ఆంధ్రాలో 'మర్యాదలు' అడుక్కుంటున్న పోలీసు బాసులు

Publish Date:Jan 22, 2022

Advertisement

ఆంధ్రా ఐపీఎస్ ఆఫీసర్లకు ఇప్పుడో పెద్ద సమస్య వచ్చి పడింది. సమస్య తమదే అయినా దానికి పరిష్కారం మాత్రం వారి చేతుల్లో లేకపోవడమే విశేషం. తాము ఎదుర్కొంటున్న సమస్యకు ప్రతిపక్షం నుంచి పరిష్కారాన్ని ఆశిస్తున్నారు. ఇది మరీ విచిత్రమైన సమస్య. ఒక వస్తువు ఎక్కడ పోయిందో అక్కడ వెదికితేనే దొరుకుతుందని ఎంత చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు. పోయిన చోటే వెదుక్కో పోరా.. అని మన పెద్దలు కూడా చిన్నప్పట్నుంచే చెవినిల్లు కట్టుకొని చెబుతారు. కానీ ఏపీలో ఐపీఎస్ ఆఫీసర్లు మాత్రం ఇంత చిన్న లాజిక్ ను మిస్సవుతుండడమే అసలు పాయింటు. 

ఇక విషయానికొద్దాం. మొన్న గుడివాడ ఘటన తరువాత ఐపీఎస్ అధికారుల సంఘానికి ఓ పేద్ద డౌటొచ్చింది. రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణంతా తామే దగ్గరుండి చూసుకునే ఖాకీ బాసులు అయినప్పటికీ ప్రజలంతా తమను ఎందుకనో లైట్ తీసుకుంటున్నారన్న అనుమానం మొదలైంది. అనుమానం వచ్చిందే తడవు ఓ అనౌన్స్ మెంటు ప్రిపేర్ చేశారు. ప్రజల మీదికి వదిలారు. ఐపీఎస్ అధికారులను ప్రతిపక్షాలు లైట్ తీసుకుంటున్నాయని, ముఖ్యంగా రాష్ట్ర పోలీస్ బాసును ఏకవచనంతో సంబోధించడంతో తామంతా హర్ట్ అవుతున్నామని, శాంతి భద్రతల నిర్వహణలో నిద్రాహారాలు మాని పనిచేస్తుంటే తమనే ప్రతిపక్షాలు అనుమానిస్తున్నాయని, ఇది తమకెంతో అవమానకరమని, ఖాకీ బట్టలేసుకున్న తమకు ఈ అవమానమే ఎంతో అమర్యాదాకరమని, ప్రతిపక్షాలు కాసింత మర్యాదలు నేర్చుకొని ప్రజాక్షేత్రంలోకి రావాలని ఓ ప్రకటన జారీ చేశారు.. ఐపీఎస్ అధికార్ల సంఘం జాయింట్ సెక్రటరీ ఆర్పీ మీనా. 

