ఉచిత హామీలను లంచాలుగా పరిగణించాలంటూ సుప్రీంలో పిటిషన్

Publish Date:Oct 16, 2024

Advertisement

ఎన్నికల సమయంలో రాజకీయపార్టీలు ఉచితాలను ప్రకటించడం సర్వసాధారణంగా మారిపోయింది. అయితే అలా ఉచితాలను ప్రకటించడాన్ని లంచాలుగా ప్రకటించాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్ ను సుప్రీం విచారణకు స్వీకరించింది. రాజకీయపార్టీలు ప్రకటించే ఉచితాలను లంచాలుగా ప్రకటించాలని  బెంగుళూరులో చెందిన శశాంక శ్రీధర ఆ పిటిషన్  దాఖలు చేసారు. ప్రధానన్యాయమూర్తి చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆ పిటిషన్ ను విచారించనుంది.లోక్ సభ,అసెంబ్లీ ఇతర ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచితాలను కట్టడి చేసి కఠినచర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని ఆ పిటిషన్ లో శ్రీధర పేర్కొన్నారు. గతంలో ధాఖలైన పిటిషన్లను కూడా పరిగణలోకి తీసుకుని అన్నీ కలిపి విచారణ చేస్తామని ధర్మాసనం తెలిపింది.  ఉచితాలపై అభిప్రాయం తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్ కు నోటీసులు జారీ చేసింది.

ఉచితాలపై చాలా కాలం నుంచి విమర్శలువస్తున్నాయి. ఉచితాలు ఓటర్లను ప్రలోభపెట్టే సాధనంగా  పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.ఉచితాలపేరుతో ప్రజలను పనిదొంగలుగా ఈ ప్రభుత్వాలు తయారు చేస్తున్నాయని, ఉపాధి కల్పించాల్సి ఉండగా ఉచితాలపేరుతో  వారిని ప్రలోభాలకు గురి చేస్తున్నారు.అలాగే ఈ ఉచిత హామీల అమలు పేరు చెప్పి ప్రభుత్వాలు ఖజానాను ఖాళీ చేస్తున్నాయి. 
గత వైసీపీ హయాంలో రాష్ట్ర ఆదాయం మొత్తం ఈ ఉచితాల అమలుకే సరిపోయిందని,ఫలితంగా అభివృద్ధికి చోటులేకుండా పోయిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. రాజకీయ పార్టీలు అధికారంలోకి రావడానికి అలవి కాని హామీలు ఇస్తున్నాయి.ఆ తరువాత వాటిని అమలు జరిపే విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ రుణమాఫీ అమలు పూర్తిస్థాయిలో జరగలేదని విపక్షాలు ఆందోళనకు దిగిన విషయం విదితమే.

అలాగే ఇంతవరకూ రైతుబంధు ప్రకటించలేదు.  ప్రభుత్వాలు పేదలకుచేయూత ఇవ్వాలి.   ఉచి తాలతో కాకుండా ఉపాధి కల్పిస్తే వారు  వారి కాళ్లమీద వారు నిలబడతారు. అయితే రాజకీయపార్టీలు దొడ్డిదారిని ఎంచుకుని దీర్ఘకాలిక ప్రయోజనాలు వదిలేస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో రాజధాని నిర్మించడానికి నిధులులేక,కేంద్రాన్ని అడగలేక మూడు రాజధానుల పేరుతో కాలయాపన చేసిన విషయం తెలిసిందే. విద్య,వైద్యం ప్రభుత్వ అధీనంలో ఉండాలని రాజ్యాంగకర్తలు ఆశించారు. ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఒక చిన్నారిని ఎల్కేజీ లో చేర్చాలంటే లక్షలు ఖర్చవుతున్నాయి. జ్వరం వస్తే పరీక్షల పేరుతో వేలరూపాయలు ఖర్చవుతున్నాయి.వీటిని తట్టుకునే స్తోమత పేద,మధ్య తరగతి ప్రజలకు ఉండడంలేదు.దిగువ, మధ్యతరగతి వారికి ఉన్నత చదువులు అందని దాక్షగా మారుతున్నాయి. ప్రభుత్వ బడులు, వైద్యశాలలు నామమాత్రంగా మారుతున్నాయి ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. ఇవన్నీ ప్రభుత్వ ఖర్చు ఉచితాలకే సరిపెట్టడం వల్ల జరుగుతున్నదనే విమర్శలు ఉన్నాయి.ఉచితాలు లేకపోతే రాష్ట్రాల ఆర్ధిక పరిస్థితి ఇంతగా దిగజారదు.  ఉపాధి పెంచే పథకాలు మినహా ఇతర హామీలనూ ప్రలోభాలుగా పరిగణించాలన్న డిమాండ్ జనబాహుల్యంలో వినిపిస్తోంది. 

By
en-us Political News

  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
ఏకంగా 21 పెళ్లిళ్లు చేసుకున్న బెగ్గర్.!
భారతీయ రాజకీయాల్లో ప్రస్తుతం ప్రధాన ఎన్నికల సంఘం (సీఈసీ) జ్నేಶ್ కుమార్ రాజీనామా డిమాండ్ కలకలం రేపుతోంది.
ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానంలో పవర్ బ్యాంక్‌లో మంటలు చెలరేగడం కలకలం రేపింది.
గోవా కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్‌ దందా హైదరాబాద్‌ వరకు విస్తరించినట్లు పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
చంద్రబాబు అరెస్ట్ సమయంలో రోడ్డెక్కింది మేమే.. డిప్యూటీ సీఎం.!
పాత కరెన్సీ నోట్లకు భారీ మొత్తంలో డబ్బులు చెల్లిస్తామంటూ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చి అమాయకులను మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్ల
దేశ రాజధానిలో నిరసనల నేపథ్యంలో విధించిన కఠిన నిబంధనలపై సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది.
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహసీల్దార్ కార్యాలయంలో చోటుచేసుకున్న ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
ఆడుతూ పాడుతూ గడపాల్సిన వయసులోనే ఐదేళ్ల చిన్నారి అరేలియా జీవితం విషాదాంతమైంది.
భర్త మంచానికే పరిమితమయ్యాడు.. కుటుంబ బాధ్యతలు ఓవైపు.. జీవితంలో ఎదురైన కష్టాలు మరోవైపు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.