు. దొంగలు దొరికినా.. వారికి రాజకీయ సంబంధం లేదని తేల్చారు. కట్ చేస్తే.. అదే మంత్రి కాకాణి విల్లాలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా చనిపోయాడు. ఇలా, సినిమాటిక్‌గా సాగుతున్న మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ఎపిసోడ్ పొలిటికల్‌గా ఫుల్ కాంట్రవర్సీగా మారింది. ఓవైపు మాజీ మంత్రి అనిల్‌కుమార్.. పోటీ సభలు, ప్రెస్‌మీట్లు, సర్వేపల్లిలో పర్యటనలతో కాకాణిని సవాల్ చేస్తుంటే.. మరోవైపు, వరుస ఘటనలు కొత్త మంత్రిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తాజాగా, టీడీపీ సైతం రంగంలోకి దిగి.. కాకాణిని అనుమానాలు, ప్రశ్నలతో కుమ్మేయడంతో.. కాకాణికి మంత్రి అయ్యాననే సంతోషమే లేకుండా పోయింది.
కాకాణి గోవర్థన్ రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అరాచక పర్వానికి తెర తీశారని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. కాకాణి ఏడు కేసుల్లో ముద్దాయని గుర్తు చేశారు. నెల్లూరు కోర్టు చోరీపై చాలా అనుమానాలు ఉన్నాయన్నారు. సెలవు రోజు కోర్టు ఉద్యోగి.. కోర్టుకు ఎందుకు వెళ్లాడని ప్రశ్నించారు. కాలువలో సంచి ఉన్నట్లు ఎలా చెప్పాడన్నారు. ఎస్పీ కల్పిత కధ అల్లారని, వేల కేసుల ఫైల్స్ ఉంటే కేవలం కాకాణి కేసుకు చెందిన ఆధారాలున్న బీరువా మాత్రమే దొంగలకు కనిపించిందా? అని నిలదీశారు. ప్రభుత్వ పెద్దల సహకారం లేకుండా చోరీ జరగలేదని ధూళిపాళ్ల అనుమానం వ్యక్తం చేశారు.
"మంగళగిరిలోని కాకాణి విల్లాలో మహమ్మద్ అనే వ్యక్తి చనిపోయారు. ఏసీ మెకానిక్ మహమ్మద్ మృతిపై చాలా అనుమానాలున్నాయి. మహమ్మద్ మృతికి.. చోరీ కేసుకు ఉన్న సంబంధమేంటి? సుమోటోగా న్యాయమూర్తులే సీబీఐ విచారణ జరిపించాలి. పోలీసులు దర్యాప్తుతో ఎలాంటి ఉపయోగం ఉండదు" అని ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు.
మరోవైపు, విల్లాలో శవం వ్యవహారం కాకాణి మెడకు చుట్టుకుంటోంది. మంగళగిరిలో మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డికి చెందిన విల్లాలో ఓ యువకుడు అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. శనివారం ఉదయం మరణించగా, ఆదివారం ఉదయం వరకు విషయం గోప్యంగా ఉంచారు. విద్యుత్ షాక్‌తో చనిపోయాడని పోలీసులు చెబుతుండగా, హత్య చేశారని యువకుడి బంధువులు ఆరోపించారు. ఘటనపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేపట్టేందుకు బంధువులు సిద్ధమమగా.. మంత్రి పీఏ రంగప్రవేశం చేసి స్థానిక వైసీపీ నేతల సాయంతో మృతుడి కుటుంబీకులతో బేరాలకు దిగినట్టు తెలుస్తోంది. మృతుడి కుటుంబీకులు రూ.12 లక్షలు ఇవ్వాలని పట్టుబట్టగా.. చివరకు 6 లక్షలకు ఒప్పించారు. అందులో మంత్రి కాకాణి 3 లక్షలు, మెకానిక్ షాపు యజమాని షేక్ యూసూబ్ 3 లక్షలు ఇచ్చేలా డీల్ కుదిరినట్టు సమాచారం.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/controversy-over-minister-kakani-39-134577.html
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.