ఇదంతా ఎందుకొచ్చిందంటే గుడివాడలో కొడాలి నానికి సంబంధించిన కె.కన్వెన్షన్ లో విచ్చలవిడిగా జూదం ఆడుతున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపించాయి. దానిపై నిజనిర్ధారణ కోసం టీడీపీ ఆధ్వర్యంలో కొంతమంది నాయకుల బృందం అక్కడికి బయల్దేరింది. అయితే టీడీపీ నాయకులు అక్కడకు వెళ్లకుండా విజయవంతంగా అడ్డుకున్న పోలీసులు.. వైసీపీ నేతల ప్రవాహాన్ని మాత్రం అడ్డుకోలేకపోయారు. అసలు అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదంటే సబబుగా ఉంటుంది. వైసీపీ నేతల వాహన ప్రవాహాన్ని శక్తివంచన లేకుండా యథేచ్ఛగా ముందుకు పోనిచ్చారనేది ఇంకా కరెక్టు. దీంతో ఏమైంది? మందబలం చూసుకున్న వైసీపీ నేతలంతా రెచ్చిపోయి టీడీపీ నాయకుల్ని, కార్యకర్తల్ని దొరికినవారిని దొరికినట్టు చితకబాదారు. పిడిగుద్దులు కురిపించారు. కనీసం అక్కడి నుంచి తప్పించుకునే అవకాశం లేకుండా వారి వాహనాల్ని కూడా వ్యూహాత్మకంగా ధ్వంసం చేశారు. పనిలో పనిగా నోటిక్కూడా పని చెప్పి బూతు పురాణాలు అందుకున్నారు. అసలక్కడ క్యాసినో లాంటి అంతర్జాతీయ జూదక్రీడ జరగనప్పుడు టీడీపీ నిజనిర్ధారణ టీమ్ ను ఆపడం దేనికి? అక్కడ క్యాసినో ఒకవేళ జరిగితే జరుగుతున్నట్టు ప్రజలు తెలుసుకుంటారు. జరక్కపోతే అలాంటిదేం లేదని, ప్రతిపక్ష టీడీపీనే అనవసరంగా డ్రామా క్రియేట్ చేసిందని ప్రజలే నిర్ధారించుకుంటారు కదా. జరగాల్సిన కార్యక్రమాన్ని శాంతిభద్రతల సమస్య రాకుండా జరగనిస్తే అయిపోయేదానికి ఈ ప్రకటన దాకా తీసుకురావడంలో ఆంతర్యమేంటి? అసలు  తాము చేయాల్సిన పని చేయకపోవడం వల్లే ప్రతిపక్షాలు రంగంలోకి దిగాయన్న సింపుల్ లాజిక్ ను పోలీసులు ఎందుకు మిస్సవుతున్నారని అడుగుతున్నారు సామాన్య జనం. పోనీ శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా టీడీపీ పరివారాన్ని ఆపారే అనుకుందాం. మరి వైసీపీ నేతలను కూడా అదే తరహాలో ఆపి ఉండాల్సింది కదా. అలా జరిగినప్పుడే పోలీసు బాసులు విధి నిర్వహణను సక్రమంగా నిర్వర్తించినట్లు అవుతుంది కదా. ఆ పని చేయలేని, చేత కాని నిర్వాకం చేత.. కడుపు రగిలిన ప్రతిపక్షాలు పోలీస్ అధికారుల వైఫల్యాల మీద విరుచుకుపడితే, ఓ నాలుగు ఘాటైన వ్యాఖ్యలతో చురకలంటిస్తే అది వారి తప్పెలా అవుతుంది? ఈ మాత్రం విమర్శలు కూడా తట్టుకోలేనివారు... మరి అధికార పార్టీకి అంతలా ఏజెంట్లలాగా వ్యవహరించడం ఎందుకున్న విమర్శలు ప్రజల నుంచి వినిపిస్తే ఆ తప్పెవరిది?

అయినా ఖాకీ బాసులు విఫలమైనప్పుడు ఇక ప్రతిపక్షాలకు మిగిలిందేమిటి? ప్రెస్ మీట్ల ద్వారా ప్రజలకు తమ గోడేంటో వెళ్లబోసుకోవడమే కదా. దానిక్కూడా ఐపీఎస్ అధికారుల సంఘం ఉడుక్కుంటే ఎలా? అసలు మీనా అంటున్నదేంటి? డీజీపీ గౌతం సవాంగ్ ను ఏకవచనంతో సంబోధిస్తారా.. అని. ఏం? ఏకవచన ప్రయోగం ఏమైనా నేరామా? ఘోరమా? అప్రజాస్వామికమా? అవమానకరమైన పద ప్రయోగమా? పోనీ... నువ్వు అనే పదాన్ని ఐపీఎస్ సంఘం సంస్కార రహితంగా భావిస్తున్నదా? ఖాకీ బట్టల అంకిత భావాన్ని తమరు చేజేతులా అధికార పార్టీ ముందు ఒగ్గేస్తే... మాటలు పడి, దెబ్బలు తిని, వాహనాలు కోల్పోయి చెల్లాచెదురైన టీడీపీ నేతలు.. ఏకవచన ప్రయోగం చేసినందుకే మీకు మర్యాద లోపించినట్లు అనిపించిందా? ఇంతకన్నా విడ్డూరం ఉంటుందా? ఈ మాత్రం కూడా ఆత్మపరిశీలన చేసుకోలేదు కాబట్టే... ఆంధ్రా పోలీసు బాసులు మర్యాదలను అడుక్కోవాల్సిన దుస్థితిలో పడిపోయారని సామాన్య జనం చెవులు కొరుక్కుంటున్నారు. కనీసం ఇకనుంచైనా ఇలా మర్యాదలు అడుక్కోవడం కాకుండా మీ మర్యాదల్లో మీరుంటే ఎదుటివారు కూడా మర్యాదలు పాటిస్తారని, లేనిపక్షంలో వారిచేతుల్లో మళ్లీ మర్యాదలు చేయించుకోవాల్సిన పరిస్థితులు వచ్చినా ఆశ్చర్యపోవల్సిన అవసరం లేదన్న సెటైర్లు కూడా వినిపిస్తున్నాయి.

