ఏపీ కేబినెట్ భేటీకి జనసేన మంత్రుల గైర్హాజర్: అసలేం జరుగుతోంది.?

Publish Date:Oct 11, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం శనివారం (అక్టోబర్ 10) జరిగింది. కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోవడమే లక్ష్యంగా జరిగిన ఆ కేబినెట్ భేటీకి జనసేన మంత్రులు ముగ్గురు గైర్హాజర్ కావడం పొలిటికల్ గా సంచలనంగా మారింది. స్థానిక ఎన్నికల వేళ సీట్ల సర్దుపాట్లే ఇందుకు కారణమన్న ప్రచారం జోరుగా సాగింది. మొత్తం మీద కేబినెట్ భేటీకి జనసేన మంత్రుల సామూహిక గైర్హాజర్ హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రరాజకీయ సమీకరణాల్లో మార్పు అంటూ రాజకీయవర్గాలలో ఊహాగాన సభలు కూడా జరిగాయి. 

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.

ఈ నేపథ్యంలోనే ఈ గైర్హాజర్ పై పలు రకాల విశ్లేషణలు వెల్లువెత్తాయి. అయితే జనసేన మంత్రుల గైర్హాజరీ వెనుక రాజకీయ వివాదం కానీ, తెలుగుదేశం కూటమి ప్రభుత్వ నిర్ణయాలపై అసంతృప్తి కానీ లేదని ఆ తరువాత స్పష్టమైంది. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కార్యాలయం జనసేన మంత్రుల గైర్హాజర్ పై అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చింది.   మహాలయ అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని పితృదేవతలకు సంప్రదాయబద్ధంగా నిర్వహించాల్సిన   తర్పణాల విధుల్లో ఉదయం నుంచి ఆయన నిమగ్నమై ఉండటం వలనే మంత్రివర్గ సమావేశానికి జనసేన మంత్రులు హాజరుకాలేకపోయారని జనసేన వివరించింది.  

ఇటీవల కాలంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలు, నామినేటెడ్ పదవుల భర్తీ తదితర అంశాలపై కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయ చర్చలు జరుగుతున్న తరుణంలో, కేబినెట్ భేటీకి జనసేన మంత్రుల గైర్హాజర్ పలు సందేహాలకు తావిచ్చింది. జనసేన, తెలుగుదేశం మధ్య విభేదాలన్న చర్చ మొదలైంది. అయితే జనసేనాని కార్యాలయం ఓ ప్రకటన ద్వారా క్లారిటీ ఇవ్వడంతో ఆ  చర్చకు ఫుల్ స్టాప్ పడింది. 


[Janasena Ministers Abscent Cabinet Meeting, AP Cabinet Meeting, Pawan Kalyan, Chandrababu Naidu, Differences, Rumours,TeluguOne News]

By
en-us Political News

  
దేశ రాజధానిలో నిరసనల నేపథ్యంలో విధించిన కఠిన నిబంధనలపై సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది.
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహసీల్దార్ కార్యాలయంలో చోటుచేసుకున్న ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
ఆడుతూ పాడుతూ గడపాల్సిన వయసులోనే ఐదేళ్ల చిన్నారి అరేలియా జీవితం విషాదాంతమైంది.
భర్త మంచానికే పరిమితమయ్యాడు.. కుటుంబ బాధ్యతలు ఓవైపు.. జీవితంలో ఎదురైన కష్టాలు మరోవైపు
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
విశాఖపట్నంలో అర్ధరాత్రి వేళ హైవేపై జరిగిన కార్ ఛేజింగ్‌ కలకలం రేపింది.
దేశ రాజధాని ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతల అరెస్టు వ్యవహారం తీవ్ర చర్చకు దారితీసింది
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అక్టోబర్ 13న ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించే అవకాశం ఉందన్న వార్తలు రాజకీయ, జలవనరుల వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
జాతీయ రాజధాని ఢిల్లీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర రాజకీయ ఉద్రిక్తతలు నడుస్తున్న వేళ, కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.
శ్రీవారికి జైపూర్ దంపతులు రూ.51.55 లక్షల ఆభరణాల కానుక.!
గోల్డ్ కొనాలన్న ఆశ.. బిడ్డను కోల్పోయిన విషాదం.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.