జైలులో రఘురామ హత్యకు కుట్ర చేశారా? బెంగళూరు ఖైదీ ఎవరు? అసలేం జరిగింది? 

Publish Date:Dec 27, 2021

Advertisement

వైసీపీ ప్రభుత్వానికి, సీఎం జగన్ కు కొరకరాని కొయ్యగా మారారు నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు. ప్రభుత్వ వైఫల్యాలు, వైసీపీ నేతల అవినీతిని బయటికి తీస్తూ సంచలనంగా మారాయి. రఘురామ కృష్ణం రాజు ఎప్పుడు ఏ విషయం బయటపెడతారో తెలియక వైసీపీ నేతలు వణికిపోతున్నారు. అయితే గతంలో ఎంపీ రఘురామను ఏపీ సీఐడీ అరెస్ట్ చేసింది. జైలుకు కూడా పంపింది. ఆ సమయంలో జరిగిన పరిణామాలు తీవ్ర సంచలనం రేపాయి. తనను పోలీసులు కొట్టారంటూ రఘురామ చేసిన ఆరోపణలు, ఆయన కాళ్లకు దెబ్బలు కనిపించడం కలకలం రేపింది. 

అయితే తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్లూలో తన అరెస్ట్, దాడి, జైలులో జరిగిన పరిణామాలను వివరించారు రఘురామ రాజు. సంచలన విషయాలు చెప్పారు. జైలులో తనను హత్య చేసేందుకు కుట్ర జరిగిందని చెప్పారు. తనను హైదరాబాద్ లో అదుపులోకి తీసుకొని ఏపీకి తీసుకెళ్లిన పోలీసులు.. జైలుకు తరలించే క్రమంలోనూ రూల్స్ ను పాటించలేదని చెప్పారు ఎంపీ రఘురామ కృష్ణం రాజు. పక్కా స్కెచ్ ప్రకారం జైలుకు రప్పించారన్నారు. 

ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఏం చెప్పారంటే.. ‘‘ఇది ఇప్పటి వరకూ ఎక్కడా చెప్పని విషయం. ఇప్పుడే చెబుతున్నా. నన్ను జైలుకు తీసుకెళ్లినప్పుడు మేజిస్ట్రేట్ రెండు ఆస్పత్రులకు తీసుకెళ్లి రిపోర్టు ఇవ్వమని చెబితే... గుంటూరు ఆస్పత్రిలో పరీక్షలు చేయించి మేజిస్ట్రేట్ దగ్గరకు తీసుకెళ్లకుండా నేరుగా జైలుకు తీసుకెళ్లారు. అదేంటి.. ఇక్కడకు తెచ్చారేంటని అడిగితే ’ఏయ్ దిగవోయ్’ అంటూ నెట్టేశారు. చాలా నీచంగా మాట్లాడారు. అలా చేస్తే ఇక్కడొక ఆత్మ.. తాడేపల్లి ఆత్మ పరవశిస్తుందని అలా చేశారు’’

‘‘జైలుకు వెళ్లాక.. అన్నీ కొత్తగా ఉన్నాయి. ‘ఈ గదిలోనే జయదేవ్గారిని పెట్టాం. మా జైలులో ఉన్న మంచి రూమ్ ఇదే’ అని చెప్పారు. నాకు స్నానం చేయడానికి కుర్చీ కావాలని అడిగాను. నిలబడే నడిచే పరిస్థితి లేదు కదా! జైలులో ఎప్పుడూ కరెంట్ పోదట. కానీ ఆ రోజు పోయింది. జనరేటర్ ఎప్పుడూ పని చేస్తుందట! ఆ రోజు పని చేయలేదు.కటకటాలకు దగ్గరగా మంచం వేసుకుని పడుకుందామని అనుకుంటుండగా కరెంట్ పోయింది. దాంతో మంచం వెనక్కి లాక్కుని పడుకున్నా. ఇంతలో కరెంట్ వచ్చింది. బయట లైట్ వేసే ఉంచమని సెంట్రీతో చెప్పి పడుకున్నా. అంతలో మళ్లీ కరెంట్ పోయింది. మళ్లీ లేచి మంచాన్ని దూరంగా జరుపుకొన్నా.. తర్వాతి రోజు పొద్దున్నే ఒక ఖైదీ నీళ్లు తెచ్చి ఇస్తే స్నానం చేశాను. నేను బయటకు వచ్చిన నెల తర్వాత ముస్లిం పేరుతో ఉన్న నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. ఆ నంబరు డీపీ ఏమో జగన్ బొమ్మ ఉంది. ఎవరో తిట్టడానికే ఫోన్ చేసి ఉంటారని తీయలేదు. అదేపనిగా 20 30 కాల్స్ వచ్చాయి. చివరకు ఫోన్ ఎత్తాను. ‘సార్ నేను.. మీకు జైల్లో నీళ్లు ఇచ్చాను కదా’ అని పరిచయం చేసుకున్నాడు’’

‘‘నువ్వు  జైలుసిబ్బందివా లేక అండర్ ట్రయల్ ఖైదీవా అని అడిగాను. చెక్ బౌన్స్ కేసులో నన్ను జైలుకు పంపారు.. మీరు వచ్చేసిన తర్వాత రెండు రోజులకు బయటకు వచ్చాను అన్నాడు. ఏం చేస్తుంటావని అడిగాను. బెంగళూరులో జగన్ ఇంటిలో పనిచేస్తానని అన్నాడు. అతడు చెప్పింది నిజమో కాదో తెలియదు. కానీ అది వినగానే కళ్లు బైర్లు కమ్మాయి. బెంగళూరులో పని చేయడం ఏమిటి? గుంటూరులో చెక్ బౌన్స్ ఏమిటని అడిగాను. ‘అవన్నీ అడగొద్దు సర్. మీరంటే నాకు అభిమానం. కొంచెం జాగ్రత్తగా ఉండండి’ అని చెప్పాడు. 

‘‘నన్ను ఫలానా తారీఖున అరెస్టు చేసి ఇక్కడకు పంపాలని ముందుగానే స్కెచ్ వేసుకున్నారు. నన్ను జైలుకు పంపడానికి రెండ్రోజుల ముందే అతడిని జైలుకు పంపడం అనుమానాస్పదంగా ఉంది. తర్వాత అతను నాకు టచ్ లో లేడు. అతను నెంబరు కూడా మార్చినట్లున్నారు’’అని రఘురామ రాజు చెప్పారు.  

By
en-us Political News

  
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.