By
en-us Political News

  
శ్రీరాముడి పేరు చెప్పి బిజెపి రాజకీయాలు చేస్తోందని.. శ్రీరాముడు బీజేపీ ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ కాదు..ఆయన అందరివాడు..బిజెపి ఓడిపోయిన శ్రీరాముడికి ఏం కాదు అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ చెప్పుకొచ్చారు.
ఇది పేద, మధ్య తరగతి జనానికి హెచ్చరిక. ఆ మాటకొస్తే ఓ మోస్తరు ధనవంతులు.. చిన్నసైజు కోటీశ్వరులకు కూడా హెచ్చరికే.
ఖమ్మం లోక్ సభ అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ హై కమాండ్ కర్ర విరగాకుండా, పాము చావకుండా అన్నట్లు వ్యవహరించిందా? ఈ సీటు తన తమ్ముడికే ఇవ్వాలంటూ మంత్రి పొంగులేటి.. కాదు తన భార్యకే అంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పట్టుబట్టడంతో కాంగ్రెస్ హైకమాండ్ అనూహ్యంగా మూడో వ్యక్తిని తెరమీదకు తీసుకువచ్చిందా?
ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో తిలాపాపం తలా పిడికెడు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ పాపం ఎంత వుందో, బీజేపీ పాపం కూడా అంతే వుంది.
ఎన్నికల ప్రచారంలో వైఎస్ వివేకా హత్య కేసుపై ఎవరూ మాట్లాడొద్దంటూ కడప కోర్టు జారీ చేసిన ఆదేశాలను సవాల్ చేస్తూ పులివెందుల తెలుగుదేశం అభ్యర్థి బీటెక్ రవి హైకోర్టును ఇశ్రయించారు.
రాజకీయాల్లో రాణించడానికి చదువు అవసరం లేదు. పంచాయతీ బోర్డు మెంబెర్ మొదలు ప్రధాని పదవి వరకు, ఏ పదవికి విధ్యార్హతలు అక్కరలేదు. ఓటు హక్కున్న ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో పోటీ చేయవచ్చును. ప్రజలు గెలిపిస్తే చాలు, ఎమ్మెల్ల్యే, ఎంపీ , మంత్రి, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి, ప్రధాన మంత్రి ఏదైనా కావచ్చును. ఏ పదవికీ చదవు సంధ్యలు అవసరం లేదు, డిగ్రీలు అక్కరలేదు.
కేసీఆర్ కట్టడం కూలిందంటే, ఆయన ఫామ్‌హౌస్‌లో వున్న కట్టడం కూలిందనో, హైదరాబాద్ నంది నగర్లో ఆయనకు
తిమ్మిని బమ్మిని చేసి, మాటలతో మాయ చేసే తండ్రి సపోర్టు బాగా వుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఏం మాట్లాడినా నడిచింది.
శిరోముండనం కేసులో విశాఖ కోర్టు తనకు విధించిన శిక్షను నిలుపుదల చేయాలంటూ వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరిస్తూ విచారణను మే 1కి వాయిదా వేసింది. వైసీపీ ఎమ్మెల్సీ, ఆ పార్టీ మండపేట అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి అయిన తోట త్రిమూర్తులుకు విశాఖ కోర్టు శిరోముండనం కేసులో 18 నెలల జైలు శిక్ష, రెండు లక్షల రూపాయల జరిమానా విధించిన సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత, నవ్యాంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ శవంలా మిగిలింది. అడ్డదిడ్డంగా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏనాటికీ క్షమించరు.
మలేసియా రాజధాని కౌలా లంపూర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. మలేసియా నావికాదళానికి చెందిన రెండు హెలికాప్టర్లు ఆకాశంలోనే ఢీకొన్నాయి
జగన్ పేరు చెప్పగానే ఎవరికైనా ఎం గుర్తుకు వస్తుంది. ముఖ్యమంత్రి హోదా. తననూ తన అధికారాన్ని, తన ప్రభుత్వ విధానాలనూ వ్యతిరేకించిన వారిపై అక్రమ కేసులు బనాయించడం, అరెస్టు చేయించడం, ఇంకా కోపం తగ్గకపోతే రఘురామరాజుపై జరిగినట్లు థర్డ్ డిగ్రీ ప్రయోగించేలా పోలీసులను ఆదేశించడం.
రోజా.. రాజకీయ నాయకురాలిగా మారిన నటి. ఏపీ పర్యాటకశాఖ మంత్రి. రెండు సార్లు ఎమ్మెల్యే. ఒకసారి ఏపీఐఐసీ చైర్ పర్సన్. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్. ఆమె తెలుగుదేశంలో ఉన్నా.. వైసీపీలో ఉన్నా.. ప్రత్యర్థులపై విరుచుకుపడడంలో దిట్ట.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.