అనంత కాంగ్రెస్ లో అయోమయం

Publish Date:Apr 21, 2012

Advertisement

అనంతపురం శాసనసభ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల్లో ఎవరిని బరిలోకి దింపాలనే విషయంపై కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ టిక్కెట్టు కోసం రషీద్ అహ్మద్, రాగే పరుశురామ్, మల్లిఖార్జున, విజయభాస్కరరెడ్డి, రాజశేఖరరెడ్డి తదితరులు ప్రయత్నిస్తున్నారు. అయితే వీరికి అర్తబలంతో పాటు అంగబలం కూడా లేకపోవడంతో టిక్కెట్టు ఎవరికీ ఇవ్వాలనే విషయంపై అధిస్థానం ఆలోచనలో పడింది. నిజానికి అనంతపురం జిల్లా ఎంపి అనంతవెంకటరామిరెడ్డి కుటుంబంలో ఒకరికి టిక్కెట్టు ఇస్తే బాగుంటుందని అధిష్టానం యోచిస్తోంది. అయితే అనంతరామిరెడ్డి కుటుంబసభ్యులు ఎవరూ ఎన్నికల్లో పోటీచేయడానికి ఇప్పటి దాకా బహిరంగంగా సుముఖత వ్యక్తం చేయలేడు. అందువల్ల అనంతవెంకట రామిరెడ్డి సిఫార్సు చేసిన వ్యక్తికీ టిక్కెట్టు ఇవ్వాలని కాంగ్రెస్ అధిస్థానం భావించింది. కానీ, దీనికి కూడా అనంతవెంటక రామిరెడ్డి ముందుకు రావటం లేదు. తాను ఎవరి పేరునైనా సిఫార్సు చేస్తే అతన్ని గెలిపించుకోవాల్సిన భారంతో పాటు ఖర్చంతా తన నెత్తిమీద పడుతుందని ఆయన భయపడుతున్నట్లు తెలుస్తోంది. మరీ అర్థబలం, అంగబలం లేని అనామకులకు టిక్కెట్టు ఇస్తే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కకపోతే పార్టీ పరువుపోతుందని పార్టీ భావిస్తోంది.

By
en-us Political News

  
బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో నేలకూలిన చెట్టు, ధ్వంసమైన వాహనాలు..!
నాగోల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బండ్లగూడ ఆనంద్‌నగర్‌ చౌరస్తా సమీపంలో సోమవారం రాత్రి దారుణ హత్య చోటుచేసుకుంది.
సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్స్‌లో సెప్టెంబర్ 17న కేంద్ర ప్రభుత్వం అత్యంత ఘనంగా నిర్వహించనున్న
తెలంగాణలో రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు
మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు చెందిన ఎర్రవల్లి ఫామ్‌హౌస్ పరిసరాల్లో చోటుచేసుకున్న పసుపు నీళ్లతో శుద్ధి ఘటన ఇప్పుడు రాజకీయంగా చర్చనీ యాంశంగా మారింది.
వినాయక చవితి వేడుక లకు హైదరాబాద్‌ నగరం ముస్తాబవుతున్న వేళ.. బేగంబజార్‌లోని ఫీల్‌ఖానా ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
తెలంగాణ రాష్ట్రంలో వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి
వినాయక చవితి వచ్చిందంటే బాలాపూర్ పేరు ప్రత్యేకంగా వినిపిస్తుంది.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన అసెంబ్లీ ముట్టడి లేదా నిరసనల ఉద్రిక్తతలకు సంబంధించి దర్యాప్తు వేగవంతమైంది.
పెళ్లయి తొమ్మిది నెలలే.. కొత్త జీవితంపై ఎన్నో ఆశలు.. అప్పటికే గర్భం దాల్చిన భార్య.. కానీ భర్త అనుమానం ఆ కుటుంబం లో విషాదాన్ని నింపింది.
భాగ్యనగరంలో వైభవంగా వినాయక చవితి సంబరాలు.. ఖైరతాబాద్‌లో తొలిపూజ పూర్తి..!
సికింద్రాబాద్ పరిధిలోని అల్వాల్‌లో మైనర్ బాలికపై పలువురు యువకులు మూడు రోజులపాటు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది.
సికింద్రాబాద్ మౌలాలి సమీపంలో ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైలుపై కరెంట్ తీగలు తెగిపడటంతో ఒక్కసారిగా కలకలం రేగింది
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.