చిదంబరం రాజ్యసభ సభ్యత్వానికి కాంగ్రెస్ లో వ్యతిరేకత.. ఒక కుటుంబానికి ఒకే పదవి అంటూ అడ్డుపుల్ల

Publish Date:May 15, 2022

Advertisement

కాంగ్రెస్ చింతన్ శిబిర్ తీర్మానాలతో పార్టీకి ఏ మేరకు ప్రయోజనం కలుగుతుందన్నది రానున్న రోజుల్లో తేలుతుంది. అయితే ఆ పార్టీ సీనియర్ నాయకుడు పి. చిదంబరానికి మాత్రం తక్షణమే ఎదురు దెబ్బ తగిలేలా ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నారు. త్వరలో జరగనున్న రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలలో తమిళనాడు నుంచి పీ. చిదంబరం ను రాజ్యసభకు పంపాలని కాంగ్రెస్ హై కమాండ్ ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకుంది.

తీరా ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత పార్టీలోని ఆయన వ్యతిరేకులు చిదంబరం అభ్యర్థిత్వానికి మోకాలడ్డుతున్నారు. ఇందుకు వారు చిదంబరం తనయుడు కార్తి ఇప్పటికే ఎంపీగా ఉన్నందున తాజా చింతన్ శిబిర్ తీర్మానం మేరకు ఒక కుటుంబానికి ఒకే పదవి ప్రకారం చిదంబరంకు రాజ్యసభ టికెట్ ఇవ్వడం సరికాదన్న వాదనను తెరమీదకు తీసుకు వచ్చారు. చిదంబరం ను తమిళనాడు నుంచి రాజ్యసభకు పంపాలన్నది కాంగ్రెస్ హైకమాండ్ యోచన. త్వరలో జరగనున్న రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలలో తమిళనాడులో 6 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఆరింటిలో నాలుగు సునాయాసంగా  ఆ రాష్ట్రంలోని అధికార డీఎంకే గెలుచుకుంటుంది. మిత్రపక్షమైన కాంగ్రెస్ కు ఆ నాలుగింటిలో ఒక స్థానాన్ని కేటాయించేందుకు డీఎంకే అంగీకరించింది.

ఆ స్థానం నుంచే చిదంబరం రాజ్యసభకు ఎంపిక కావాల్సి ఉంది. సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కు ఆర్థిక అంశాలపై మంచి పట్టు ఉంది. మోడీ ఆర్థిక విధానాలకు ఎండగట్టడంలో దిట్ట.. అటువంటి నేత రాజ్యసభలో ఉంటే కాంగ్రెస్ వాణిని మరింత బలంగా వినిపిచే అవకాశం ఉంటుందన్నది పార్టీ అధిష్టానం భావిస్తున్నది. అయితే పార్టీలో  మాత్రం చిదంబరం పట్ల ఒక స్థాయిలో వ్యతిరేకత ఉంది.

ఆయన మేధో అహంకారం కారణంగా సీనియర్లు, జూనియర్లు అన్న తేడా లేకుండా పార్టీలో అందరూ చిన్నబుచ్చుకోవలసిన పరిస్థితిని పలుమార్లు ఎదుర్కొన్నారు. ఆ కారణంగానే బహిరంగంగా ఎవరూ ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడకపోయినా, మద్దతుగా నిలిచేందుకు కూడా ఎవరూ ముందుకు రారు.  ఇప్పుడు ఒక కుటుంబానికి ఒకే పదవి అన్న చింతన్ శిబిర్ తీర్మానాన్ని చూపుతూ పార్టీలో ఆయన రాజ్యసభ అభ్యర్థిత్వానికి వ్యతిరేకత ఎదురౌతున్నది. చివరికి పార్టీ అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందన్నది వేచి చూడాలి.

By
en-us Political News

  
చెన్నైలో బీఎస్ఎఫ్ నూతన భవనాలను ప్రారంభించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి
ప్రస్తుత కాలంలో డిజిటల్ మాధ్యమాలు విద్య, విజ్ఞానాన్ని ప్రజలకు మరింత చేరువ చేస్తున్నాయి.
ప్రజాస్వామ్య వ్యవస్థలో   నైతికత, విలువలు పలుచన అయిపోతున్నాయి.   ఏ పార్టీ నుంచి గెలిచామనే అంశంతో సంబంధం లేకుండా, వ్యక్తిగత ప్రయోజనాలు, అధికార కాంక్ష,  రాజకీయ లబ్ధికి మాత్రమే పెద్ద పీట వేస్తున్న నేతలే ఎక్కువగా కనిపిస్తున్నారు
గత కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఒకింత జోరు తగ్గించిన వంగవీటి రాధా.. ఉన్నట్టుండి జనసేనానిని తో భేటీ అవ్వడం, అదీ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల వేడి రగిలిన సమయంలో కలవడం వెనుక పక్కా వ్యూహం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఉద్యోగులను ఉత్సాహపరిచేందుకు ఓ యాజమాన్యం అనుసరించిన సరికొత్త మార్గం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో విపరీతంగా ఫాలోవర్స్, వ్యూయర్స్ సంపాదించాలనే పిచ్చి నేడు ఎంతోమంది యువతను తప్పుదారి పట్టిస్తోంది.
సొంత మేనకోడలు నిశ్చితార్థానికి వైఎస్ జగన్ హాజరుకాకపోవడంపై రాజకీయవర్గాలలోనే కాదు.. సామాన్య జనంలో కూడా చర్చ జరుగుతోంది. గతంలో షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ నిశ్చితార్థానికి జగన్ దంపతులు హాజరైన సంగతిని పలువురు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పింఛనుదారులకు కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
స్నేహితులే కదా అని నమ్మాడు.. వాళ్లు ఫోన్ చేసి పిలిస్తే ఏదో మాట్లాడుకుందామని ఇంటి నుంచి బయటకు వచ్చాడు. కానీ అదే అతడి చివరి అడుగైంది.
భారతదేశంలో కోట్లాది మంది నిత్యం వినియోగిస్తున్న డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్‌లోని ప్రముఖ ఐటీ కారిడార్‌ అయిన మాదాపూర్‌లో ఇటీవల వెలుగుచూసిన ఓయో హోటల్ యువతి అనుమానాస్పద మృతి ఉదంతం అత్యంత నాటకీయ పరిణామాల మధ్య కొత్తలుపులు తెరుస్తోంది.
హైదరాబాద్ మహానగరంలో వినాయక చవితి నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా ముగిశాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.