కాకాణిపై 7 కేసులు.. విల్లాలో శ‌వం.. ఎస్పీ ఫేక్ స్టోరీ!.. మంత్రిపై ఫుల్ కాంట్ర‌వ‌ర్సీ..

Publish Date:Apr 18, 2022

Advertisement

ఇటీవ‌ల ఎవ‌రిపై ఇంత ర‌చ్చ జ‌ర‌గ‌లేదు. ఇటీవ‌ల ఏ కేసులోనూ ఇంత సంచ‌ల‌నం నెల‌కొన‌లేదు. ఆయ‌న మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. రోజుల వ్య‌వ‌ధిలోనే ఏకంగా కోర్టులోనే దొంగ‌త‌నం జ‌రిగింది. మంత్రి కేసు తాలూకూ సాక్షాధారాలు మాత్ర‌మే ఎత్తుకెళ్లారు. దొంగ‌లు దొరికినా.. వారికి రాజ‌కీయ సంబంధం లేద‌ని తేల్చారు. క‌ట్ చేస్తే.. అదే మంత్రి కాకాణి విల్లాలో ఓ వ్య‌క్తి అనుమానాస్ప‌దంగా చనిపోయాడు. ఇలా, సినిమాటిక్‌గా సాగుతున్న మంత్రి కాకాణి గోవ‌ర్థ‌న్‌రెడ్డి ఎపిసోడ్ పొలిటిక‌ల్‌గా ఫుల్ కాంట్ర‌వ‌ర్సీగా మారింది. ఓవైపు మాజీ మంత్రి అనిల్‌కుమార్.. పోటీ స‌భ‌లు, ప్రెస్‌మీట్లు, స‌ర్వేప‌ల్లిలో ప‌ర్య‌ట‌న‌ల‌తో కాకాణిని స‌వాల్ చేస్తుంటే.. మ‌రోవైపు, వ‌రుస ఘ‌ట‌న‌లు కొత్త మంత్రిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తాజాగా, టీడీపీ సైతం రంగంలోకి దిగి.. కాకాణిని అనుమానాలు, ప్ర‌శ్న‌లతో కుమ్మేయడంతో.. కాకాణికి మంత్రి అయ్యాననే సంతోషమే లేకుండా పోయింది. 

కాకాణి గోవర్థన్ రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అరాచక పర్వానికి తెర తీశారని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. కాకాణి ఏడు కేసుల్లో ముద్దాయని గుర్తు చేశారు. నెల్లూరు కోర్టు చోరీపై చాలా అనుమానాలు ఉన్నాయన్నారు. సెలవు రోజు కోర్టు ఉద్యోగి.. కోర్టుకు ఎందుకు వెళ్లాడని ప్రశ్నించారు. కాలువలో సంచి ఉన్నట్లు ఎలా చెప్పాడన్నారు. ఎస్పీ కల్పిత కధ అల్లారని, వేల కేసుల ఫైల్స్ ఉంటే కేవలం కాకాణి కేసుకు చెందిన ఆధారాలున్న బీరువా మాత్రమే దొంగ‌ల‌కు కనిపించిందా? అని నిల‌దీశారు. ప్రభుత్వ పెద్దల సహకారం లేకుండా చోరీ జరగలేదని ధూళిపాళ్ల అనుమానం వ్యక్తం చేశారు.

"మంగళగిరిలోని కాకాణి విల్లాలో మహమ్మద్‌ అనే వ్యక్తి చనిపోయారు. ఏసీ మెకానిక్‌ మహమ్మద్‌ మృతిపై చాలా అనుమానాలున్నాయి. మహమ్మద్‌ మృతికి.. చోరీ కేసుకు ఉన్న సంబంధమేంటి? సుమోటోగా న్యాయమూర్తులే సీబీఐ విచారణ జరిపించాలి. పోలీసులు దర్యాప్తుతో ఎలాంటి ఉపయోగం ఉండదు" అని ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు.

మ‌రోవైపు, విల్లాలో శ‌వం వ్య‌వ‌హారం కాకాణి మెడ‌కు చుట్టుకుంటోంది. మంగ‌ళ‌గిరిలో మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డికి చెందిన విల్లాలో ఓ యువకుడు అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. శనివారం ఉదయం మరణించగా, ఆదివారం ఉదయం వరకు విష‌యం గోప్యంగా ఉంచారు. విద్యుత్‌ షాక్‌తో చనిపోయాడని పోలీసులు చెబుతుండగా, హత్య చేశారని యువకుడి బంధువులు ఆరోపించారు. ఘటనపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఆందోళన చేపట్టేందుకు బంధువులు సిద్ధమమ‌గా.. మంత్రి పీఏ రంగప్రవేశం చేసి స్థానిక వైసీపీ నేతల సాయంతో మృతుడి కుటుంబీకులతో బేరాలకు దిగినట్టు తెలుస్తోంది. మృతుడి కుటుంబీకులు రూ.12 లక్షలు ఇవ్వాలని పట్టుబట్టగా.. చివరకు 6 లక్షలకు ఒప్పించారు. అందులో మంత్రి కాకాణి 3 లక్షలు, మెకానిక్‌ షాపు యజమాని షేక్‌ యూసూబ్‌ 3 లక్షలు ఇచ్చేలా డీల్‌ కుదిరినట్టు సమాచారం. 

By
en-us Political News

  
రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధం తెలుగు రాష్ట్రాల్లో ఒక కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది.
భారత యువ క్రికెటర్ పృథ్వీ షా, నటి ఆకృతి అగర్వాల్ వ్యక్తిగత జీవితంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ గోల్ఫ్ ఎడ్జ్ అపార్ట్‌మెంట్స్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది.
అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరో అవినీతి బాగోతాన్ని వెలుగులోకి తెచ్చారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
జాతీయ రాజధాని ఢిల్లీలో రాజకీయ వేడెక్కుతున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ అత్యంత కీలకమైన ఆదేశాలు జారీ చేశారు.
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ వ్యవహారంపై కాంగ్రెస్ న్యాయపోరాటానికి దిగింది.
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ వెస్ట్ బైపాస్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
ప్రస్తుతం మార్కెట్‌లో రోజురోజుకూ పెరుగుతున్న ధరలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి
అర్థశాస్త్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతి విజేతల ప్రకటన వెలువడింది.
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.