ఉప ఎన్నికల భయంతోనే జగన్ నేతలకు లాలన ?

Publish Date:Jan 25, 2012

Advertisement

హైదరాబాద్: ప్రస్తుత పరిస్థితుల్లో ఏ రకమైన ఎన్నికలనైనా ఎదుర్కోవడానికి అధికార కాంగ్రెసు పార్టీలోని కొందరు నేతల్లో భయం నెలకొందా అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.ఇరవై నాలుగు నియోజకవర్గాలకు ఒకేసారి ఉప ఎన్నికలు జరుగుతాయన్న సంకేతాలను కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహరాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్ ఇవ్వడంతో రాష్ట్ర కాంగ్రెస్‌లో కొందరిని ఉప ఎన్నికల భయం పట్టుకొన్నట్లుగా కనిపిస్తోంది. స్థానిక, సహకార, అసెంబ్లీ ఉప ఎన్నికల సమరానికి దిగడం ద్వారా పాలనపై ప్రజా నాడి తెలుసుకోవాలని కాంగ్రెసు అధిష్టానం భావిస్తుంటే ఆ పార్టీలోని కొందరు రాష్ట్ర నేతలు మాత్రం అందుకు ససేమీరా అంటున్నారట.  ఓటమిని తప్పించుకోవాలంటే ఉప ఎన్నికలు జరిగే అసెంబ్లీ సెగ్మెంట్ల సంఖ్యను ఎంత తగ్గిస్తే అంత బాగుంటుందన్న అభిప్రాయంతో వారు ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకు వీలుగా  వైయస్ జగన్ రెడ్డి వర్గం ఎమ్మెల్యేలను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారట.

ఐతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన జగన్‌ వర్గ ఎమ్మెల్యేలపై కఠిన వైఖరిని అవలంభించకుండా చివరి దశలో రాయబారాలు నడిపితే ప్రజల్లో పార్టీ పట్ల చులకన భావం నెలకొంటుందన్న అభిప్రాయం కాంగ్రెసులోని చాలామందిలో ఉంది. పైగా ఈ సమయంలో వేటు వేయకపోవడం అన్నది సాంకేతికంగా చెల్లుబాటు కాదని కొందరు నేతలు చెబుతున్నారు. వారిపై వేటు వేసేందుకు కొందరు, ఉప ఎన్నికల భయంతో బుజ్జగింపులకు మరికొందర ప్రయత్నాలు చేస్తున్నారన్న వాదనల నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి.

By
en-us Political News

  
టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన తాజా సంచలన చిత్రం ఇరుముడి చట్టపరమైన చిక్కుల్లో పడింది.
60 తులాల బంగారం, రూ.10 లక్షల నగదు అపహరణ.!
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
అవసరానికి ఆదుకుంటుందనే నమ్మకంతో ఓ వ్యక్తి ర్యాపిడో పార్సిల్ సేవలను ఆశ్రయించాడు.
బిగ్ బ్రదర్ ఆఫీసులో రియల్టర్‌కు ప్రత్యేక ఛాంబర్.. ఒక్క బిల్డర్ కోసం వేలాది కుటుంబాలను రోడ్డున పడేస్తారా?
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అమాయక యువతులను లక్ష్యంగా చేసుకుని గుట్టు చప్పుడు కాకుండా నడుపుతున్న మరో అక్రమ ఫెర్టిలిటీ రాకెట్‌ను పోలీసులు రట్టు చేశారు.  
.గరల్స్ హాస్టల్ ముసుగులో నిర్వహిస్తున్న అక్రమ ఫెర్టిలిటీ సెంటర్ బాగోతం వెలుగులోకి వచ్చింది. పక్కాగా అందిన సమాచారంతో హైదరాబాద్ ప్రకాశ్ నగర్ లో అమినీత గరల్స్ హాస్టల్ పై దాడి చేయడంలో అక్రమ ఫెర్టిలిటీ సెంటర్ గుట్టు రట్లైంది.
పలు ప్రాంతాలలో ఇప్పటికే  రోజూవారీ సరఫరా  నిలిపివేశారు. రోజు విడిచి రోజు మాత్రమే నీటిని సరఫరా చేస్తున్నారు. ముందు ముందు ఇది రెండు రోజులు, మూడు రోజులు. వారం రోజులకు కూడా పెరిగే అవకాశం ఉందని జలమండలి అధికారులే ఆఫ్ ది రికార్డ్ చెడుతున్నారు.
ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న జాతీయ స్థాయి నిరసన ర్యాలీకి తెలంగాణ నుంచి పార్టీ శ్రేణులను తరలించేందుకు ప్రత్యేక రైళ్లు కేటాయించకపోవడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో ప్రయాణికురాలు తోసివేయడంతో గాయపడిన టీజీఎస్‌ఆర్టీసీ కండక్టర్ ప్రవళికకు ప్రభుత్వం అండగా ఉంటుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు.
సీనియర్ ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) కోసం ప్రభుత్వానికి దరఖాస్తు సమర్పించారు. ఈ నిర్ణయం రాష్ట్ర పాలనా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  తదుపరి సీఎస్ రేసులో  ఉన్న జయేష్ రంజన్ వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకోవడం సంచలనంగా మారింది. 
మరీ ముఖ్యంగా హైదరాబాద్ పై చలిపులి పంచా విసిరింది.  ఉదయం పూట ఎండ తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటున్నా, రాత్రి వేళల్లో,  తెల్లవారుజామున చలి తీవ్రత భారీగా ఉంటోంది.  
కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మకల్ సల్ఫీ నగర్‌లో చోటుచేసుకున్న ఒక అంతులేని విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.