హద్దుల్లేని అహంకారానికి నిలువెత్తు నిదర్శనం!

Publish Date:Nov 20, 2023

Advertisement

ఒక జట్టుగా ఆస్ట్రేలియా క్రికెట్ ప్రపంచంలో తిరుగులేనిది అయి ఉండొచ్చు. జట్టులో ఆటగాళ్లంతా  సమష్టిగా విజయం కోసం సర్వశక్తులూ ధారపోసి ఉండోచ్చు. నైపుణ్యం కలిగిన జట్టుగా ఆసీస్ జట్టను అంతా గౌరవిస్తారు. అయితే ఆటగాళ్ల అహంభావాన్ని, అహంకారాన్ని మాత్రం ప్రతి ఒక్కరూ వేలెత్తి చూపుతూనే ఉంటారు. క్రీడా స్ఫూర్తి అన్న పదానికి ఆసీస్ జట్టు మినహాయింపు అనే అంతా అంటారు. ఆసీస్ తో  ఆడిప ప్రతి జట్టూ ఈ విషయాన్ని ఎలాంటి దాపరికాలూ, బేషజాలూ, మోహమాటాలూ లేకుండా అంగీకరించేస్తుంది.

 విజయం దూరమౌతోందంటే.. ఆ జట్టులో ఏ మాత్రం క్రీడా స్ఫూర్తి కనిపించదు. ఇందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ముఖ్యంగా బలమైన జట్టుతో తలపడుతున్నామని భావిస్తే చాలు ముందు ప్రత్యర్థి జట్టును సైకిలాజికల్ గా దెబ్బతీసే వ్యూహంతో నోటికి పని చెబుతారు. జట్టు మానసిక స్థైరం దెబ్బతీయడమే లక్ష్యంగా మీడియా సమావేశాలలో మాట్లాడతారు. స్లెడ్జింగ్ కు పాల్పడతారు. మ్యాచ్ కు ముందు హీట్ పెంచేసి ప్రత్యర్థి జట్టును ఒత్తిడిలోకి నెట్టేస్తారు. మైదానం బయట ఆసీస్ జట్టు సభ్యులు చేసే ఇవేవీ ఆటలో భాగం కాదు. కానీ ప్రత్యర్థుల ఏకాగ్రతను దెబ్బ తీసే విధానాలు అనడంలో సందేహం లేదు. ఇక మైదానంలో కూడా ఆసీస్ ఆటగాళ్ల నిబద్ధత, నిజాయితీ ఎప్పుడూ ప్రశ్నార్ధకంగానే ఉంటుంది. 

స్కిప్పర్ గా బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడినందుకు స్టీవెన్ స్మిత్, అతడికి సహకరించినందుకు డేవిడ్ వార్నర్ లపై వేటుపడిన సంగతి తెలిసిందే. అలాగే  రివ్యూ  కోరుకోవడమనేది పూర్తిగా మైదానంలో ఉన్న జట్టుకు సంబంధించిన విషయం. అందులో మైదానం బయట ఉండే హెల్ప్ స్టాఫ్ కు ఏ పాత్రా ఉండదు. కానీ స్మిత్ ఆ రివ్యూ తీసుకోవాలా వద్దా అన్న నిర్ణయం తీసుకోవడం కోసం కోసం పదే పదే డ్రెస్సింగ్ రూమ్ వైపు చూడటం, అక్కడ నుంచి సైగల ద్వారా సంకేతాలు అందడం తెలిసిందే. అప్పట్లో టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దీనిపై ఫిర్యాదు కూడా చేశారు. ఆ రెండు సందర్భాలూ కూడా ఆస్ట్రేలియా, టీమ్ ఇండియా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్నప్పటివే. ఆటలో నైపుణ్యం విషయంలో ఆసీస్  క్రీడాకారులను ఎవరూ వంక పెట్టరు కానీ, క్రీడాస్ఫూర్తి, వ్యవహారశైలి విషయంలో ఆ ఆటగాళ్లకు ఎవరూ కనీసం పాస్ మార్కులు కూడా వేయరు.  

