కాంగ్రెస్ టార్గెట్ @90!

Publish Date:Nov 20, 2023

Advertisement

తెలంగాణలో కాంగ్రెస్ జోష్ మామూలుగా లేదు. తెలంగాణ ఆవిర్భావం తరువాత వరుసగా రెండు ఎన్నికలలో పరాజయం పాలై అధికారానికి దూరమైన ఆ పార్టీ ఈ సారి అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నది. కర్నాటకలో విజయం తరువాత.. తెలంగాణలో వైనాట్ పవర్ అన్న పట్టుదలతో అడుగులు వేస్తున్నది. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ పార్టీ పగ్గాలు అందుకున్న నాటి నుంచీ కూడా రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ శ్రేణులలో కొత్త ఉత్సాహం కొట్టొచ్చినట్లు కనిపిస్తూ వచ్చింది. అయితే సీనియర్లు తొలుత రేవంత్ నాయకత్వం పట్ల విముఖతతో అసమ్మతి రాగం ఆలపించినా.. ఆ తరువాత అధిష్ఠానం జోక్యంతో అంతా సర్దుకున్నట్లు కనిపిస్తున్నది. అక్కడక్కడా అసమ్మతి గళం గొణుగుడు వినిపించినా.. క్యాడర్ దానిని పట్టించుకోకుండా ఉత్సాహంగా ప్రచారంలో ముందుకు దూకుతున్నారు. ఇక పోలింగ్ తేదీ రోజుల వ్యవధిలోకి వచ్చేయడంతో మరింత పకడ్బందీగా, ప్రణాళికా బద్ధంగా ప్రచార వ్యూహాన్ని రచించుకున్న కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికలలో కనీసం 90 స్థానాలలో విజయం సాధించడమే టార్గెట్ గా పెట్టుకుంది. అందుకు అనుగుణంగానే రాష్ట్ర వ్యాప్తంగా గెలుపు అవకాశాలు ఉన్నట్లు గుర్తించిన 90 నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఆ 90 నియోజకవర్గాలలోనూ విస్తృత ప్రచారానికి కార్యాచరణ రూపొందించింది. 

ప్రచారం తుది దశకు చేరుకున్న నేపథ్యంలో.. కాంగ్రెస్ అగ్రనాయకులంతా రంగంలోకి దిగే విధంగా ప్లాన్ చేసింది.  రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గేతో పాటు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, భూపేష్ పటేల్, చిదంబరంతో పాటు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ సీఎంలు కూడా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. 

ఇక ఇటీవలే బీజేపీని వీడి కాంగ్రెస్ గూటికి చేరిన ఫైర్ బ్రాండ్ పొలిటీషియన్, మాజీ ఎంపీ విజయశాంతి కూడా కాంగ్రెస్ తరఫున ముమ్మరంగా ప్రచారం చేయనున్నారు. ఇక కేంద్ర మాజీ మంత్రులు, మాజీ సీఎంలు కూడా తెలంగాణలో ప్రచార పర్వంలో పాల్గొనేందుకు రానున్నారు. ఈ నెల 22 నుంచి కాంగ్రెస్ అగ్రనేతలు తెలంగాణ ప్రచారంలో పాల్గొనేందుకు సుడిగాలి పర్యటనలకు షెడ్యూల్ ఖరారైంది. 
 కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అలంపూర్, నల్లగొండలో ఈ నెల 22న ప్రచారం చేయనున్నారు. అలాగే  విజయశాంతి ఖమ్మం, మహబూబ్ నగర్‌తో పాటు గ్రేటర్ హైదరాబాద్  నియోజకవర్గాల్లో పర్యటించి కాంగ్రెస్ లో జోష్ నింపనున్నారు. అదే విధంగా ఇతర అగ్రనేతల పర్యటన షెడ్యూల్ కూడా ఖరారైంది.  రాష్ట్రంలో ప్రతి ఇంటికీ కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు, మేనిఫెస్టోలోని కీలకాంశాలనూ చేరవేయడమే లక్ష్యంగా పార్టీ ప్రచార కార్యక్రమం రూపొందించినట్లు పార్టీ రాష్ట్ర నాయకత్వం చెబుతోంది. ప్రస్తుత టెంపో ఏ మాత్రం సడలకుండా కొనసాగేలా ప్రచారపర్వాన్ని కొనసాగించేలా కాంగ్రెస్ ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నది.  పార్టీ హామీలనే కాకుండా.. గత తొమ్మదేళ్ల కేసీఆర్ పాలనా వైఫల్యాలను కూడా ప్రజలలో ఎండగట్టే విధంగా కాంగ్రెస్ ప్రచారం ఉండాలన్న నిశ్చయంతో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగానే తెలంగాణ ఇచ్చిన అమ్మగా సోనియా గాంధీని కూడా రాష్ట్రంలో ప్రచారానికి తీసుకురావాలని యోచిస్తున్నది. పార్టీ రాష్ట్ర నాయకత్వం ప్రతిపాదనకు సోనియా కూడా సానుకూలంగా స్పందించినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.  

ఒక వేళ ఏ కారణం చేతనైనా సోనియా రాష్ట్ర పర్యటనకు రాలేని పరిస్థితి ఏర్పడితే..  ఆమె ఒక ప్రత్యేక వీడియో ద్వారా  తెలంగాణ ఇచ్చిన పార్టీకి ఒక్క చాన్స్ ఇవ్వండి అంటూ సోనియాగాంధీ చేత రాష్ట్ర ప్రజలకు ఓ పిలుపు ఇచ్చేలా కాంగ్రెస్ ప్రణాళిక రచిస్తోంది.  

By
en-us Political News

  
విజయవాడలో ప్రతిష్ఠాత్మక రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఆన్‌లైన్ పరిచయం.. చాటింగ్‌తో స్నేహం.. వీడియో కాల్స్‌తో నమ్మకం.. ఆ తర్వాత ఇంటికి ఆహ్వానం. అంతా సజావుగా సాగుతున్నట్లే కనిపిస్తుంది. కానీ ఆ పరిచయాల వెనుక ఉన్నది స్నేహం కాదు
హైదరాబాద్ వేదికగా ఇటీవల జరిగిన భారత్ సమ్మిట్‌ 2026లో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
సినిమాను తలపించిన నగల దొంగతనం..పట్టించిన పచ్చబొట్టు.!
హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా బిర్యానీ ప్రియులకు భారీ షాక్ తగిలింది.
ప్రియుడి హత్యకు 19 ఏళ్ల యువతి సుపారీ.. షాకింగ్ ట్విస్ట్.!
దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడానికి స్వస్థలానికి వచ్చిన ఓ యువతికి మృత్యువు అనూహ్య రీతిలో ఎదురైంది.
హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే కార్తీక మాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
తీపి పదార్థమనుకుని నోట్లో పెట్టుకున్నాడు.. చివరకు విగతజీవిగా మారాడు!
డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న గిగ్ వర్కర్ల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.