Publish Date:Dec 28, 2024
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కామారెడ్డి జిల్లా అడ్లూర్ ఎల్లారెడ్డిలోని పెద్ద చెరువులో ముగ్గురు దుర్మరణానికి మిస్టరీ వీడింది. బుధవారం అర్ధరాత్రి ముగ్గురు మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
Publish Date:Dec 28, 2024
ఈ నెల 30 తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రదానకార్యదర్శి శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
Publish Date:Dec 28, 2024
రాజకీయ నాయకులలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ది ఓ ప్రత్యేక శైలి. అవసరార్ధం ఆయన ఎంతకైనా తెగిస్తారు.. ఎంతకైనా దిగజారుతారని రాజకీయవర్గాలలో ఎప్పుడూ చర్చ జరుగుతూ ఉంటుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన ఒక సారి కాంగ్రెస్ తో జట్టు కట్టారు. ఆ తరువాత తెలుగుదేశం, బీజేపీలతో పొత్తు పెట్టుకున్నారు. ఇదేమిటని అడిగిన వారికి తన లక్ష్యం తెలంగాణ సాధన.. ఆ లక్ష్య సాధన కోసం అవసరమైతే బొంత పురుగును కూడా ముద్దెట్టుకుంటా అని సమాధానం ఇచ్చారు.
Publish Date:Dec 28, 2024
మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్ వైసీపీకి రాజీనామా చేశారు. కన్ ఫర్డ్ ఐఏఎస్ అయిన ఇంతియాజ్ అహ్మద్ గత ఎన్నికలకు ముందు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని వైసీపీ తీర్థం పుచ్చుకుని మరీ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికలలో ఆయన ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు.
Publish Date:Dec 28, 2024
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయంలో మన్మోహన్ పార్థీవ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు.
Publish Date:Dec 28, 2024
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ సంక్రాంతి తరువాత వెలువడే అవకాశం ఉంది. మొత్తం మూడు విడతల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. కాగా పంచాయతీ ఎన్నికలు బ్యాలెట్ పేపర్ ద్వారానే జరగనున్నాయి.
Publish Date:Dec 28, 2024
రేవంత్ సర్కార్, టాలీవుడ్ మధ్య తలెత్తిన వివాదం తెలంగాణ రాజకీయాలను ఒక్కసారిగా హీటెక్కించింది. పుష్ప-2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట చోటుచేసుకుని మహిళ మృతిచెందగా.. ఆమె తొమ్మిదేళ్ల కుమారుడు కోమాలో ఉండి చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన నేపథ్యంలో సినీ నటుడు అల్లు అర్జున్, థియేటర్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Publish Date:Dec 28, 2024
ఒక వైపు పేర్ని నాని కుటుంబంతో సహా పరారీలో ఉన్నారు. ఆయన భార్య పేర్ని జయసుధ పేరిట ఉన్న గోదాం నుంచి భారీగా రేషన్ బియ్యం మాయం అయినట్లు తేలడంతో ఆయన ఇక తప్పించుకునే మార్గం లేదని ఖరారు చేసుకునే కుటుంబంతో సహా పరారైనట్లు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
Publish Date:Dec 27, 2024
ఫార్ములా ఈ రేసు కేసులో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు ఉచ్చు గట్టిగానే బిగుస్తోంది. ఒక వైపు ఈ కేసులో ఏసీబీ ఎఫ్ఐఆర్ దాఖలు చేయడమే కాకుండా దర్యాప్తు కూడా ప్రారంభించింది.
Publish Date:Dec 27, 2024
కడప జిల్లా అంటేనే వైసీపీ కంచుకోట. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కడపలో మాత్రం జగన్ మాటే నెగ్గుతుంది. జగన్ పేరు చెప్పుకుని చెలరేగే వైసీపీ నేతలు ఆడిందే ఆట పాడిందే పాట. 2014లో వైసీపీ విపక్షంలో ఉన్నప్పుడూ అలాగే సాగింది. ఆ తరువాత వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ కడపలో వైసీపీయుల అరాచకం ఏ స్థాయిలో సాగిందో తెలిసిందే. ఆ తరువాత అంటే తెలుగుదేశం కూటమి సర్కార్ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత కూడా ఇటీవలి కాలం వరకూ వైసీపీ హవాయే నడిచింది.
Publish Date:Dec 27, 2024
తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది. వారానికి రెండు సార్లు వారి లేఖలకు అనుమతి ఇవ్వాలన్న నిర్ణయం తీసుకుంది.
Publish Date:Dec 27, 2024
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతం కావడం, కొత్త సంవత్సరం రానున్న నేపథ్యంలో భక్తులు తిరమలకు పోటెత్తుతున్నారు. శనివారం (డిసెంబర్ 28)ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 29 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.
Publish Date:Dec 27, 2024
పల్నాడు జిల్లా రొంపిచర్ల గ్రామ శివారులోని వేణుగోపాలస్వామి దేవాలయం వద్ద, వెళ్లే దారిలో గల నిర్లక్ష్యానికి గురైన క్రీ.శ. 10-13 శతాబ్దాల నాటి శిల్పాలు, శాసనాలను భద్రపరిచి, కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా, సిఈఓ, డా.ఈమని శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.