ఇక ఒక టోర్నమెంట్ కానీ, మ్యాచ్ కానీ గెలిచిన తరువాత ఆ జట్టు ఎంత అహంభావంగా వ్యవహరిస్తుందో చెప్పడానికి బోలెడు ఉదాహరణలు ఉన్నాయి. వాటిలో ఒకటి చెప్పుకోవాలంటే.. 2006లో ఆస్ట్రేలియా జట్టు చాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది. అప్పట్లో బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న శరద్ పవార్ జట్టు సారథికి ట్రోఫీ అందించారు. శరద్ పవార్ బీసీసీఐ అధ్యక్షుడే కాదు, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి, కేంద్ర మంత్రిగా కూడా కీలక బాధ్యతలు వహించారు. ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడు కూడా. అటువంటి సీనియర్ పొలిటీషిన్ ను కప్పు అందుకోగానే వేదిక మీదనే పక్కకు నెట్టేసి ఆసీస్ జట్టు సంబరాలు చేసుకున్న తీరుపై అప్పట్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఆ విమర్శలను పట్టించుకోవడం కానీ, పొరపాటు జరిగిందని క్షమాపణలు చెప్పడం కానీ ఆసీస్  ప్లేయర్లకు అలవాటే లేదు. 

తాజాగా 2023 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ లో టీమ్ ఇండియాపై ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఆరోసారి విశ్వవిజేతగా నిలిచింది. ప్రైజ్ డిస్ట్రీబ్యూషన్ అయిపోయిన తరువాత డ్రెస్సింగ్ రూంలో ఆసీస్ ఆటగాడు మిచెల్ మార్ష్ అంతకు ముందే గెలుచుకున్న వరల్డ్ కప్ పై దర్జాగా  కాళ్లు పెట్టి కూర్చుని బీరు తాగుతున్న ఫొటో వివాదాస్పదంగా మారింది. సామాజిక మాధ్యమంలో అందుకు సంబంధించి ఫొటో వైరల్ అయ్యింది. నెటిజన్లు మార్ష్ ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. మాజీ క్రికెటర్లు, లెజెండ్ లు కూడా మిచెల్ మార్ష్ తీరును తప్పుపడుతున్నారు. మార్ష్  తీరు క్రికెట్ కే అవమానమని అంటున్నారు. ఎవరేమనుకుంటే మాకేం అన్నట్లుగా ఆసీస్ తీరు ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి క్రికెట్ ఆస్ట్రేలియా ఎలా స్పందిస్తుందో చూడాలి.

By
en-us Political News

  
విజయవాడలో ప్రతిష్ఠాత్మక రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఆన్‌లైన్ పరిచయం.. చాటింగ్‌తో స్నేహం.. వీడియో కాల్స్‌తో నమ్మకం.. ఆ తర్వాత ఇంటికి ఆహ్వానం. అంతా సజావుగా సాగుతున్నట్లే కనిపిస్తుంది. కానీ ఆ పరిచయాల వెనుక ఉన్నది స్నేహం కాదు
హైదరాబాద్ వేదికగా ఇటీవల జరిగిన భారత్ సమ్మిట్‌ 2026లో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
సినిమాను తలపించిన నగల దొంగతనం..పట్టించిన పచ్చబొట్టు.!
హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా బిర్యానీ ప్రియులకు భారీ షాక్ తగిలింది.
ప్రియుడి హత్యకు 19 ఏళ్ల యువతి సుపారీ.. షాకింగ్ ట్విస్ట్.!
దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడానికి స్వస్థలానికి వచ్చిన ఓ యువతికి మృత్యువు అనూహ్య రీతిలో ఎదురైంది.
హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే కార్తీక మాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
తీపి పదార్థమనుకుని నోట్లో పెట్టుకున్నాడు.. చివరకు విగతజీవిగా మారాడు!
డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న గిగ్ వర్కర్ల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.