పార్టీని తాకట్టుపెట్టలేదు..అమ్ముకోలేదు:బాలయ్య

Publish Date:Jan 23, 2012

Advertisement

విశాఖపట్నం: కాంగ్రెస్ నేత చిరంజీవి, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డిపై సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ నేత నందమూరి బాలకృష్ణ  ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో పార్టీ టిక్కెట్లను తాను అమ్ముకోలేదన్నారు. అలాగే, అధికారం కోసం పార్టీని సైతం తాకట్టుపెట్టలేదని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవికి చురక అంటించారు.వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కూడా పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు. విశాఖపట్నం జిల్లా పెదవాల్తేరులో ఆయన  స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. వైయస్ రాజశేఖర రెడ్డిపై విమర్శలు చేస్తూ, ఎన్టీ రామారావు సంక్షేప పథకాలను ప్రస్తావిస్తూ ఆయన ప్రసంగం సాగింది. విగ్రహాల రాజకీయాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రాన్ని దోచేసినవారికి విగ్రహాలు నెలకొల్పుతున్నారని ఆయన వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాల స్థాపనపై వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ కోసం తాను శ్రమిస్తానని ఆయన చెప్పారు. విశాఖ సభలో స్థానిక సమస్యలను కూడా ఆయన ప్రస్తావించారు.

తనను నటుడిగా ఆదరించారని, రాజకీయాల్లోనూ ఆదరించాలని ఆయన కోరారు. కార్యకర్తలు, అభిమానులు వేరు కాదని ఆయన అన్నారు. సినీరంగంలో ఎన్టీ రామారావు మగధీరుడని ఆయన అన్నారు. ప్రతిపక్షాలను ఏకం చేసి అధికార కాంగ్రెసును ఓడించిన ఘనత ఎన్టీ రామారావుదని ఆయన అన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో అపహాస్యం చేస్తున్న సమయంలో తెలుగు జాతిని ఉత్తేజపరిచి, తెలుగు కీర్తిపతాకను ప్రపంచ నలుదిశలా వ్యాపింపజేసిన మహా నాయకుడు ఎన్టీ రామారావు అని ఆయన అన్నారు. ప్రస్తుతం అమలు చేస్తున్న రూపాయికి కిలో బియ్యం పథకం ఆనాడు ఎన్టీఆర్ రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం నుంచి పుట్టిందేనని ఆయన అన్నారు.బడుగు బలహీన వర్గాలను ఆదుకునే నాథుడు లేని సమయంలో ఎన్టీ రామారావు నిస్వార్థ సేవా కాంక్షతో రాజకీయాల్లోకి వచ్చి తొమ్మిది నెలల వ్యవధిలోనే కాంగ్రెసు పార్టీని ఓడించి ముఖ్యమంత్రి అయ్యారని ఆయన అన్నారు. అన్ని రంగాల్లోని ప్రతిభావంతులను గుర్తించి వారికి తగిన స్థానాలు కల్పించారని ఆయన అన్నారు.  ఎన్టీఆర్ కాలిగోటికి ఎవరూ సరిపోరన్నారు. కొందరు నన్ను బాలుడు అన్నారని, ఐతే అలాంటి వారు తనను ఒకవైపే చూశారని రెండోవైపు ఇంకా చూడలేదన్నారు.

By
en-us Political News

  
సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో, అంతే స్థాయిలో నేరగాళ్ల అక్రమ మార్గాలు కూడా పెరిగిపోతున్నాయి.
విధి నిర్వహణలో నిత్యం బిజీగా ఉంటూ.. ఎండ, వాన, పగలు, రాత్రి తేడా లేకుండా ప్రజల రక్షణ కోసం శ్రమించే పోలీసుల ఆరోగ్యంపై తెలంగాణ పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది.
రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపిన ఒక అనూహ్య ఘటనలో, నకిరేకల్ శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ వేముల వీరేశంకు పెను ప్రమాదం తృటిలో తప్పింది.
హైదరాబాద్ పాతబస్తీలో మైనర్ బాలుడిపై లైంగిక వేధింపుల ఘటన తీవ్ర కలకలం రేపింది.
బాధితుల కోర్టు ధిక్కరణ పిటిషన్ విచారించిన  హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.వి. భాస్కర్ రెడ్డి  చట్టాన్ని రక్షించాల్సిన బాధ్యతలో ఉన్న ఒక పోలీసు అధికారి  కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడం గర్హనీయమని పేర్కొంటూ,  కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ధిక్కరించిన సీఐకు శిక్ష  విధించింది.  
తెలంగాణ రాష్ట్రంలో యాదవ సోదరుల ఆత్మగౌరవ వేడుకగా భావించే చారిత్రక సదర్ సమ్మేళనం అత్యంత వైభవంగా జరిగింది.
కదులుతున్న బస్సులోంచి తోసేయడంతో విషాదం.. ప్రభుత్వం రూ.10 లక్షల పరిహారం.!
టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన తాజా సంచలన చిత్రం ఇరుముడి చట్టపరమైన చిక్కుల్లో పడింది.
60 తులాల బంగారం, రూ.10 లక్షల నగదు అపహరణ.!
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
అవసరానికి ఆదుకుంటుందనే నమ్మకంతో ఓ వ్యక్తి ర్యాపిడో పార్సిల్ సేవలను ఆశ్రయించాడు.
బిగ్ బ్రదర్ ఆఫీసులో రియల్టర్‌కు ప్రత్యేక ఛాంబర్.. ఒక్క బిల్డర్ కోసం వేలాది కుటుంబాలను రోడ్డున పడేస్తారా?
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అమాయక యువతులను లక్ష్యంగా చేసుకుని గుట్టు చప్పుడు కాకుండా నడుపుతున్న మరో అక్రమ ఫెర్టిలిటీ రాకెట్‌ను పోలీసులు రట్టు చేశారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.